The Kerala Story 2: ‘ది కేరళ స్టోరీ పెద్ద కట్టుకథ.. పక్కా ప్లాన్ ప్రకారమే అలాంటి కుట్ర’
బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన చిత్రం ది కేరళ స్టోరి 2 గోస్ బియాండ్. ఈ సినిమాకు కామఖ్య నారాయణ్ సింగ్ దర్వకత్వం వహించారు. ఈ సినిమాకు ఆషిన్ ఏ షా, రవిచంద్ నల్లప్ప సహ నిర్మాతలుగా వ్యవహరించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అత్యంత వివాదాస్పద చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వరయ ఓజా కీలక పాత్రలు పోషించారు.
విపుల్ అమృత్‌లాల్ షా కథ అందించిన ఈ చిత్రానికి మన్నన్ షా మ్యూజిక్ అందించారు. ఎడిటర్‌గా సంజయ్ శర్మ, అభిజిత్ చౌదరీ సినిమాటోగ్రఫి, సౌండ్ డిజైనర్‌గా మానస్ చౌదరీ, ప్రొడక్షన్ డిజైనర్‌గా జుహీ తల్మాకీ వ్యవహరించారు. ఫిబ్రవరి 27వ తేదీన రిలీజ్ అయ్యే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల రిలీజై సంచలనం, వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అయితే ఈ సినిమాపై కేరళ ప్రభుత్వం సీరియస్‌గా ఉండటమే కాకుండా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్త మవుతున్నది. ఈ సినిమా వివాదం ప్రస్తుతం సినీ రంగం నుంచి రాజకీయ రంగంపైకి చేరుకొన్నది. దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రంపై వస్తున్న కామెంట్స్ వివరాల్లోకి వెళితే..

ది కేరళ స్టోరి 2 చిత్రం ట్రైలర్ రిలీజైన తర్వాత భారీ చర్చకు దారి తీసింది. లవ్ జిహద్ పేరుతో హిందూ అమ్మాయిలను ఎలా మత మార్పిడి చేస్తున్నారు? వారిని ఎలా శారీరక, మానసిక హింసకు గురి చేస్తున్నారనే కోణంలో కామఖ్య నారాయణ సింగ్, విపుల్ అమృత్ లాల్ షా తమదైన శైలిలో కొన్ని అంశాలను ట్రైలర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ ట్రైలర్‌లో చూపించిన విధంగా.. హిందూ అమ్మాయికి గొడ్డు మాంసాన్ని బలవంతంగా తినిపించే సీన్ ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశమైంది. దాంతో ఈ చిత్ర మత విద్వేషాలను రెచ్చగొడుతున్నది. కేరళలో నెలకొన్న మత సామరస్యాన్ని దెబ్బ తీసేలా ఉంది అని సీఎం పినరయి ఘాటుగా స్పందించారు.
ఇక ఈ చిత్రంపై కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ జాతీయ వార్త సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. కేరళ స్టోరి మొదటి పార్టీ విద్వేషాలను రెచ్చగొట్టే సినిమా. ఆ సినిమాలో అసలు ఫౌండేషన్ లేదు. వేల మంది హిందూ అమ్మాయిలు మత మార్పిడికి గురయ్యారని చెబుతున్నారు. కానీ అది అసత్య ప్రచారం. కొన్నేళ్లుగా చూసుకొంటే 30కిపైగా అలాంటి కేసులు ఉంటాయేమో. మన దేశం చాలా విశాలమైంది. ఏదో ఓ మూలకు మత మార్పిడి అక్కడ ఇక్కడో జరిగి ఉంటే.. దాన్ని పెద్ద కథగా అల్లి దుష్ప్రచారం చేయకూడదు. ప్రజల మనస్సుల్లో విద్వేషాలు రెచ్చగొట్టే వారి వ్యూహ రచనగా కనిపిస్తున్నది. అది సరైన చర్య కాదు. నా బాల్యంలో అమర్ అక్బర్ ఆంథోని లాంటి సినిమాలను మెచ్చి పన్ను మినహాయింపు ఇచ్చారు అని అన్నారు.
ది కేరళ స్టోరీ 2 సినిమా గురించి ఆలిండియా ముస్లీం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రిజ్వి బరేల్వి మాట్లాడుతూ.. అవాస్తవ కథనాలతో కేరళ స్టోరీ 2ను రూపొందించారు. కొందరు ఫిల్మ్ మేకర్స్ సులభంగా డబ్బు సంపాదించేందుకు ఇలాంటి సినిమాలను నిర్మించే ట్రెండ్ తీసుకొచ్చారు. ఇలాంటి సినిమాలు మత పరమైన ఘర్షణలకు దారి తీసేలా చేస్తున్నాయి. హిందు, ముస్లింల మధ్య సోదరభావాన్ని దెబ్బతీస్తున్నాయి. ముస్లింలను దెబ్బ తీసేందుకు పక్కా ప్లాన్ ప్రకారం ఇలాంటి సినిమాలను రూపొందిస్తున్నారు అని అన్నారు.
ఇదిలా ఉండగా, హిందుత్వ వాదులు ఈ సినిమా కంటెంట్ గురించి సానుకూలంగా స్పందిస్తూ.. లవ్ జిహద్ పేరుతో హిందూ అమ్మాయిలను బలవంతంగా మత మార్పిడి చేయిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో కేసులు నమోదు అవుతున్నాయి. కేరళలో ఇలాంటి ఘటనలు చాలా దారుణంగా ఉన్నాయి అనే విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఈ సినిమా కథ, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందింది అని చెబుతున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత విపుల్ షాగా మీడియాలో ఘాటుగా ఏమని స్పందించారంటే?


Click it and Unblock the Notifications











