పవన్ కల్యాణ్ Vs ఉదయనిధి మాటల యుద్దం.. సనాతన ధర్మంపై తమిళ డిప్యూటీ సీఎం అనుచిత వ్యాఖ్యలు!

ఇప్పుడు ఒక్క స్టేట్ పాలిటిక్స్ లోనే కాకుండా నేషనల్ లెవెల్ పాలిటిక్స్ ల కూడా వన్ అండ్ ఓన్లీ తెలుగు నాయకుడు పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జెనరల్ గా మన తెలుగు హీరోల పేర్లు పాన్ ఇండియా సినిమాల ద్వారా వెళితే పవన్ రూటు ఎప్పుడు సెపరేట్ గానే ఉంటుంది అన్నట్టు తాను తన పొలిటికల్ గా తనకి దారిలోనే స్టేట్ నుంచి నేషనల్ లెవెల్లో మారు మోగుతున్నారని చెప్పాలి.

కాగా అటు సినిమా అయినా రాజకీయం అయినా కూడా పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ స్పీచ్ లకి సెపరేట్ క్రేజ్ ఉంది. అలా తన సినిమాలు సహా రాజకీయ మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారు అనేది పెద్ద సస్పెన్స్ గా మారుతుంది. అయితే తన కెరీర్ లో ఇచ్చిన ఎన్నో హిట్ స్పీచ్ లలో ఇటీవల తిరుపతిలో ఇచ్చిన పాన్ ఇండియా స్పీచ్ కోసం ఇప్పుడు అంతా మాట్లాడుతున్నారు.

Tamilnadu Deputy CM udaynidhi stalin shocking counter to pawan kalyan in chennai

కాగా అటు ఇంగ్లీష్ లో దేశ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అలాగే ఇటు తమిళ్ లో ప్రముఖ హీరో పైగా అక్కడ ఇటీవల డిప్యూటీ సీఎం గా భాద్యతలు చేపట్టిన ఉదయనిధి స్టాలిన్ పై పవన్ విరుచుకుపడడం సంచలనంగా మారింది. అలా ఇంగ్లీష్, తమిళ్ లో పవన్ ఇచ్చిన స్పీచ్ అలాగే వార్నింగ్ లు సౌత్ నుంచి ఏ లీడర్ కూడా ఇవ్వలేడని చాలా మంది మాట్లాడుకుంటున్నారు.

అయితే ఇక్కడ గుర్తించాల్సిన అంశం పవన్ పొలిటికల్ గా పెట్టిన మీటింగ్ కాదు ఇది ఒక హిందువుగా పర మతాలని గౌరవించే భారతీయుడిగా ఈ మీటింగ్ పెట్టి సనాతన ధర్మం విషయంలో రాహుల్ గాంధీ, ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ పై ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ముఖ్యంగా సనాతన ధర్మం విషయంలో ఉదయనిధి చేసిన కామెంట్స్ పట్ల పవన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Tamilnadu Deputy CM udaynidhi stalin shocking counter to pawan kalyan in chennai

ఈ దేశంలో సనాతన ధర్మాన్ని తుడిచి పెట్టాలని చూస్తే సనాతన ధర్మం మిమ్మల్ని తుడిచేస్తుంది అని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే డెఫినెట్ గా దీనిపై ఉదయనిధి స్టాలిన్ నుంచి ఏదైనా మీటింగ్ లేదా అసలు ఎలా స్పందిస్తారు అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూసారు. కాగా ఫైనల్ గా పవన్ కామెంట్స్ విషయంలో ఉదయనిధి నుంచి క్లారిటీ వచ్చింది. పవన్ చేసిన కామెంట్స్ పై మీరేం చెప్తారు అనే దానికి తాను "జస్ట్ వెయిట్ అండ్ సీ" అంటూ బదులిచ్చారు.

అంటే పవన్ చేసిన కామెంట్స్ ని ఛాలెంజ్ గా తీసుకొని సనాతన ధర్మాన్ని స్టాలిన్ చెప్పినట్టుగానే తుడిచేస్తానని అంటున్నాడా లేక తర్వాత కౌంటర్ ఇస్తానని బదులిచ్చాడా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీనితో ఉదయనిధి రియాక్షన్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్స్ నడుమ వైరల్ గా మారింది. మరి ఈ ఇద్దరు డిప్యూటీ సీఎంల వార్ లో ఎవరు గెలుస్తారో చూడాల్సిందే. పైగా ఇద్దరూ కూడా తెలుగు తమిళ్ లో హీరోలు కూడా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X