‘నయనతారను పెళ్లి చేసుకోవాలంటే.. తీసుకొచ్చి ఆమెతో సీఎం పెళ్లి జరిపిస్తాడా?’
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా ప్రారంభమైంది. త్వరలో జరిగే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒక పార్టీ మరో పార్టీపై మాటల యుద్దం చేస్తున్నాయి. ఒకరిపై మరొకరు బురద జల్లుకొనే ప్రయత్నాలు మమ్మురం చేశారు. ప్రచార హోరు ఓ వైపు.. ఎన్నికల్లో విజయం సాధించడానికి హామీలు గుప్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికార డీఎంకే పార్టీకి విమర్శించే క్రమంలో స్టార్ హీరోయిన్ నయనతారను వివాదంలోకి లాగుతూ ప్రతిపక్ష పార్టీ అాన్నాడీఎంకే పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం సృష్టిస్తున్నాయి. నయనతారను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఏమిటి? ఈ వివాదం వెనుక కారణ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వేసవి ఎండలు మించి వేడిని చూపిస్తున్నాయి. ఈాసారి సూపర్ స్టార్ విజయ్ తాను స్థాపించిన టీవీకే పార్టీ తరుఫున బరిలోకి దిగడంతో లెక్కలు మారిపోయాయి. దాంతో పార్టీల మధ్య పోటీ, అంచనాల విషయంలో అనిశ్చితి కొనసాగుతున్నది. ఓటర్లను ఆకర్షించేందుకు అన్నీ పార్టీలు హామీలను గుప్పిస్తున్నాయి.

అదికారంలోని డీఎంకే పార్టీ మరోసారి విజయం సాధించడానికి వినూత్నమైన ప్రచారాన్ని సాగిస్తున్నది. సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. మీ మనసులోని కోరికలు చెప్పండి.. వాటిని నెరవేర్చుతాం అంటూ ఇటీవల ఓ హామీ ఇచ్చారు. అయితే ఈ హామీని ప్రతిపక్ష పార్టీ నేతలు ఎద్దేవా చేసినట్టు మాట్లాడుతున్నారు. అయితే ఏఐడీఎంకే పార్టీ నేన, రాజ్యసభ ఎంపీ సీవీ షణ్ముగం విమర్శలు సంధిస్తూ నోరు జారారు. దాంతో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం తప్పు అంటూ అధికార పార్టీ నేతలు విరుచుకు పడుతున్నారు.
అధికార పార్టీ విధానాలపై ధర్నా నిర్వహిస్తూ చేపట్టిన ర్యాలీలో షణ్ముగం మాట్లాడుతూ.. సీఎం స్టాలిన్‌పై విమర్శలు గుప్పించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కలలు కనమన్నారు. అలాగే సీఎం స్టాలిన్ కూడా కలలు కనమని చెప్పారు. ఒకవేళ నాకు నయనతార ఇష్టం. ఆమె కావాలంటే నాకు తెచ్చి ఇస్తారా? నా కలను నెరవేర్చుతాడా? ఎవరైనా నయనతారను పెళ్లి చేసుకోవాలనుకొంటే.. ఆమెను తీసుకొచ్చి కట్టబెడుతాడా? ఇలాంటి కోరికలను సీఎం తీర్చుతాడా? అంటూ కామెంట్ చేశాడు.

అయితే షణ్ముగం చేసిన కామెంట్స్ తీవ్ర వివాదంగా మారాయి. దాంతో డీఎంకే పార్టీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. వారు మహిళల రక్షణ కోసం ఫైట్ చేస్తామని చెబుతారు. కానీ స్త్రీలను కించపరిచే విధంగా దుర్భాషలు ఆడుతారు. అది వారీ క్యారెక్టర్. జేబులో తమ నేత జయలలిత ఫోటో పెట్టుకొంటారు. కానీ నోటికి వచ్చినట్టు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతారు అంటూ డీఎంకే నతే వనిత ఘాటుగా స్పందించారు.
నయనతార కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో కలిసి మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నటించారు. ఈ చిత్రంలో ఆమె తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. చిరంజీవి, నయనతార కాంబినేషన్‌కు భారీ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా సుమారుగా 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసుకొన్నది.


Click it and Unblock the Notifications

















