‘‘ బన్నీపై ఏ కామెంట్ చేయను.. ఆయన మెగా ఫ్యామిలీ జోలికొస్తే మాత్రం ’’
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి మెగా, పవన్ అభిమానులకు గత కొద్దిరోజులుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్ నుంచి మొదలైన ఈ విభేదాలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి తారాస్థాయికి చేరుకున్నాయి. ఎప్పటి నుంచో బన్నీని మెగా ఫ్యామిలీలో వ్యక్తిగా చూడటం మానేసిన అభిమానులు.. ఏపీ ఎన్నికల తర్వాత ఆయనపై విరుచుకుపడుతున్నారు. అల్లు అర్జున్ ఏం మాట్లాడినా అది వివాదంగా మారుతోంది.
ఇలాంటి దశలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేశ్ తొలిసారిగా హీరోగా నటించిన మారుతీ నగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. డైరెక్టర్ సుకుమార్ సతీమణి ఈ మూవీకి సమర్పకురాలిగా వ్యవహరించడంతో ఆ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం నేపథ్యంలో బన్నీ ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చి చిత్ర యూనిట్‌కి బాసటగా నిలిచారు. అయితే ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

మనసుకు ఇష్టమైన వారికి మన సపోర్ట్‌ను చూపించాలి, నాకు ఇష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా అంటూ వ్యాఖ్యానించారు. అలాగే తన అభిమానులను చూసి తాను హీరో అయ్యానంటూ వాడిన డైలాగ్ దుమారం రేపుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్‌పై బన్నీ ఉండగానే మెగా, పవన్ అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు. ఎవరి వల్ల ఈ స్థాయికి వచ్చావో మరిచిపోయావని.. చిరంజీవి ఫ్యామిలీతో వ్యాపారం చేశారంటూ నానా రకాలుగా కామెంట్స్ పెట్టారు. ఇవాళ్టీకి ఆ ట్రోలింగ్ జరుగుతూనే ఉంది.
మెగా ఫ్యామిలీకి మద్ధతుగా అభిమానులు, సినీ పరిశ్రమలోని కొందరు వ్యక్తులే అల్లు అర్జున్ తీరును విమర్శించారు. అలాంటిది తొలిసారిగా ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. జనసేన నేత, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శనివారం రెండ్రోజుల క్రితం మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ వివాదంపై విలేకరులు ఆయనను ప్రశ్నించగా.. బొలిశెట్టి తనదైన శైలిలో స్పందించారు.
అసలు అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నారా, ఆ సంగతి తనకు తెలియదంటూ శ్రీనివాస్ చురకలంటించారు. మెగా ఫ్యామిలీ నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచీలు, షామియానా కంపెనీలు పెట్టుకుంటే తాము చెప్పలేమన్నారు. బన్నీలో చిరంజీవిని, పవన్ కళ్యాణ్‌ని, రామ్ చరణ్ అభిమానులు తమ హీరోలను చూసుకుంటున్నారని .. ఉన్నదే మెగా ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యామిలీ అంటూ బొలిశెట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను పెద్ద పుడింగిని, నాకు ఇష్టమైతే వస్తా అంటే .. వెళ్లిపో, అల్లు అర్జున్‌ని రమ్మని ఎవడు అడిగాడు అంటూ ఆయన పేర్కొన్నారు.
ఇది కాస్తా వివాదం కాగా , ఇది మెగా - అల్లు అర్జున్ అభిమానుల మధ్య ట్వీట్ల వార్‌కు దారి తీసింది. ఈ నేపథ్యంలో బొలిశెట్టి మరోసారి మీడియా ముందుకొచ్చారు. తనకు వ్యక్తిగతంగా అల్లు అర్జున్‌తో ఎలాంటి శత్రుత్వం, గొడవలు లేవని స్పష్టం చేశారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చానని.. దీనిపై బన్నీ మాట్లాడితే మాత్రం తాను ఎలాంటి అనుమానం లేకుండా మాట్లాడతానని బొలిశెట్టి స్పష్టం చేశారు. ఇకపై అల్లు అర్జున్‌పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపారు.


Click it and Unblock the Notifications











