Thalapathi Vijay: ఎన్టీఆర్‌ని గుర్తు చేస్తూ.. రాజకీయాలపై దళపతి విజయ్ హాట్ కామెంట్స్
Thalapathi Vijay: సినిమాలకు, రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. చాలామంది సినిమాలను నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వారు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది సినీ సెలబ్రెటీలు రాజకీయాలోకి అడుగుపెట్టి.. తమను తాము నిరూపించుకున్నారు. అలాగే.. తాజాగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(vijay) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే తమిళ వెట్రి కజగం(Tamil Vetri Kazhagam) పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా తమిళగ వెట్రి కళగం (TVK)పార్టీ నిర్వహించిన సభలో విజయ్ మాట్లాడుతూ టాలీవుడ్ సీరియర్ నటుడు నందమూరి తారక రామరావు ( ఎన్టీఆర్ )పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తమిళ స్టార్ హీరో విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలతోనే కాదు.. పలు సేవ కార్యక్రమాల ద్వారా ఎన్నో మంది ప్రజల ఆదరణ పొందారు. ఈ క్రమంలోనే విజయ్(vijay) రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. తమిళ వెట్రి కజగం(Tamil Vetri Kazhagam) పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నేడు విల్లుపురం సమీపంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ మొదటి మహానాడు ఏర్పాటు చేశాడు. ఈ సభకు లక్షలాది మంది అభిమానులు హాజరయ్యారు.

ఈ సభలో విజయ్ మాట్లాడుతూ.. రాజకీయాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజకీయాలు పాము లాంటివని అన్నారు. అలాగే తన పార్టీలో అందరూ సమానమేనని, ప్రతి ఒక్కరికి ప్రతిఫలం లభిస్తుందన్నారు. తమిళ రాజకీయాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, అందుకే తాను రాజకీయాల్లో వచ్చాననీ, అయితే.. తాను రాజకీయ పార్టీ పెట్టినప్పుడూ.. తనను చాలా రకాలుగా విమర్శించారని గుర్తు చేసుకున్నారు.
ముఖానికి రంగులు వేసుకునే వారికి రాజకీయాలు ఎందుకని విమర్శించిన వారికి విజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అటు ఆంధ్రప్రదేశ్ లో ఇటు.. తన తమిళనాడు రాజకీయాలో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్(NTR), ఎంజీఆర్(MGR) కూడా సినిమా రంగం నుంచే వచ్చారనీ, వారు రాజకీయాల్లో మరిచిపోలేని ముద్రవేశారనీ, వారు తన సినిమా కెరీర్ పీక్ లో ఉండగానే.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారనీ, వారు రాజకీయం కోసం.. సినిమాలు వదిలేసి.. ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు. వారి స్పూర్తి లోనే ఇక్కడ మీ విజయ గా వచ్చి నిలబడ్డానని, నన్ను ఆశీర్వదించండి.. అంటూ కోరాడు.
దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK) అనే పార్టీను స్థాపించిన సంగతి తెలిసిందే. 2026 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఈ పార్టీకి సంబంధించిన మహానాడు సభ ఆదివారం నాడు జరిగింది. ఈ సభకు వేలాది అభిమానులు తరలివచ్చారు. ఏదేమైనా విజయ్ మాట్లాడిన మాటలు చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











