సమంతకు కేటీఆర్ ఆ పదవి.. ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా లాలూచీ పడ్డావా? రఘునందన్ ఫైర్
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని నిర్మించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయం రాజకీయ రంగు పులుముకొంటున్నది. మాదాపూర్‌కు సమీపంలోని హైటెక్ సిటీకి సమీపంలోని తుమ్మడికుంట చెరువును అక్రమంగా ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్‌ను నిర్మించడంపై గత 10 ఏళ్లుగా వివాదం కొససాగుతున్నది. అయితే 2014 నుంచి కొనసాగుతున్న ఈ వివాదానికి తెలంగాణ సర్కార్, సీఎం రేవంత్ రెడ్డి ముగింపు పలకడంతో ఈ వివాదం మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై బీజేపీ నేత రఘునందన్ రావు ఘాటుగా స్పందిస్తూ..
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ మా భూములు మాకే అంటూ నినాదం ఇచ్చారు. అక్రమంగా నిర్మించారనే ఆరోపణలు చేస్తూ లాంకో హిల్స్, పద్మాలయ స్టూడియో, రాఘవేంద్రరావు భూ కబ్జాలు చేశారు. అలాంటి ఆంధ్రా వారి చెరలో ఉన్న భూములను లాగేసుకోవాలని డిమాండ్ చేశారు అని రఘునందన్ రావు అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. పద్మాలయ స్టూడియోలో సర్వీస్ అపార్ట్‌మెంట్స్ వచ్చాయి. గురుకుల భూముల్లో ఎరా సిరాతో అక్రమ ఆస్తులు అంటూ మార్క్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నోటీసులు ఇచ్చారు. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత హైకోర్టు తీర్పు ఇస్తూ.. ఎన్ కన్వెన్షన్ నిర్మాణం అక్రమ కట్టడం.. దానిని కూల్చివేయాలి అని పేర్కొన్నది.
అయితే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్.. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు. కోర్టు ఉత్తర్వులపై 10 ఏళ్లు ఎందుకు మీనమేషాలు లెక్కించారు? ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణలను కూల్చివేయకుండా సమంతను చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా ఎందుకు నియమించారు? దాని వెనుక ఆంతర్యం ఏమిటి? అని రఘునందన్ రావు ప్రశ్నించారు.

కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ 2014 నుంచి ఎన్ కన్వెన్షన్‌లో అక్రమంగా వాప్యారం చేస్తున్నారు. ప్రతీ ఫంక్షన్‌కు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు వసూలు చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా సంపాదించిన సొమ్మును రాష్ట్ర ఖజానాకు జమ చేస్తారా? ఎన్ కన్వెన్షన్‌లో అక్రమ నిర్మాణాలను ఎందుకు తొలగించలేదు? దాని వెనుక లాలూచీ ఏమిటి? అని కేటీఆర్ ప్రశ్నించారు.
అక్రమ నిర్మాణాల తొలగింపు వ్యవహారంలో రేవంత్ రెడ్డి, కేటీఆర్, పొంగులేటికి ఒకే ప్రశ్న. 2015 నుంచి కోర్టు ఉత్వర్వులను ఎందుకు అమలు చేయలేదు. కంప్యూటర్ గురించి, టెక్నాలజీ గురించి మీకు అంతా తెలుసు కదా.. కేటీఆర్.. ఈ విషయంలో మీనమేషాలు ఎందుకు లెక్కించారు అని రఘునందన్ రావు నిలదీశారు.


Click it and Unblock the Notifications











