పవన్ కల్యాణ్ వల్లే.. అప్పుడే వైఎస్ జగన్ భరతం పట్టిన బుల్లిరాజు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. సంక్రాంతి సీజన్‌లో క్లీన్ హిట్‌గా ఈ సినిమా నిలిచింది.
కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపరిచింది. అలా వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం దిశగా అడుగులు వేస్తోంది . మూడు రోజుల వరకు ఈ సినిమా రూ. 106 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు.. వెంకటేశ్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వరుసగా మూడు సార్లు రూ.100 కోట్ల మార్క్ సాధించి హ్యాట్రిక్ కొట్టారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

కామెడీ, పాటలు, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సమపాళ్లలో ఉండటంతో సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఓవర్సీస్‌లోనూ సంక్రాంతి వస్తున్నాం మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్లకు పైగా అందుకుంది. వసూళ్లే కాదు.. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలోనూ సంక్రాంతికి వస్తున్నాం సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
మూడు రోజుల్లో రూ. 1.5 మిలియన్ టికెట్లు తెగినట్లు బుక్ మై షో అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి సెలవులు, వీకెండ్‌కు తోడు ఫ్యామిలీకి కావాల్సిన సరకు ఉండటంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్‌కు వస్తున్నారు. దీంతో అన్ని ఏరియాలూ కళకళలాడుతున్నాయి. సినిమాకు వస్తున్న ఆదరణ దృష్ట్యా అదనపు షోలను ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తెలిపింది.
ఇకపోతే ఈ సినిమాకు వెంకటేష్ నటన, అనిల్ రావిపూడి టేకింగ్‌తో పాటు ప్లస్ పాయింట్‌గా నిలిచాడు ఓ బుడ్డోడు. ఈ సినిమాలో వెంకీకి కొడుగ్గా నటించిన బుల్లిరాజు అలియాస్ రేవంత్ తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఈ చిన్నారికి మంచి భవిష్యత్ ఉందని చిత్ర యూనిట్‌తో పాటు విమర్శకులు ప్రశంసిస్తున్నారు. దీంతో ఈ చిన్నారి ఎవరు? సినిమాల్లోకి ఎలా వచ్చారు? అనే అంశాలపై నెటిజన్లు చర్చిస్తున్నారు.
🤍🤍 #VoteForGlass pic.twitter.com/sSMtRteFIi
— Pawanism Network (@PawanismNetwork) May 6, 2024
గోదావరి జిల్లాలకు చెందిన రేవంత్ ప్రతిభావంతుడే కాదు.. చిన్న వయసులోనే ఏకంగా వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా నిలబడ్డాడు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన ఈ చిన్నోడు .. ఎన్నికల్లో జనసేన , టీడీపీలకే ఓటు వేయాలని ఇంటింటికి ప్రచారం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఈ వీడియో చూసిన దిల్‌రాజు, అనిల్ రావిపూడిలు రేవంత్‌కు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో అవకాశం ఇచ్చారు. సో.. అదన్నమాట బుల్లిరాజు సంగతి.


Click it and Unblock the Notifications











