గోవాలో సీరియల్ నటితో వైసీపీ మాజీ ఎంపీ.. సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు
ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ వైసీపీ ఎంపీ గోవాలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఓ సీరియల్ నటితో కలిసి విహార యాత్ర చేస్తున్నట్టు ఓ వీడియోను టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మాజీ వైసీపీ ఎంపీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ట్రెండింగ్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఏపీలో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన బాపట్ల ఎంపీ నందిగామ సురేష్‌కు తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో రాజధాని ప్రాంతంలో అనేక అక్రమాలకు పాల్పడినట్టు తాజా ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నది. అయితే ఆయన వాటిపై పెద్దగా స్పందించకపోవడం మీడియాలో చర్చనీయాంశమైంది.

ఇక తాజాగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అక్రమ ఆస్తుల కేసులో సీఆర్డీఏ, సిట్, ఐటీ అధికారులు ఇటీవల నోటీసులు ఇచ్చారు. దాంతో గోవాకు ఆయన వెళ్లి ఓ సీరియల్ నటితో ఎంజాయ్ చేస్తున్నారు అనే విషయం సోషల్ మీడియాలో వీడియోలో వైరల్ అయింది.
అయితే వీడియోలో కనిపించిన ప్రకారం.. నందిగామ సురేష్, మరో యువతి రోప్ వేపై ప్రయాణిస్తూ ఉత్సాహంగా కనిపించారు. అయితే ఆయన పక్కన ఉన్నది.. ఆయనతో విహార యాత్ర చేస్తున్నది ఓ సీరియల్ నటి అనే ప్రచారం జరుగుతున్నది. అయితే ఆమె ఎవరు? అనే విషయంపై సందిగ్దత ఉంది. అయితే ఆయనది గోవా వెకేషన్ వీడియోనా? ఊటీ వెకేషన్ వీడియోనా? కొత్తదా? పాతదా? ఆయనతో ఉన్నది సీరియల్ నటినేనా? లేక ఫ్యామిలీనా? అనే ప్రశ్నలను నెటిజన్లు సంధిస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఆయన ఇస్తే.. ఇలాంటి రూమర్లకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, తనపై జారీ చేసిన నోటీసులపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఆరోపణలు అవాస్తవం. కాబట్టి ఈ కేసు నుంచి తప్పించాలని కోరారు. ఈ విచారణ కోర్టులో జరుగుతున్నది. రూల్స్ ప్రకారం ఈ కేసును విచారించాలని అధికారులకు కోర్టు ఆదేశాలిచ్చింది.
నందిగామ సురేష్ గోవా వ్యవహారం ప్రక్కన పెడితే.. నందిగామ సురేష్ ఎంపీగా ఉండగానే ఓ సినిమాలో నటించారు. ఆటో రజనీ అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటిచడం తెలిసిందే. ఈ సినిమా గురించి అప్పటి సీఎం వైఎస్ జగన్‌ను కలిసి విశేషాలు అందించడం మీడియాలో వచ్చిన విషయం విదితమే. ఆయనకు సినిమా, టెలివిజన్ పరిశ్రమలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే తాజా వీడియో మాత్రం పాతది.. ఆయన విదేశాలకు టూర్ వెళ్లిన సమయంలో తీసింది. దానిని ఈ సమయంలో టీడీపీ కార్యకర్తలు షేర్ చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











