నిండా ముంచేశారు.. పవన్ కల్యాణ్‌పై ధ్వజమెత్తిన రోజా సెల్వమణి

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడను ముంచెత్తిన వరద ప్రాంతాల్లోని ప్రజలను కాపాడటంతో ప్రభుత్వం విఫలమైంది అని మాజీ మంత్రి రోజా సెల్వమణి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని ఆమె విమర్శించారు. బెజవాడ వరద బాధితులపై సానుభూతి ప్రదర్శించారు.తాజాగా ఆమె విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా కాపాడలేకపోయారంటే ఇది ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కాదా? అని ఆమె ప్రశ్నించారు. ఈ రోజు కరకట్టడాలను కాపాడటానికే విజయవాడ ప్రజలను ముంచెశారు అనడంలో నిజం లేదా ఆమె ఆరోపించారు.

Roja Selvamani attacks on Pawan Kalyan and Chandrababu Naidu over Vijayawada Floods

భారీ వర్షాల వల్ల విపత్తు ఉందని గంట ముందు చెప్పినా ముంపు బారిన పడేవారు కాదు. వారిని అప్రమత్తం చేసి వేరే సురక్షిత ప్రాంతానికి తరలిస్తే.. ఇన్ని లక్షల మంది నాలుగు లక్షల మంది ఇబ్బందులు పడే అవసరం లేదు అని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏమిటంటే.. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు శుక్రవారం వస్తుందా? హైదరాబాద్‌కు వెళ్దామా? విహార యాత్రలకు వెళ్దామా? అని ఆలోచిస్తుంటారు. వారికి ప్రజా సంక్షేమం మీద చిత్తశుద్ది లేకపోవడమే కారణం. ఈ ఐదురోజులు చూస్తే మీకే అర్దమవుతుంది అని రోజా అన్నారు.

Roja Selvamani attacks on Pawan Kalyan and Chandrababu Naidu over Vijayawada Floods

సెప్టెంబర్ 30 తేదీన భారీ వర్షాలు వస్తాయని రెండు రోజుల ముందే చెప్పినా.. ఎలాంటి సమీక్షలు జరుపలేదు. ప్రజలను కాపాడాలనే చిత్తశుద్ది లేదు. ప్రజలకు తిండి అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు.

ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి 70 ఏళ్ల వయసు. సరే ఆయన వయసు రీత్యా పనిచేయడం లేదు. పంచాయతీ రాజ్ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కనీసం తన శాఖను అప్రమత్తం చేయలేదు. ఐదు రోజులుగా విజయవాడకే రాలేదు అని రోజా తీవ్ర విమర్శలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X