వైఎస్ జగన్‌పై తీవ్ర అసంతృప్తి.. ఆలీ రాజీనామాకు కారణాలు ఇవేనా!
ఏపీ ఎన్నికల్లో అతి దారుణంగా ప్రతిపక్ష హోదా లేకుండా ఓటమి పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాపులర్ కమెడియన్ ఆలీ రాజీనామా చేశారు. గత కొద్దికాలంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన సంచలన నిర్ణయం తీసుకొన్నారు అని తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఆలీ పార్టీకి దూరంగా ఉండటం మీడియాలోను, సినీ వర్గాల్లోను చర్చనీయాంశమైంది. అయితే ఆయన రాజీనామా వెనుక గల కారణాల్లోకి వెళితే..
సినిమా పరిశ్రమలో అందరివాడుగా పేరున్న కమెడియన్ ఆలీ మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అప్తుడిగా పేరు తెచ్చుకొన్నాడు. పవన్ నటించే సినిమాలో ఆలీ తప్పకుండా ఉండేవారంటే.. వారిద్దరి మధ్య అనుబంధానికి చిహ్నంగా ఉండేవారు. అయితే తన సన్నిహితుడిని విభేదించి ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అయితే ఆలీని పార్టీలో చేర్చుకొన్న వైఎస్ జగన్.. మొక్కుబడిగా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు అనే పోస్టును అంటగట్టారు. అయితే తొలుత ఎమ్మెల్సీ, లేదా వక్ఫ్ బోర్డు చైర్మన్ లాంటి పదవులు ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే తనకు ఇచ్చిన పదవిని ఆలీ అసంతృప్తిగానే ఉన్నారు. వైసీపీ పార్టీ ఆదేశాలను కూడా కొన్నిసార్లు పక్కన పెట్టి పవన్, చంద్రబాబును రోజా, పోసాని మాదిరిగా అడ్డగోలుగా విమర్శించడానికి ఒప్పుకోలేదనిది ఆ పార్టీ వర్గాలు చెప్పుకొంటాయి.
అయితే గత ఎన్నికల్లో ఆలీ పోటీ చేయడానికి ఉత్సాహం చూపారు. అయితే ఆయన పేరును పార్లమెంట్ అభ్యర్థిగా పరిశీలించారు. నంద్యాల గానీ, కర్నూలు స్థానం నుంచి పోటీ చేసేలా హామి కూడా ఇచ్చారని సమాచారం. అయితే ఆయనకు సీటు కేటాయించకపోవడంతో మరింత నిరాశకు గురయ్యారు. అలాగే జగన్ వ్యవహరించే తీరు కూడా నచ్చకపోవడం కూడా ఓ కారణంగా మారిందంటారు. అప్పటి నుంచి పార్టీ క్రీయాశీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
దాంతోపాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓటమి పాలు కావడంతో ఇక ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకొన్నారు. స్నేహితులు, సన్నిహితుల సూచన మేరకు సినిమా కెరీర్‌ను కొనసాగించేలా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడికి రాజీనామాను చేరవేశారు. దాంతో ఆయన రాజకీయ ప్రస్థానానికి బ్రేక్ పడింది.

ఆలీ కెరీర్ విషయానికి వస్తే.. సినీ, టెలివిజన్ రంగాల్లో విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఈటీవీలో అలీతో సరదాగా కార్యక్రమానికి మంచి ఆదరణ ఉంది. అలాగే ఇప్పటికే 1000కి పైగా సినిమాల్లో నటించిన ఆయనకు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. దాంతో ఆయన సినిమా కెరీర్‌పై దృష్టిపెట్టే దిశగా అడుగులు వేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











