తెలంగాణలో బాలయ్య కొత్త బిజినెస్.. సీఎం రేవంత్ బంపరాఫర్!

Balakrishna's Film Studio: నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తన 50 సంవత్సరాల కెరీర్లో ఎన్నో విజయాలు అందుకున్నారు. అలాగే ఎన్నో పురస్కారం పొందారు. మరోవైపు ఓటిటీ ప్లాట్ ఫామ్ లో కూడా తన సత్తా చాటుతున్నాడు. తాజాగా ఓ కొత్త బిజినెస్ లో నందమూరి బాలకృష్ణ ఎంటర్ అవుతున్నట్లు తెలుస్తుంది ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ఆ బిజినెస్ కు ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఆ వివరాలేంటో లుక్కేయండి.

నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసులో యంగ్ హీరోలతో పోటీపడుతూ టాలీవుడ్ టాప్ హీరోగా తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నాడు. కేవలం సినిమాలలోనే కాకుండా ఓటీటీలో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఇటీవలే ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ ఫోర్ ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్ లోనే పలు రికార్డులు క్రియేట్ చేశారు నందమూరి బాలకృష్ణ. ఇదిలా ఉంటే.. నందమూరి బాలకృష్ణ రంగంలోకి అడుగుపెడుతున్నట్టు తెలుస్తుంది. అదే సినిమా స్టూడియోను ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

Telangana government To Take Decision On Balakrishna s Film Studio in the cabinet meeting

తెలుగు సినిమా పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన తర్వాత ఎన్నో స్టూడియోలో నిర్మించారు. ఇప్పటికే.. అన్నపూర్ణ స్టూడియో రామకృష్ణ స్టూడియో రామోజీ ఫిలిం సిటీ రామానాయుడు స్టేడియం సారధి స్టూడియో లాంటి ఎన్నో స్టూడియోలను నిర్మించారు. గత రెండు సంవత్సరాల క్రితం సీనియర్ నటుడు అల్లు రామలింగయ్య పేరు మీద అల్లు స్టూడియో నిర్మించారు. ఇలా సినిమాల నిర్మాణం కోసం ఎన్నో స్టూడియోలో తెలంగాణలో అందుబాటులో ఉన్నాయి. అప్పటి ప్రభుత్వం గానీ ఇప్పటి ప్రభుత్వం గానీ సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడుతుందని చెప్పాలి. 1974లో అన్నపూర్ణ స్టూడియో కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కినేని నాగేశ్వరరావుకి భూములను కేటాయించిన విషయం తెలిసిందే. అలాగే రామకృష్ణ స్టూడియో కోసం ఆర్టీసీ రోడ్డు సమీపంలో ఎన్టీఆర్ కోసం కూడా భూములను కేటాయించిన విషయం తెలిసింది.

Telangana government To Take Decision On Balakrishna s Film Studio in the cabinet meeting

ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ సినిమా స్టూడియోను నిర్మించాలని ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే గతంలో ఈ శాఖ సమీపంలో బాలకృష్ణ సినిమా స్టూడియో నిర్మించాలని భావించారు కానీ అప్పటి జగన్ సర్కార్ మొండి చెయ్యి చూపించడంతో వెనక్కి తగ్గాడు. కానీ ఈ ప్రతిపాదన మరోసారి ముందుకు రావడంతో తెలంగాణ ప్రభుత్వం బాలకృష్ణకు అండగా నిలుస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కారు బాలకృష్ణ కోసం ఏకంగా 500 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఈ భూమికి కేటాయింపుల ప్రతిపాదన కు రెవెన్యూ శాఖ ఆమోదముద్ర వేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి పంపినట్లు తెలుస్తోంది.

నేడు జరిగే క్యాబినెట్ మీటింగ్ లో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగే అవకాశం ఉందని, మంత్రుల నిర్ణయం తర్వాత ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తుంటే.. త్వరలోనే అది కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X