వైసీపీ నేతలను వదలని 11 ట్రోల్స్.. సినిమాలేనా దానిని కూడా బాయ్‌కాట్ చేస్తారా?
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఎమోషన్ గా మారిన నెంబర్ ఏదన్నా ఉంది అంటే అది డబుల్ వన్ (11) అని చెప్పాలి. మరి తెలుగులో పదకొండు అని పిలుచుకునే ఈ సంఖ్య పెద్ద రచ్చే చేస్తుంది. కాగా గత ఏడాది ఆంధ్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తర్వాత ఈ నెంబర్ కి వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు.
కాగా అప్పటి వరకు అధికారంలో ఉన్న ఓ పార్టీ ఇంకో 30 ఏళ్ళు మేమే ఏపీలో రాజ్యం ఏలుతాం అని చెప్పుకొచ్చినవారు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవడం అనేది షాకింగ్ గా మారింది. కాగా ఇక్కడ నుంచి ఓ రేంజ్ లో ఈ 11 నెంబర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఏపీ వరకు మాత్రం సినిమాలు రాజకీయాలు కలిపే నడుస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు.

సినిమా వాళ్ళు రాజకీయాల్లో వేలు పెడుతుంటే రాజకీయ నాయకులు కూడా సినీ వాళ్ళని టార్గెట్ చేయడం జరిగింది. ఇలా రెండు మిళితం అయ్యిపోయాయి. కాగా ఇలా నెంబర్ లెవెన్ పై ట్రోల్స్ కొనసాగుతూ ఉండగా రీసెంట్ గా టాలీవుడ్ యువ హీరో బుక్కయ్యాడు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన "లైలా" ఈవెంట్ లో ప్రముఖ నటుడు 30 ఇయర్స్ పృథ్వీ చేసిన సంచలన కామెంట్స్ వైసీపీ అభిమానుల్లో ఫైర్ పుట్టించాయి.
దీనితో ఆ సినిమాని బాయ్ కాట్ చెయ్యాలని పెద్ద ట్రెండ్ కూడా చేశారు. అయితే వీరి ట్రెండ్ వల్ల కాదు కానీ సినిమాలో పెద్దగా మేటర్ లేదని జనం ముఖం చాటేశారు. అయితే ఈ క్రెడిట్ ని వైసీపీ ఫ్యాన్స్ తీసుకున్నారు. దీనితో ఇక్కడ నుంచి 11 అని ఎవరు అన్నా కూడా ఇలానే టార్గెట్ చేస్తారా అని సోషల్ మీడియాలో వారిపై పలు కామెంట్స్ వస్తున్నాయి.
ఇది ఇపుడు క్రికెట్ వరకు కూడా వచ్చింది. మన తెలుగు రాష్ట్రాలకి ఉన్న ఏకైక తెలుగు ఐపీఎల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్. ఇది అందరికీ తెలుసు. కాగా ఈ వీరి సోషల్ మీడియాలో వచ్చిన ఓ 11 నెంబర్ పోస్ట్ ఇపుడు ట్రెండింగ్ గా మారింది. లైలా సినిమాకి జరిగిన డ్రామా తర్వాత మళ్ళీ అదే నెంబర్ తో సన్ రైజర్స్ వారు కూడా పోస్ట్ చేయడంతో ఇదీ ట్రిగ్గర్ చేసేలానే అనిపించింది చాలా మందికి. అయితే దీనిపై మళ్ళీ ట్రోల్స్ మొదలయ్యాయి.
సినిమాని బాయ్ కాట్ చేశారు ఇపుడు ఆ బ్యాచ్ అంతా ఐపీఎల్ టీమ్ ని కూడా బాయ్ కాట్ చేస్తారా అంటూ సోషల్ మీడియాలో వారిపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొంతమంది వైసీపీ ఫ్యాన్స్ ఎస్ ఆర్ హెచ్ హ్యాండిల్ అడ్మిన్ పై కూడా పురాణం స్టార్ట్ చేశారు. కాగా ఇదే నెంబర్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హ్యాండిల్ కూడా ఆ మధ్య ఓ పోస్ట్ చేయగా అప్పుడు కూడా ఈ తరహా ట్రోల్స్ వినిపించాయి. మరి సినిమాకి చేసినట్టు గానే ఈ ఐపీఎల్ టీంని కూడా బాయ్ కాట్ చేస్తామని మళ్ళీ ట్రెండ్ చేస్తారో ఏమో చూడాలి మరి.
Ipudu velani kuda boycott chestra #YSRCP https://t.co/EOvEyqj75H pic.twitter.com/eJoBiBnGlf
— L1Wolf 🐺_CS3 (@Chandus357) February 20, 2025
Unfollowed #Boycottsunrisershyd https://t.co/6sWxPaIh2H
— For a Change (@munnulu) February 21, 2025
వీడికి సపోర్ట్ చేసే YCP వాళ్ళు కొంచెం తెచ్చుకోండి… https://t.co/ydzVf2xNHU
— కొండల్ రెడ్డి (@kondalreddy24) February 21, 2025
This has reached new bounds
— KommiReddy Gagan Reddy (@Romeoreddy0) February 15, 2025
we ysrcp karyakarthas are boycotting @RCBTweets https://t.co/4sNU0FyGR1
How dare you to comment on 11…?
— NAGA SUMANTH CHINTA (@iamNagaSumanth) February 15, 2025
It’s nothing but insulting our dearest @ysjagan #BoycottRCB https://t.co/7p7buzTva6


Click it and Unblock the Notifications











