ప్రతివత పరమాన్నం వండితే.. రోజాను దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్!

సినీ నటి, వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి రోజాపై నెటిజన్ల ట్రోలింగ్ కొనసాగుతూనే ఉంది. గత ఎన్నికల్లో నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి తర్వాత రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఆమె ప్రస్తుతం తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేసే పనిలో పడ్డారు. అయితే తాజాగా ఆమె ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్యాంటు వేసుకోకుండా మోకాళ్లపైకి ఫ్రాక్ వేసుకోవడం అందర్నీ షాక్ గురి చేసింది. గతంలో మహిళ దుస్తులపై నీతులు చెప్పిన ఆమెను నెటిజన్లు పాత వీడియోలను షేర్ చేస్తూ ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు.ఆ వివరాల్లోకి వెళితే..

మంత్రి పదవిలో రోజా ఉన్న సమయంలో దుస్తులు, వేషాధారణ గురించి ఓ టీడీపీ నేతను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కట్టుబొట్టు మరిచి.. నుదుట తిలకం, బొట్టు లేకుండా మగరాయుడిలా ఊరేగడమేమిటనే విధంగా ట్రోల్ చేశారు. భారతీయ సంప్రదాయలు మరిచి పాశ్చత్య పోకడలేంటి అని ఆమె ప్రశ్నించారు.

Roja selvamani heavily trolled by Netizens over dressing in Sydney Trip

అయితే నగరిలో ఎన్నికలు కాకముందే తన ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఆమె డిఫెన్స్‌లో పడిపోయారు. ఇక సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు తనను ఓడించారని ఆమె స్వయంగా ప్రకటించారు. సొంత నియోజకవర్గంలో అసమ్మతిని జీర్ణించుకోలేకపోయారు. దాంతో ఆమె ప్రస్తుతం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ చెన్నైలో ఉంటున్నట్టు సమాచారం.

అయితే ఓటమితో షాక్‌లో ఉన్న ఆమె తీర్ణయాత్రలు, విహారయాత్రలకు చేస్తున్నప్పటికీ..ఆమెను వివాదాలు చుట్టుముట్టడం ఆగలేదు. ఆలయంలో పారిశుద్ధ్య కార్మికులను దూరంగా ఉండాలని సూచించడం వివాదంగా మారింది. ఈ క్రమంలో దుస్తులు, వేషాధారణపై లెక్చర్ ఇచ్చిన ఆమె వెస్ట్రన్ అవుట్‌ఫిట్‌లో కనిపించడంతో నెటిజన్లు ఆడాడుకొన్నారు.

రోజాను ఉద్దేశించి నెటిజన్లు గతంలో ఆమె చెప్పిన నీతులను గుర్తు చేస్తున్నారు. సుద్దులు చెప్పడమే కాదు.. ఆచరించాలి. పదవులు అనుభవించినప్పుడు ఒకలా.. అధికారం లేకపోతే మరోలా ఉండకూడదు. ప్రతివత పరమాన్నం వండితే.. తెల్లారే వరకు చల్లారలేదన్నట్టు ఉంది రోజా వ్యవహారం అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, రోజా సెల్వమణి గురించి ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆమె ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకొంటున్నారు. ఇక తమిళ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఇళయదళపతి విజయ్ స్థాపించిన పార్టీలో చేరాలని ప్రయత్నిస్తున్నారనే విషయం ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.

More from Filmibeat

Read more about: roja selvamani jabardasth roja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X