పవన్ పై మార్ఫింగ్ ఫోటోలు.. దొరికినవాళ్ళకి బడిత పూజే..
తెలుగు సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు ఒక్క టాప్ హీరోగానే కాకుండా ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా కూడా తాను మారి హిస్టరీ క్రియేట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కి సినిమాల్లో అలాగే రాజకీయాల్లో కూడా ఎంత పాపులారిటీ వచ్చిందో అంతకు మించిన నెగిటివిటీ కూడా ఎదుర్కోక తప్పలేదు. ఇలాంటి నెగిటివిటీ పర్శనల్ టార్గెట్ మరొకరికి జరిగి ఉంటే వారి పరిస్థితి ఇంకొకలా ఉండేది అని చాలా మంది అంటారు.
కాగా పవన్ కళ్యాణ్ కొంచెం మొండి మనిషి కాబట్టి వాటిని దాటి ఈ స్టేజికి వచ్చారు. అయితే తనపై అప్పుడు నుంచి ఇప్పుడు వరకు కూడా పలు ఫోటోలు మార్ఫింగ్ లు బాడీ షేమింగ్ లాంటివి కూడా జరుగుతూనే ఉంటాయి. అయితే ఇది సోషల్ మీడియాలో ఒక్క పవన్ కళ్యాణ్ మీదే కాదు ఇతర హీరోల అభిమానులు మీద కూడా జరుగుతూనే ఉంటుంది.

అలాగే పవన్ కంటే దారుణంగా ఇంకొందరు మీద కూడా జరుగుతుంది కానీ ఇపుడు పవన్ విషయంలో అలా కాదు ఇపుడు హీరోగా కంటే ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు సో తన విషయంలో ఏదైనా పెద్ద మేటర్ గానే ఉంటుంది. కాగా ఇలా కొన్నాళ్ల కితమే పవన్ విషయంలో ఇతర రాజకీయ నాయకులని కూడా టార్గెట్ చేసిన వారు కటకటాల పాలు కావాల్సి వచ్చింది.
దెబ్బకి అపుడు చాలా మంది అపోజిషన్ పార్టీ వారు దాక్కున్నవాళ్ళు కూడా లేకపోలేరు. అయితే అది కొంచెం చల్లబడింది కానీ మళ్ళీ పవన్ పై దారుణంగా మార్ఫింగ్ లు పవిత్ర మహా కుంభమేళా స్నానంపై కూడా ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ పోస్టింగులు కూడా చేయడం స్టార్ట్ చేశారు. దీనితో ఇది సీరియస్ గా మారింది.

ఒక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికే ఇలా జరిగితే ఎలా అని పవన్ అభిమానులు ఏపీ పోలీస్ కి కంప్లైంట్ చేయడంతో అపోజిషన్ వాళ్ళని పోలీసులు పట్టుకోవడం స్టార్ట్ చేశారట. దీనితో సోషల్ మీడియాలో కొందర్ని వెతికి పట్టుకొని మరీ జైల్లో వేస్తున్నారట. దీనితో మళ్ళీ హంట్ స్టార్ట్ అయ్యిందని పవన్ అభిమానులు అంటున్నారు.
ఇలా ప్రస్తుతం ఇదే వార్త సినీ వర్గాల్లో కూడా ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ అంశంలో ఇక ముందు ఇలాంటివి జరిగినా కూడా చాలా కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ వారు వార్నింగ్ ఇస్తున్నారు. సో పవన్ విషయంలో ఇలాంటి హంగామా చేస్తే వాళ్ళకి జైల్లో బడిత పూజ తప్పదని చెప్పక తప్పదు.
ఇక ఇవి పక్కన పెడితే నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం "హరిహర వీరమల్లు" చిత్రం నుంచి రెండో సాంగ్ తాలూకా ప్రోమోని మేకర్స్ రిలీజ్ కి చేశారు. మరి ఇందులో అనసూయ, పూజిత పొన్నాడలు స్పెషల్ అపీరెన్స్ లో కనిపించగా మేకర్స్ ఈ మార్చ్ 28న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నట్టు చెబుతున్నారు కానీ సినీ సర్కిల్స్ మాత్రం మే కి షిఫ్ట్ అవుతుంది అని తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











