‘ఇండస్ట్రీ నుంచి రోజాపై నిషేధం.. అవినితీ కేసుల్లో వారితోపాటు అరెస్ట్ తప్పదు‘

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించడం, అవినీతి బయటకు వెలికి తీయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపులకు దిగుతోందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమలో కొందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని కూటమి నేతలు ఎన్నికల ప్రచారం ఆరోపించారు. భూ కబ్జాలు, ఇసుక అక్రమ తవ్వకాలు, మైనింగ్, మద్యం, రేషన్ బియ్యం, డ్రగ్స్ రవాణా, కాంట్రాక్టులు ఇలా అన్ని రంగాల్లో వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు సంపాదించారని వారు విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని , అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత సైతం ఇదే రకమైన హెచ్చరికలు చేశారు.

senior journalist imandi rama rao made sensational comments on ex minister rk roja corruption

ఈ లిస్ట్‌లో ఫస్ట్ పేరు రోజాదేననే టాక్ వినిపిస్తోంది. వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా.. సీఎం జగన్‌పై ఈగ వాలనిచ్చేవారు కాదు రోజా. పదునైన మాటలతో ప్రత్యర్ధులు సైతం సైలెంట్ అవ్వాల్సిందే. జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమె.. తర్వాత మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణలో మంత్రి పదవిని కొట్టేశారు. క్రీడా, పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా రోజా ఓ వెలుగు వెలిగారు. జగన్ కేబినెట్‌లో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం - ఆంధ్ర, సీఎం కప్‌ల పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.

దాదాపు రూ.100 కోట్లు స్కాం జరిగిందని.. రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు. ఈ మేరకు సీఐడీకి ఆత్యా - పాత్యా సంఘం, కబడ్డీ అసోసియేషన్, ఇతర క్రీడా సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరి సంచలన ఆరోపణలు చేశారు. క్రీడా పరికరాల కొనుగోలులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఆడుదాం ఆంధ్ర పోటీల్లో నాసిరకపు క్రీడా కిట్లను ఎక్కువ ధరలకు కొనుగోలు చేశారంటూ ఆరోపిస్తున్నారు. క్రీడాకారుల కోటా ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు పొందినవారిపై విచారణ జరపాలని నేతలు చెబుతున్నారు.

దీనికి తోడు విశాఖ రుషికొండపై జగన్ ప్రభుత్వం కట్టిన విశాలమైన ప్యాలెస్ విషయంలోనూ రోజా పేరు తెరపైకి వినిపిస్తోంది. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు .. రోజా విశాఖకు చెందిన పలువురు కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేసిందని టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే రుషికొండ భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్ సైతం రోజాకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టజెప్పారని, ఆ డబ్బుతోనే ఆమె బెంజ్ కారు కొనుగోలు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.

senior journalist imandi rama rao made sensational comments on ex minister rk roja corruption

ఏపీలో తాజా పరిణామాల నేపథ్యంలో రోజా అడ్డంగా బుక్కయ్యారని, నేడో రేపో ఆమెను అరెస్ట్ చేయడం ఖాయమనే ఊహాగానాలు మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు రోజాపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాక ఆమె కొన్ని అవినీతి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. నగరి, హైదరాబాద్, విశాఖలలో విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు ఉన్నాయని రామారావు ఆరోపించారు.

రోజా సోదరులు కూడా సెటిల్‌మెంట్లు చేసేవారని స్థానికులు చెబుతున్నారని, మీడియాలోనూ దీనిపై రకరకాలుగా కథనాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. తప్పు చేసినప్పుడు శిక్ష తప్పదని రామారావు కుండబద్ధలు కొట్టారు. రాబోయే రోజుల్లో రోజాకు సినిమాలు, షోలలోనూ ఛాన్స్‌లు రావని, ఆమెపై అనధికార బ్యాన్ విధిస్తారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రామారావు చెప్పిన జోస్యం నిజమవుతుందో లేదో కానీ.. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X