పవన్ కల్యాణ్‌ను విజయ్ ఫాలో అవుతున్నాడా? పొలిటికల్‌గా అలాంటి పోలికలు?
ఎన్నో ఏళ్ళు కితం నుంచే సినీ పరిశ్రమకి చెందిన అనేకమంది నటీనటులు తమకి సంబంధమే లేని లీగ్ రాజకీయాల్లోకి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అయితే వెండితెరపై తమని ఎంతగానో ఆదరించిన తనని తన తరపున సినిమాలు కాకుండా నిజ జీవితంలో తన సమాజం మొత్తానికి మంచి చేయాలి అంటే ఆ నటీనటులకు ఉన్న అతి పెద్ద ప్లాట్ ఫామ్ రాజకీయాలే..
కాగా తెలుగు తమిళ్ సహా హిందీలో కూడా చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో ఉన్నారు. మరి ఇప్పటికీ మరింత మంది సినీ స్టార్స్ పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి తమ వంతు జనానికి ఏదన్నా చేయాలి అని చూస్తున్నారు. కాగా ఇపుడు సౌత్ ఇండియా మొత్తం అంతా కూడా మాట్లాడుతున్న సినిమా హీరో పొలిటికల్ ఎంట్రీ ఏదన్నా ఉంది అంటే అది దళపతి విజయ్ చేసిన రాజకీయ అరంగేట్రమ్ అని చెప్పాలి.

కాగా విజయ్ తన పార్టీ "తమిళగ వెట్రి కళగం" ని ఎప్పుడో అనౌన్స్ చేసి జెండా కూడా ఆవిష్కరించాడు. కానీ నిన్ననే తమిళ నాట రాజకీయ నాయకుల కళ్ళు చెదిరే భారీ బహిరంగ సభని తాను ఏర్పాటు చేసి పాల్గొని సెన్సేషనల్ స్పీచ్ ని ఇచ్చి దుమ్ము లేపాడు. అయితే ఈ స్పీచ్ అండ్ ఆ భారీ మీటింగ్ విజువల్స్ తో ఆటోమేటిక్ గా మన తెలుగు రాష్ట్రాల పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు కూడా ప్రస్తావనలోకి సోషల్ మీడియా నెటిజన్స్ నడుమ వచ్చేసింది.
అయితే ఇపుడు ఇద్దరి నడుమ చాలా పోలికలు కనిపిస్తున్నాయని చెప్పాలి. మొదటిగా విజయ్ తన పీక్ స్టేజి లోనే సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాడు అలాగే అప్పుడు పవన్ కూడా తన కెరీర్ పీక్ అందుకున్న స్టేజి లోనే రాజకీయ పార్టీ అనౌన్స్ చేసాడు. అలాగే బహిరంగ సభ పరంగా విశేష జనాదరణ విషయంలో కూడా ఇద్దరికీ పోలికలు లేకపోలేవు.
విజయ్ సభకి ఏకంగా 8 లక్షల మంది జనం వస్తే పవన్ పెట్టిన ఎన్నో సభలకి 10 లక్షల మేర హాజరయ్యారు. ఇలా క్రౌడ్ పుల్లింగ్ కూడా ఇద్దరి నడుమ పలు విజువల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అయితే అప్పుడు పవన్ అధికార పార్టీపై ఎలా అయితే డైరెక్ట్ అటాక్ చేసాడో ఇపుడు విజయ్ కూడా తమిళ నాట ఉన్న అధికార పార్టీని కూడా అటాక్ చేసాడని కోలీవుడ్ జనం అంటున్నారు.

ఇంకా ఓ సమస్య పట్ల పవన్ అగ్రెసివ్ గా ఊగిపోయి మాట్లాడుతాడు అంటూ కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. అలా ఎవరు ఉండరు పవన్ మాత్రమే ఓవర్ గా రియాక్ట్ అవుతాడు అంటారు. కానీ నిన్న మీటింగ్ లో విజయ్ కూడా అంతే అగ్రేషన్ తో మాట్లాడిన క్లిప్స్ ఆ కామెంట్స్ చేసిన వారి అందరి నోర్లు మూయించాయి. ఇక ఇది కాకుండా ఇంకో ముఖ్య పాయింట్ లో కూడా పవన్ బాటలోనే విజయ్ ఉన్నట్టు అనిపిస్తుంది.
విజయ్ తమ పార్టీ రానున్న 2026 ఎన్నికల్లో పోటీ చేస్తారు ఈ పోటీలో తాము అలయన్స్ పెట్టుకొని పోటీ చేయడానికి సిద్ధమే అని చెబుతున్నారు. దీనితో ఇలా చాలా రకాలుగా ఇద్దరి నడుమ చాలా పోలికలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అయితే సినిమా నటులు రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే అందరిలో భిన్నాభిప్రాయాలు కామన్ గానే ఉంటాయి. మరి విజయ్ ఇచ్చిన మొదటి మీటింగ్ నే బ్లాక్ బస్టర్ అయ్యింది అని టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి రానున్న రోజుల్లో విజయ్ ఏ విధంగా తన పార్టీని నడిపిస్తాడో చూడాలని చాలా మంది అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











