‘రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు సైన్ చేసినట్టా? సమంత సిరీస్ సంతకం పెట్టినట్టా?’
రాజకీయ నేతలకు, సినిమా రంగానికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. అయితే తెలంగాణలో రాజధాని నగరం హైదరాబాద్‌లో ఫిలిం, పాలిటిక్స్ మధ్య రిలేషన్స్ మరింత లోతుగా కనిపిస్తాయి. సినిమా వ్యవహారాలను, రాజకీయాల నుంచి వేరు చేయలేనంతంగా కలిసి మెలిసి ఈ రెండు రంగాలు ట్రావెల్ చేస్తుంటాయి. పాలిటిక్స్‌పై సినిమా, సినిమా రంగంలోపై రాజకీయాలు ప్రభావం చూపే పరిస్థితుల్లో కొన్ని ఊహాగానాలు, ఆరోపణలు వస్తుంటాయి. అయితే ఈ క్రమంలో గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.ఆ వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే...
ప్రస్తుతం సినిమా రంగంపై, సినీమా రంగంలోని నటీనటులు, వారి వ్యక్తిగత జీవితాలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సునామీని సృష్టించాయి. అయితే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అప్పటి మంత్రి కేటీఆర్‌కు సినీ ప్రముఖులతో ఉన్న సంబంధాలపై రేవంత్ రెడ్డి సెటైర్లు వేసే వేయడం అత్యంత వివాదాస్పదమైంది.

ఒక దశలో ఎన్నికల ముందు కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన డ్రగ్స్ తీసుకొంటారు.. కావాలంటే నేను డ్రగ్స్ పరీక్షలకు సిద్దం.. ఆయన ఆ టెస్టులకు వస్తాడా? అంటూ మీడియా సమావేశంలో ఛాలెంజ్ విసిరారు. అంతే కాకుండా రకుల్ రావు అంటూ కూడా కామెంట్స్ చేయడం అత్యంత చర్చనీయాంశమైంది.
అయితే తనపై చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డిపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అయితే కేటీఆర్ పరువు నష్టం దావా గురించి గతంలో మీడియా అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తూ.. పరువు నష్టం దావా ఫైల్ చేయడమంటే..రకుల్ ప్రీత్ సినిమా సైన్ చేసినట్టా? లేదా సమంత సిరీస్‌కు సంతకం చేసినట్టా అంటూ కామెంట్ చేశారు. ఒకవేళ ఆయన పరువు విషయానికి వస్తే.. ఆయన పరువుకు ఎలా లెక్క కట్టారు. అసలు పరువు ఉందా? ఆ పరువు పోతే ఎవరు చెల్లించాలి అంటూ చురకలు అంటించారు.

అయితే తాజాగా కొండా సురేఖ తనపై వస్తున్న ట్రోల్స్ విషయంలో స్పందిస్తూ.. మహిళనైనా తనను కేటీఆర్ నీచంగా టార్గెట్ చేస్తున్నాడు. ఆయన మాదిరిగా సమంత, నాగచైతన్య విడాకులకు కారణం కాదు.. ఆయన వల్ల కొందరు సినిమా పరిశ్రమను వదిలేసి పారిపోయి పెళ్లి చేసుకొంటున్నారు కొందరు హీరోయిన్లు అంటూ కామెంట్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఆయనకు సన్నిహితులా? అని ఆరోపణలు చేయడం లేదు. నేను విచారణ అధికారిని కాదు. కేటీఆర్ పాత్ర ఉందా? రకుల్ ప్రీత్ సాత్ర ఉందా అని చెప్పడానికి అంటూ ఘాటుగా స్పందించారు.


Click it and Unblock the Notifications











