పవన్ కల్యాణ్.. ఆ విషయంలో దమ్ముందా? అధికార మదంతో కాకుండా.. మాజీ మంత్రి రోజా ధ్వజం
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై సినీ హీరోయిన్, మాజీ మంత్రి వైసీపీ నేత రోజా సెల్వమణి ధ్వజమెత్తారు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళ్తున్న ఇద్దరు మెగా అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతలు తీవ్రమైన దాడి పెంచారు. యాంకర్ శ్యామల తర్వాత రోజా కూడా తన మాటల దాడిని సోషల్ మీడియాలో పెంచారు. ఈ వివరాల్లోకి వెళితే..
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇద్దరు యువకులకు జనసేన, పవన్ కల్యాణ్ వర్గాలు స్పందిస్తున్నాయి. వారికి ఆర్థిక సహాయం అందించేందుకు రెడీ అయ్యారు. బాధితు కుటుంబాలను ఇప్పటికే జనసేన నేతలు పరామర్శించారు. వారి కుటుంబాలను ఆదుకొనేందుకు చర్యలు చేపట్టే పనిలో ఉన్నారు.

గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాత దిల్ రాజు ఈ రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకొన్న వెంటనే మీడియా ద్వారా స్పందించారు. బాధిత కుటుంబాలతో గేమ్ ఛేంజర్ టీమ్ పరామర్శించింది. దిల్ రాజు వెంటనే 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. వారి కుటుంబాల జరిగిన తీవ్రమైన నష్టానిది పూడ్చలేనిది అంటూ వారికి ఉపశమనం కలిగించే ర్యలు చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రోజా సెల్వమణి ఘాటుగా స్పందించారు.
మాజీ మంత్రి రోజా సెల్వమణి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్టు వైరల్ అయింది. ఆమె తన పోస్టులో బాధితుల వీడియోను కూడా పోస్టు చేశారు. బాధితులకు సమాధానం చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. రోజా చేసిన పోస్టు ప్రకారం.. కన్న బిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్నారు. పవన్ కల్యాణ్ గారు ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా? అధికారమదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి! రోజా ప్రశ్నించారు.

అయితే రోజా మాటల దాడికి పవన్ కల్యాణ్ స్పందిస్తారా? లేదా అనే వేచి చూడాల్సిందే. అయితే రోజా ఘాటైన వ్యాఖ్యలకు జనసేన నేతలు ఏ విధంగా స్పందిస్తారు? ఈ వివాదాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారా? లేదా రోజా ప్రశ్నలకు మౌనంగా ఉండి.. బాధితులకు న్యాయం చేసే విషయంలో తమ పని తాము చేసుకొంటూ వెళ్తారా? అనేది కాలమే సమాధానమే చెబుతుంది.
మెగా పవర్ స్టార్ రాంచరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్, ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్‌లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ఈవెంట్ శుక్రవారం రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొన్నారు. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తోపాటు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ చిత్రం జనవరి 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది.
కన్న బిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా @PawanKalyan? ఆత్మపరిశీలన చేసుకోండి! అధికారమదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి!!#SaveAPYouth pic.twitter.com/PboRQmUQXc
— Roja Selvamani (@RojaSelvamaniRK) January 7, 2025


Click it and Unblock the Notifications











