‘డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసలైన ఇండియన్ .. 3 ఏళ్ల క్రితమే నేను చెప్పిందే నిజమైంది’

ఇండియన్ లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఇండియన్ 2. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మాత సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా జూలై 12వ తేదీన రిలీజ్ అవుతున్నది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కమల్, శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ఎస్‌జే సూర్య, బ్రహ్మనందం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖుషీ దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య మాట్లాడుతూ..

ఇండియన్ 2 మూవీ ఎప్పుడెప్పుడు సినిమా వస్తే చూద్దామా? అనే ఆత్రుతలో అందరూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇండియన్ 2, గేమ్ చేంజర్, ఇండియన్ 3 సినిమాల్లో నటించే అవకాశం, అదృష్టం నాకు దక్కింది. ఇండియన్ 2 నా పాత్ర అతిథి పాత్రగా ఉంటుంది. కానీ చాలా ఇంపార్టెంట్ పాత్ర అని అన్నారు. ఇండియన్ 3 మూవీలో నా పాత్ర ఎక్కువగా ఉంటుంది అని అన్నారు.

SJ Suryah emotional words about Pawan Kalyan at Kamal Haasan s Indian 2 pre release Event

కమల్ హాసన్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మార్క్ ఆంటోనిలో నేను గడ్డం పెట్టుకుని నటించేందుకు చాలా కష్టపడ్డా. కానీ కమల్ హాసన్ గారు ఈ వయసులోనూ ప్రోస్థటిక్ మేకప్‌తో ఉదయం నుంచి రాత్రి వరకు అలానే ఉండేవారు. ఆయనకు సినిమా పట్ల ఉండే అంకిత భావం అది అని ఎస్ జే సూర్య అన్నారు.

కమల్ హాసన్ డెడికేషన్ ముందు మనం ఎంత డబ్బు ఇచ్చినా తక్కువే అవుతుంది. ప్రేమతో మాత్రమే దాన్ని కొలవగలం. ఆయన దగ్గర్నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇళ్లు కట్టి చూడండి.. పెళ్లి చూసి చూడండి అని అంటారు.. కానీ శంకర్ గారి సెట్‌లో ప్రతీ రోజూ పది ఇళ్లు కట్టినట్టు.. పది పెళ్లిళ్లు చేసినట్టు ఉంటుంది. బ్రహ్మాండం అనే పదానికి శంకర్ గారు సూట్ అవుతారు అని అన్నారు.

SJ Suryah emotional words about Pawan Kalyan at Kamal Haasan s Indian 2 pre release Event

శంకర్ విజన్ ఎలాంటిందంటే.. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 లాంటి మూడు పెద్ద సినిమాలు ఒకే సారి తీశారు. ఏ నటుడి నుంచి ఎంత రాబట్టుకోవాలో తెలిసిన దర్శకుడు. మంచి ఎమోషన్, మెసెజ్ ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. జూలై 12న మా చిత్రం రాబోతోంది. బ్రహ్మాండమైన విజయాన్ని అందించండి అని అన్నారు.

ఇండియాకు మంచి చేసే ప్రతీ ఒక్కరు ఇండియన్ అని కమల్ హాసన్ చెప్పారు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. అసలైన ఇండియన్ అంటే నా స్నేహితుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. నేను ముందే చెప్పాను. ఏదో ఒక రోజు పవన్ కల్యాణ్ సీఎం కావడం గ్యారెంటీ. ఆంధ్రప్రదేశ్‌కు సీఎం నా స్నేహితుడు అవుతాడని గౌరవంగా చెప్పాను. మూడేళ్ల ముందే నేను ఊహించాను. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు. నా మాటలు రుజువు అయ్యాయి. ఇక సీఎం చేసే బాధ్యత మీదే. మీరే నిజం చేయాలి అని సూర్య భావోద్వేగంతో మాట్లాడారు.

More from Filmibeat

Read more about: sj suryah pawan kalyan indian 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X