బెట్టింగ్ యాప్ కేసు.. సీఎం రేవంత్ రెడ్డి అల్టిమేటం.. పెద్ద తలలకు చిక్కులేనా?
బెట్టింగ్ యాప్ కేసును తెలంగాణ పోలీసులు సీరియస్‌గా టేకప్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీనటులు, బుల్లితెర యాంకర్లు, యూట్యూబర్ల పేర్లు కలిపి దాదాపు 25 మంది వరకు ఈ కేసులో తెర మీదకి వచ్చాయి. వీరిలో ఇప్పటికే విష్ణుప్రియ, రీతూ చౌదరిలను విచారించిన పోలీసులు వారి నుంచి కీలక విషయాలు రాబట్టారు. త్వరలోనే మరికొందరి పేర్లు కూడా ఈ కేసులో తెరపైకి వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రెడ్డి.
బెట్టింగ్‌ను ప్రమోట్ చేసినవారిని నియంత్రించడం కంటే అసలు యాప్స్ నిర్వాహకులని పట్టుకోవడమే మంచిదని తెలంగాణ పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చేశారు. దీనిలో భాగంగా యాప్స్ నిర్వాహకుల్ని నిందితులుగా చేర్చి విచారణకు పిలవాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే 19 బెట్టింగ్ యాప్‌లను, వాటి నిర్వాహకులపై కేసులు నమోదు చేయడంతో పాటు వారి పేర్లను ఎఫ్ఐఆర్‌లోకి చేర్చారు. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్‌పై నిషేధం ఉన్నప్పటికీ కొందరు కేటుగాళ్లు రకరకాల పేర్లతో బెట్టింగ్ యాప్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను క్వాష్ చేయాలంటూ బిగ్‌బాస్ ఫేమ్, యాంకర్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ నిర్వహించింది. బెట్టింగ్ యాప్స్ ద్వారా విష్ణుప్రియ పెద్ద మొత్తంలో నగదు అందుకున్నారని దర్యాప్తులో తేలింది. తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆమె పలు యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ కేసులో పేరు తెరపైకి వచ్చిన యాంకర్ శ్యామల కూడా రెండ్రోజుల క్రితం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈమె కూడా తనపై నమోదైన బెట్టింగ్ యాప్ కేసును కొట్టివేయాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే న్యాయస్థానంలో శ్యామలకు స్వల్ప ఊరట లభించింది. శ్యామలను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించిన కోర్ట్.. విచారణకు సహకరించాల్సిందిగా యాంకర్‌ను ఆదేశించింది.
ఈ కేసు ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో నమోదైన ఈ తరహా కేసులను ఇకపై సీఐడీ విచారిస్తుందని తెలంగాణ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో తెలిపింది. ఇంతటి ప్రాధాన్యత నెలకొన్న ఈ బెట్టింగ్ యాప్ కేసుపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.
ఆన్‌లైన్ బెట్టింగ్, రమ్మీపై కఠినంగా వ్యవహరిస్తామని.. వీటి నిరోధానికి సిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎం వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినవారిని విచారిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరకదని .. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో ఎలాంటి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇలాంటి కేసుల్లో పడే శిక్షలను కూడా సవరించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్ కేసులో తెరపైకి వచ్చిన స్టార్స్‌కు కూడా చిక్కులు తప్పవా? అంటూ డిస్కషన్ నడుస్తోంది. మరి ఈ కేసులో ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











