‘కింగ్‌మేకర్‌ను కాను.. వాళ్లను చిత్తుగా ఓడిస్తా’
తమిళనాడులో జన నాయగన్ సినిమాకు సెన్సార్ నిరాకరణ అంశం దేశవ్యాప్తంగా వివాదంగా మారింది. ఇళయ దళపతి విజయ్ నటించిన ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) జారీ కాకపోవడంతో గత నెల అంటే జనవరి 9వ తేదీన విడుదల కావాల్సిన ఈ చిత్రం నిరవధికంగా వాయిదా పడింది. ఈ సినిమా విడుదల కోసం నిర్మాత, కేవీఎన్ ప్రొడక్షన్స్ హౌస్ సుప్రీంకోర్టు వరకు వెళ్లడం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడటం బాధగా ఉంది. నిర్మాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు. జాతీయ టెలివిజన్ ఛానెల్ ఎన్డీటీవీ (NDTV) కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో విజయ్ పలు విషయాలను ప్రస్తావించారు. ఆయన చెప్పిన విషయాల్లోకి వెళితే...
జన నాయగన్ సినిమా సెన్సార్ సమస్యలను అధిగమించి రిలీజ్ అవుతుంది. నన్ను రాజకీయంగా టార్గెట్ చేయడానికే ఆ సినిమా రిలీజ్ కాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. అయితే ఇలాంటి అడ్డంకులు రావొచ్చని ముందే మానసికంగా సంసిద్దమయ్యాం. త్వరలోనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని విజయ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

తమిళనాడు రాజకీయాల్లో తమిళగ వెట్రీ కజగం (టీవీకే) పార్టీ తనదైన ముద్ర వేస్తుంది. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టత ఇచ్చారు. రాజకీయాలే నా భవిష్యత్ అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. పాలిటిక్స్‌లో ఎంజీఆర్, జయలలిత నాకు రోల్ మోడల్స్. షారుక్ ఖాన్ అంటే సినిమా పరంగా ఇష్టం. ఆయనకు నేను ఫ్యాన్ అని నిజాయితీగా చెప్పారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఎలాంటి అనుమానం లేదు. తప్పకుండా మా పార్టీ విజయం సాధిస్తుంది. కింగ్ మేకర్ అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. నా సభలకు వస్తున్న ప్రజలను చూస్తుంటే.. వారి స్పందన ఎలా ఉందో మీరే ఊహించుకోవచ్చు. సుదీర్ఘకాలం రాజకీయాల్లోనే కొనసాగుతాను. ఐదేళ్ల కోసం, అధికారం కోసమో కాదు. ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉంటాను. ప్రస్తుతం సినిమా రంగాన్ని వదిలేసి రాజకీయాలపైనే దృష్టిపెట్టాను. సినిమాను వదిలేయడం అంత సులభం కాలేదు అని ఆయన అన్నారు.
జన నాయగన్ సినిమా విషయానికి వస్తే.. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. తెలుగులో భారీ విజయం సాధించిన భగవంత్ కేసరి చిత్ర కథను ఆధారంగా చేసుకొని తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా అనేక మార్పులు, చేర్పులు చేసుకొన్న ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్వకత్వం వహించారు. ఈ సినిమాను కన్నడలో భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు.
ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు నటించారు. ఈ సిినమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు.


Click it and Unblock the Notifications











