పవన్ కల్యాణ్ చుట్టూ తమిళ రాజకీయం.. అలా రెచ్చగొడుతున్న డీఎంకే!

తన స్టార్‌డమ్‌తో పాటు పార్టీ అధినేతగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ దేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన మాటలు, చేతలు అన్ని సమాజంపై ప్రభావం చూపిస్తాయి. పవన్ కళ్యాణ్ పేరు చుట్టూనే రాజకీయాలు, సినిమాలు నడుస్తున్నాయంటూ అతిశయోక్తి కాదు. తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశంలో ఎక్కడికి వెళ్లినా పవన్ కళ్యాణ్‌కు తిరుగులేని ఆదరణ లభిస్తుంది. దీనికి ఎన్నో ఉదాహరణలు.. అలాంటిది పవన్‌ను అడ్డుపెట్టుకుని లబ్ధి పొందాలని చూసేవారెందరో.

కూటమి విజయంలో కీలకపాత్ర

గతేడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ- జనసేన కూటమి సంచలన విజయం సాధించడం వెనుక పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించారు. మూడు పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు ప్రచారం, అభ్యర్ధుల ఎంపిక ఇలా అన్నింటిలోనూ తన ముద్ర చూపించారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. ఎన్డీఏలోని ప్రధాన పార్టీలలో ఒకటిగా జనసేనను నిలబెట్టి.. ప్రధాని నరేంద్రమోడీ వద్ద పరపతిని పెంచుకున్నారు.

Tamil Nadu Minister Sekar Babu challenge to AP Dy CM Pawan Kalyan

దేశవ్యాప్తంగా పవన్ క్రేజ్
కూటమిలో కీలకనేతగా ఉన్న పవన్ కళ్యాణ్‌కు బీజేపీ అధిష్టానం పలు కీలక బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి పక్షాన పవన్ ప్రచారం నిర్వహించగా.. ఆయన ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఇక్కడే కాదు.. పవన్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ ప్రభంజనమే అన్నట్లుగా పరిస్ధితి ఉంది. రెండ్రోజుల క్రితం తమిళనాడులోని మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ మధురైలో పర్యటించారు. తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ స్వయంగా ఎయిర్‌పోర్టులో పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలికారు.

తమిళనాడులో పవన్ పర్యటన
తమిళ సంప్రదాయంలో పూర్తిగా పట్టు పంచెలో కనిపించిన పవన్ కళ్యాణ్.. వేదికపై దాదాపు 40 నిమిషాల పాటు తమిళంలోనే దంచి కొట్టారు. మురుగన్ నామస్మరణతో ఏ శత్రువైనా పారిపోవాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. హిందూ ధర్మాన్ని, హిందూ దేవతలను చులకన చేసే వారిది సెక్యులరిజం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇవి పరోక్షంగా డీఎంకేను ఉద్దేశించి చేసినవేనంటూ ఆ పార్టీ కేడర్ రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు మంత్రి, డీఎంకే సీనియర్ నేత శేఖర్ బాబు స్పందించారు.

Take a Poll

చెన్నైలో గెలవమంటూ పవన్‌కు సవాల్
అసలు మమ్మల్ని ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ ఎవరు? 2026 ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము ఆయనకుందా అని శేఖర్ బాబు ప్రశ్నించారు. చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసి చూపించాలని పవన్ కళ్యాణ్‌కు సవాల్ విసిరారు. ఎన్నికల్లో గెలిస్తే మీరు ఏం చెప్పినా వింటామంటూ శేఖర్ బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రోద్బలంతో తమిళనాడులో మత రాజకీయాలను ప్రోత్సహించొద్దని పవన్‌కు సూచించారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులకు, డీఎంకే కేడర్‌కు మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతోంది. పవన్‌ను కావాలని రెచ్చగొడితే ఏం జరుగుతుందో మీకు అర్ధం కావడం లేదంటూ జనసేన అభిమానులకు చురకలంటిస్తున్నారు. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: pawan kalyan dmk mk stalin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X