ఊరు మనదే తోసేయ్.. మోహన్ బాబు డైలాగ్‌తో వైఎస్ జగన్‌పై రఘురామరాజు దారుణంగా!

బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జెత్వానీ వేధింపుల వ్యవహారంపై విచారణ ఊపందుకొన్నది. తెలుగు టెలివిజన్, ఇతర మీడియా కథనాలతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకొని నిష్పాక్షిక విచారణకు, దర్యాప్తుకు ఆదేశించింది. దాంతో రంగంలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు రంగంలోకి దిగి కేసులో పురోగతి సాధించారు. ఈ క్రమంలో ఆమెకు రక్షణ కల్పించడంతో ఆంధ్రప్రదేశ్‌కు చేరుకొన్నారు. ఈ వివరాలపై టీడీపీ నేత రఘురామ కృష్ణంరాజు స్పందించినది ఏమిటి? ఇంకా జెత్వానీ ఫిర్యాదు వివరాల్లోకి వెళితే..

అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనతో ముంబై నటిపై అక్రమ,భూటకపు కేసు బనాయించిన ఏపీ పోలీసుల తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 15 రోజులపాటు ఇబ్రహీంపట్నం గెస్ట్‌హౌస్‌లోను, అలాగే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో బంధించి ఆమెను చిత్రహింసలకు గురి చేశారనే విషయం సంచలనం రేపింది. ఈ విషయంపై చంద్రబాబు నేతృత్వంలోని తీవ్రంగా పరిగణించింది.

Raghu Rama Krishnam Raju

మీడియాలో సంచలన కథనాలు వెలువడిన తర్వాత కాదంబరి జెత్వానీ నేరుగా ఏపీలోని పోలీస్ ఉన్నతాధికారులను కలిశారు. విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసి తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. అంతకు ముందు ఉదయం ఏపీ పోలీసు ఎస్కార్ట్ సాయంతో నగరానికి చేరుకున్న ఆమె స్థానిక నోవాటెల్ హోటల్లో బస చేశారు. అక్కడ ఆమెను కలిసిన పోలీసులు వేధింపుల ఆరోపణలపై వివరాలు సేకరించారు. ఆమెకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆమె సాయంత్రం సీపీని కలిశారు.

ఇక ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రఘురామరాజు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముంబై నటిని కిడ్నాప్ చేసుకొని వచ్చి వీటీపీఎస్ గెస్ట్‌హౌస్‌లో పెట్టడం ఏమిటి? ఆమెపై రెక్కీ ఏమైనా చేశారా? అప్పటి ప్రభుత్వ నేత అడుగుల మడుగులు ఒత్తారా? ఆ పనికి మాలిన నేత ఏదో చెప్పారని అమ్మాయిని హింసిస్తారా? అని ప్రశ్నించారు.

Raghu Rama Krishnam Raju

ఏపీ పోలీసు ఉన్నతాధికారులు తీరు ఇండియన్ ఐపీఎస్‌ వ్యవస్థకే మచ్చ తెచ్చారు. ఎస్పీ స్థాయి నుంచి డీఐజీ, ఐజీ స్థాయి ఆఫీసర్లు ఇంత నీచంగా ప్రవర్తించడం దారుణం. మా ప్రభుత్వం ఈ సంఘటనపై స్పందించి వెంటనే ఆమెకు న్యాయం చేయడానికి చర్యలు తీసుకోవడం ప్రశంసనీయం. కాదంబరి వ్యవహారంపై ఈ ఐపీఎస్ అధికారులను కఠినంగా శిక్షించాలి అని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు.

గత వైసీపీ పాలనతో వైఎస్ జగన్, ఆయన అనుచరులు, సలహాదారుల తీరు మాత్రం మోహన్ బాబు ఓ సినిమాలో విలన్ పాత్ర పోషించి ఊరు మనదే తోసేయ్‌రా అంటాడు. గత ప్రభుత్వ పనితీరు చూస్తే.. నాకు అదే గుర్తుకు వచ్చింది. ప్రభుత్వం మనదే.. ఏం చేసినా నడిచిపోతుందనే అతి విశ్వాసంతో ఇలాంటి కిరాతక చర్యలకు పాల్పడ్డారు అని వైఎస్ జగన్ ప్రభుత్వంపై రఘురామ కృష్ణంరాజు ఘాటుగా స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X