దటీజ్ పవన్ కల్యాణ్ రేంజ్.. అంతమందిలో ప్రధాని మోడీ ఆగి మరీ..!
సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ అయ్యిన హీరోలు చాలా మందే ఇండియన్ సినిమా దగ్గర కనిపిస్తారు. అయితే ఇది మన సౌత్ నుంచి బాగా కనిపిస్తుంది కానీ అందరిలా కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రయాణం మాత్రం కొంచెం వేరేలా ఉంటుంది అని చెప్పాలి. కాగా పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా దగ్గర వరుస బ్లాక్ బస్టర్స్, ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సినిమా ఉన్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చి షాకిచ్చారు.
అప్పటికే ఎన్నో ప్లాప్ లలో ఉన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు అనుకునే సమయంలోనే రాజకీయంగా సొంత పార్టీ పెట్టి అనౌన్స్ చేయడం ఒకింత అభిమానులకి కూడా మింగుడు పడలేదు. అప్పుడే ఎందుకు అని కూడా చాలా మంది అనుకున్నారు. కానీ పవన్ రాజకీయాల్లోకి వచ్చేసి అక్కడ కూడా పెద్ద ఎదురు దెబ్బలు తినక తప్పలేదు.

కాగా ఇలా సినిమాల్లో దాదాపు ఒక దశాబ్దం వైఫల్యాలు, ఇదే తరహాలో రాజకీయాల్లో కూడా ఒక దశాబ్దం వైఫల్యాలు, కాంట్రవర్సీలు తర్వాత ఏకంగా డిప్యూటీ సీఎం వరకు తాను ఎదిగారు. దీనితో పవన్ కళ్యాణ్ ఇపుడు కేవలం లోకల్ రేంజ్ నుంచి నేషనల్ లెవెల్ లీడర్ రేంజ్ లోకి మారిపోవడం జరిగింది. కాగా పవన్ కళ్యాణ్ ని చాలా మంది తక్కవ అంచనా వేసి ఉండొచ్చు కానీ కేవలం కొంతమంది ప్రముఖ లీడర్స్ మాత్రమే పవన్ లోని పొటెన్షియల్ ని అర్ధం చేసుకున్నారని చెప్పాలి.
అదే ఇపుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి పవన్ ని అంతమంది పార్లమెంట్ సభ్యుల ముందు కేజీయఫ్ కి మించిన రేంజ్ ఎలివేషన్ ఇస్తూ తుఫాన్ అని అన్నా ఇప్పుడు దేశ రాజధానిలో ఇతర జాతీయ లీడర్స్ ఉన్నప్పటికీ పవన్ దగ్గరకి వచ్చేసరికి ప్రత్యేకంగా మాట్లాడినా కూడా అది కంప్లీట్ గా పవన్ రేంజ్ ఏ లెవెల్లో మోడీ దగ్గర ఉంది అనేదానికి అద్దం పడుతుంది.
కాగా ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచినా సంగతి తెలిసిందే. అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం నిమిత్తం పవన్ కూడా హాజరయ్యారు. అయితే స్టేజి మీద నార్త్ లీడర్స్ అందరికీ మోడీ మామూలుగా కరచాలనం చేస్తూ వెళ్లిపోయారు. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ దగ్గరకి వచ్చేసరికి ఆగి మరీ కరచాలనం ఇచ్చి కొంచెం నవ్వుతు మాట్లాడ్డం ఆ స్టేజి మీదే మంచి హైలైట్ గా నిల్చింది.
దీనితో ఇలాంటి విజువల్స్ ముందు ఇటీవల పవన్ మీద వచ్చిన పలు ట్రోల్స్, ఇతర నెగిటివ్ కామెంట్స్ అన్నీ తేలిపోయాయి అని చెప్పక తప్పదు. దీనితో పవన్ అభిమానులు సహా మెగా కుటుంబం అభిమానులు సినీ ప్రముఖులు కూడా ఇది పవన్ రేంజ్ అంటే తన స్థాయి వేరు స్థానం వేరు అంటూ ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తున్నారు. కాగా ఈ క్లిప్ ఇపుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అయ్యిపోతుంది.
ఢిల్లీలో మోదీజీ - పవన్ జీ ఆత్మీయ పలకరింపు
— JanaSena Party (@JanaSenaParty) February 20, 2025
ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ నూతన సీఎం రేఖాగుప్తా గారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం @PawanKalyan గారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రత్యేకంగా కరచాలనం చేస్తూ, ఆప్యాయంగా మాట్లాడిన గౌ|| ప్రధాని శ్రీ… pic.twitter.com/noY0sIliG1
స్థాయి.... స్థానం ✴️✴️ pic.twitter.com/RDSdXdAh9k
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) February 20, 2025


Click it and Unblock the Notifications











