సినీ నటి రోజా మెడకు 100 కోట్ల భారీ కుంభకోణం.. యువ వైసీపీ నేతకు కూడా స్కెచ్ వేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం
ఏపీ ఎన్నికల్లో దారుణమైన ఓటమి చవిచూసిన సినీ నటి, మాజీ మంత్రి రోజా సెల్వమణికి కష్టాలు పొంచి ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో టూరిజం మంత్రిగా పనిచేసిన ఆమె అనేక అక్రమాలు, కుంభకోణాలకు పాల్పడినట్టు తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఆరోపిష్తున్నారు. ఈ క్రమంలో ఆమెపై సీఐడీ విచారణకు ఆదేశించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్టు సమాచారం. ఈ కుంభకోణం వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆటాడుదాం ఆంధ్ర పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. యువతను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి నిధులు కేటాయించారు. అయితే ఈ నిధులు భారీగా దారి మళ్లాయి అనే ఆరోపణలు ఎన్నికల ముందే ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే వాటిని రోజా తీవ్రంగా వ్యతిరేకించి కొట్టిపడేయడమే కాకుండా ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడింది.

తాజా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ దారుణ పరాజయం పొందింది. అయితే కొత్తగా ఏర్పాటైన టీడీపీ, జనసేన ప్రభుత్వం ఈ ఆరోపణలపై దృష్టి సారించింది. యువతకు మేలు చేయాల్సిన ఈ నిధులు ఎలా దారి మళ్లాయి? ఎన్ని కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారు అనే విషయంపై దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది.
మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఆడుదాం ఆంధ్ర.. సీఎం కప్ కార్యక్రమంలో సుమారుగా 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఈ కుంభకోణంలో భారీగా ముడుపులు ముట్టాయి. ఈ అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించేందుకు ప్రభుత్వం పావులు కదుతుపున్నట్టు సమాచారం.

ఇక రోజాపై 100 కోట్ల ఆరోపణలే కాకుండా తిరుమలలో టీటీడీ టికెట్ల అమ్మకాల్లో కూడా అవినీతి జరిగింది. మినిస్టర్ కోటాలోని వీఐపీ, ప్రొటోకాల్ టికెట్లను భారీ రేటుకు అమ్ముకొన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలు సినీ నటి రోజా మెడకు చుట్టుకొనే అవకాశం ఉంది. ఈ ఆరోపణలపై రోజా ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉండగా, ఈ ఆరోపణల్లో యువ వైసీపీ నేతపై కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇద్దరిపై విచారణకు ఆదేశించే అవకాశం ఉందనే విషయాన్ని టీడీపీ వర్గాలు నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి.


Click it and Unblock the Notifications











