స్మగ్లింగ్ చేసే హీరోకు నేషనల్ అవార్డులా ? పోలీస్ విలనా..?

Minister Seethakka: సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనతో తెలుగు చిత్రసీమలో గందరగోళం నెలకొంది. ఈ ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ కావడం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ కు సపోర్టుగా సంఘీభావం తెలపడం. ఈ విషయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టాలీవుడ్ సినీ ప్రముఖుల తీరును అసెంబ్లీ సాక్షిగా తప్పుపట్టారు. తాజాగా పుష్ప సినిమాకు అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు ఇవ్వడంపై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?

మంత్రి సీతక్క ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'పుష్ప' సినిమాకు గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడంపై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. ఎర్ర చందనం దొంగగా నటించిన హీరో అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు ఇవ్వడమేంటీ ? అంటూ మండిపడ్డారు. జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదు. కానీ, పోలీసుల బట్టలు విప్పి నిలబెట్టినా.. ఎర్ర చందన స్మగ్లింగ్ చేసే దొంగల కథతో తెరకెక్కిన సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని పుష్ప సినిమాను ఉద్దేశించి ఆక్షేపించారు.

Telangana Minister Seethakka sensational comments on Allu Arjun Pushpa movie

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరును కూడా తప్పుపట్టింది. బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సినిమాలను ప్రోత్సహిస్తుందో ఆలోచించాలన్నారు. మానవ హక్కులను కాపాడే లాయర్ జీరో అయినప్పుడు... స్మగ్లింగ్ చేసే నటుడు హీరో ఎలా అవుతారనీ, ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తి పెరుగుతుందని అన్నారు. చంకలో బిడ్డపెట్టుకుని ఉన్న మహిళ హక్కుల కోసం పోరాడిన సినిమాలు అవార్డు రాలేదని విమర్శలు గుప్పించారు. హక్కులు కాపాడే లాయర్ జీరో... స్మగ్లింగ్ చేసే సినిమాలు హీరో ఎలా అవుతారని ప్రశ్నించారు. సందేశాత్మక సినిమాలను తెరకెక్కించాలని మంత్రి సీతక్క ఆశించారు.

More from Filmibeat

Read more about: seethakka pushpa allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X