పవన్ కల్యాణ్ నన్ను క్షమించండి.. నాకు పెళ్లి లేదు, భవిష్యత్ లేదు.. శ్రీరెడ్డి సంచలనం (వీడియో)
వివాదాస్పద నటి, యూట్యూబర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ సానుభూతిపరురాలు శ్రీరెడ్డి తాజాగా వీడియో రిలీజ్ చేసి పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. గతంలో యూట్యూబ్, సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్, లోకేష్, జనసేన, టీడీపీ నేతలను దూషించిన తీరుపై క్షమాపణలు కోరింది. తాజాగా వీడియోను రిలీజ్ చేసి ఎమోషనల్‌గా స్పందించింది. శ్రీరెడ్డి గురించిన వివరాల్లోకి వెళితే..
సినిమా పరిశ్రమలో తనకు అన్యాయం జరిగింది. నన్ను శారీరకంగా ఉపయోగించుకొని అవకాశాలు ఇవ్వలేదు. నాకు న్యాయం చేయాలంటూ ఫిలిం ఛాంబర్ వద్ద నగ్న ప్రదర్శనకు పూనుకోవడంతో సంచలనం రేపింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ, పవన్ కల్యాణ్ తల్లిని దుర్భాషలు ఆడింది. ఆ విషయం తీవ్ర సంచలనం రేపడంతో శ్రీరెడ్డిపై అనధికార బహిష్కరణ వేటు వేశారు.

ఆ తర్వాత చెన్నైకి మకాం మార్చిన శ్రీరెడ్డి యూట్యూబర్‌గా అవతారం ఎత్తి.. తెలుగుదేశం, జనసేన నేతలపై దారుణంగా కామెంట్ చేసింది. లోకేష్, ఆయన తల్లి, భార్యను కూడా వదిలిపెట్టలేదు. అలాగే పవన్ కల్యాణ్‌ను అలాగే ఆయన సోదరుడు నాగబాబుపై దారుణమైన కామెంట్స్ చేసింది. దాంతో వీడియోలు వివాదాస్పదంగా మారాయి.
అయితే గత ప్రభుత్వం అండ చూసుకొని వీడియోలు రిలీజ్ చేసి తీవ్రమైన ఆరోపణలు చేయడంపై ప్రస్తుతం చర్యలు చేపడుతున్నది. ఆ సమయంలో సోషల్ మీడియాను ఉపయోగించుకొని.. పవన్ కల్యాణ్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన వైసీపీ సానుభూతిపరులను, కార్యకర్తలను అరెస్ట్ చేస్తుండటంతో శ్రీరెడ్డి ఈ వీడియోను రిలీజ్ చేసింది. తామంతా నేతల చేతుల్లోనే పావులం.. మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలంటే.. నేతలపై చర్యలు తీసుకోండి అని అన్నారు.

ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ.. ఆ విధంగానీ, ఏ విధంగా తప్పుడుగా మాట్లాడబోను. మీ చర్యలు, మీ వార్ కార్యకర్తలపై కాకుండా లీడర్స్, లీడర్స్‌కు మధ్య జరిగేలా చూసుకోవాలని నేను కోరుతున్నాను. ఇదే నా విన్నపం. నా తలవంచి నమస్కరిస్తూ అడుగుతున్నాను. నన్ను, నా కార్యకర్తలను వదిలిపెట్టండి. నన్ను కూడా క్షమించండి అంటూ వీడియోను ముగించారు.


Click it and Unblock the Notifications











