పవన్ కల్యాణ్ ఎక్కడున్నావు?.. నా కూతుర్ని వేధించలేదా? రోజా సంచలన కామెంట్స్
సినిమాలు రాజకీయాలు వేరు వేరు అనేది ఒకప్పటి మాట కానీ ఇపుడు మాత్రం రెండు దాదాపు ఒకటే అన్నట్టుగా పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. కాగా సినీ పరిశ్రమకి చెందిన స్టార్స్ రాజకీయాల్లో అరంగేట్రం అవ్వడం ఇపుడు ఆనవాయితీగా మారిపోయింది. అలా ఒకో స్టార్ హీరో పార్టీలు పెట్టి రాణిస్తున్నారు.
కాగా కొన్ని రోజులు కితమే తమిళ హీరో విజయ్ దళపతి తన పార్టీ సభతో నేషనల్ వైడ్ ట్రెండింగ్ అయ్యాడు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇపుడు ఆ తరహాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరే ఉన్నారు. ఇలా పవన్ వచ్చిన పదేళ్ల ప్రస్థానంలో రెండో సారి ఎన్నికల్లో పాల్గొని పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాకి వెళ్లగలిగారు.

అయితే ఇన్నేళ్ళలో పవన్ కి ఒక్క రాజకీయాల్లోనే కాకుండా తన సినిమా రంగం నుంచి కూడా ఇతర పార్టీలలో ఉన్న వారితో దారుణంగా మాటలు పడాల్సి వచ్చింది. అది కూడా తెలుగు సినిమాలో ప్రముఖ నటీనటుల తోనే.. అయినప్పటికీ పవన్ ఒక్కసారి అయినా కూడా ఎవరిని పళ్లెత్తి ఒక్క మాట అనడమో లేదా వారు పవన్ ని పర్శనల్ గా టార్గెట్ చేసినట్టుగా తాను పర్శనల్ కామెంట్స్ చేయడం వంటివి ఎన్నడూ చేయలేదు.
అయితే పవన్ ని సినిమా వాళ్ళే దారుణంగా వ్యాఖ్యానించిన వారిలో ప్రముఖ సీనియర్ నటి ఆర్కే రోజా సెల్వమణి కూడా ఒకరు. గత ఎన్నికల్లో కానీ అంతకు ముందు కానీ పవన్ విషయంలో రోజా ఏ తరహా కామెంట్స్ చేసారో తెలియంది కాదు. కాగా ఇపుడు మరోసారి రోజా షాకింగ్ కామెంట్స్ చేసారు.
పవన్ కల్యాణ్‌కు మాత్రమే కూతుళ్లు ఉన్నారా? మాకు కూతుళ్లు లేరా? నా కూతురు ఏం తప్పు చేసిందని వేధించారు? నా మీద, మా పిల్లల మీద ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో రాసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? అధికారంలో ఉండి ఇవాళ నంగి ఏడుపులతో మాట్లాడుతున్నారు? అంటూ కామెంట్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతున్నది.

దీనితో ఈ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. మరి పవన్ పై చేసిన కామెంట్స్ కి పవన్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ట్=రోజా ఉన్న పార్టీ వారే పవన్ కుటుంబలో ఆడపిల్లల్ని అన్నపుడు రోజా ఏ విధంగా స్పందించారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే మరోసారి పవన్ విషయంలో రోజా చేసిన కాంట్రవర్సియల్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇక ప్రస్తుతం రోజా రాజకీయాల్లోనే బిజీగా ఉండగా ఇతర సినిమాలు కానీ షోలు కానీ ఏమీ చేయడం లేదు. అలాగే ఆ మధ్య పలు షోస్‌కు ట్రై చేసినా కూడా తెలుగు సహా తమిళ్ లో కూడా ఆమె పట్ల ఎవరూ ఆసక్తిగా లేరని కూడా టాక్ వినిపించింది. ఇక పవన్ ఇపుడు రాజకీయాలు సహా తన రెండు భారీ సినిమాలు హరిహర వీరమల్లు, ఓజి అనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











