అడ్డంగా దొరికిన రోజా.. తిరుపతి లడ్డూ కల్తీ వివాదంలో ఓపెన్‌గా..
Tirumala Laddu Controversy: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ వ్యవహరం కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలు ఏపీ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పాలక-ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతున్నాయి. ఈ వ్యవహరం నేషనల్ మీడియాలో హాట్ టాఫిక్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు రోజా, జోగి రమేష్‌ల మధ్య జరిగిన అంతర్గత సమావేశ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉంది?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో తాజాగా మరింత భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కోసం సరఫరా చేసిన నెయ్యిలో టాయిలెట్ క్లీనర్‌ల్లో వాడే ప్రమాదకర రసాయనాలు కూడా కలిపినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది.

దర్యాప్తు ప్రకారం.. నిందిత సంస్థ భోలేబాబా డెయిరీ (Bolebaba Dairy) డైరెక్టర్లు ఒక్క చుక్క పాలు కూడా వాడకుండా పామాయిల్, పామ్‌కెర్నెల్ ఆయిల్‌లతో పాటు వివిధ కెమికల్స్ కలిపి 'ఆవునెయ్యి' పేరుతో కల్తీ నెయ్యిని తయారు చేసినట్లు అభియోగపత్రంలో పేర్కొన్నారు. నెయ్యిలా కనిపించే రంగు, వాసన, రుచి, క్రీమినెస్ రావడానికి లబ్సా, లాక్టిక్ యాసిడ్, మోనోగ్లైసెరైడ్స్ వంటి రసాయనాలను వినియోగించినట్లు సిట్ గుర్తించింది.
ఈ ప్రక్రియలో న్యూఢిల్లీకి చెందిన అరిస్టో కెమికల్స్ (Aristo Chemicals) నుంచి సుమారు 8,900 కిలోల లాక్టిక్ యాసిడ్, లబ్సా/యాసిడ్ స్లర్రీతో పాటు భారీ మొత్తంలో ఇతర కెమికల్స్ కొనుగోలు చేసినట్లు రికార్డులు చూపిస్తున్నాయి. మొత్తం కల్తీ నెయ్యి తయారీ కోసం లక్షల కిలోల పామాయిల్, పామ్‌కెర్నెల్ ఆయిల్‌తో పాటు ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, ఫుడ్ గ్రేడ్ లాక్టిక్ యాసిడ్, మోనోగ్లైసెరైడ్స్ వంటి పదార్థాలు వాడినట్లు సిట్ తేల్చింది. ల్యాబ్ పరీక్షల్లో నెయ్యిగానే ఫలితాలు వచ్చేలా చేయడం కోసం ఈ రసాయనాలను జోడించినట్లు అభియోగపత్రంలో స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ కెమికల్స్ సరఫరా చేసిన వ్యాపారులను కూడా కేసులో నిందితులుగా చేర్చారు.
సాధారణంగా లబ్సా వంటి రసాయనాలు చమురు బావుల శుభ్రత, వస్త్ర పరిశ్రమలో క్లీనింగ్ ఏజెంట్‌గా ఉపయోగిస్తారు. ఇవి ఆహార ఉత్పత్తుల్లో వాడటం పూర్తిగా నిషేధితం. వైద్య నిపుణుల ప్రకారం.. ఇలాంటి లబ్సా కలిసిన నెయ్యి వినియోగిస్తే జీర్ణాశయ సమస్యలు, కాలేయ వ్యాధులు, పేగులకు గాయాలు ఏర్పడే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి తీవ్రమైన రోగాల ముప్పు కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇలా శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సరఫరా చేసిన నెయ్యిలో ఇంత ప్రమాదకర రసాయనాలు కలిపినట్లు తేలడం భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన లడ్డూ వివాదాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు ముగ్గురు మంత్రులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్‌తో కమిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది సర్కార్. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం.
ఈ కమిటీ ప్రధానంగా లడ్డూ వ్యవహారంలో జరిగిన పరిణామాలు, ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, అలాగే భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టనుంది. అంతేకాదు, కూటమిలోని పార్టీల నేతలతో కూడిన మరో కమిటీని కూడా ఏర్పాటు చేసి రాజకీయ, పాలనా కోణాల్లో ఈ అంశాన్ని లోతుగా విశ్లేషించనున్నారు. ఇలా తిరుమల లడ్డూ వ్యవహారాన్ని ఏపీ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది.
ఇలా ఉంటే.. ఈ ఉద్రిక్తతల పరిస్థితుల మద్య వైసీపీ నాయకులు రోజా, జోగి రమేష్‌ల మధ్య జరిగిన అంతర్గత సమావేశ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రోజా మాట్లాడుతూ... 'తప్పు చేశాం... దేవుడితో పెట్టుకున్నాం. యేసయ్య నుంచి తిరుపతి వెంకటేశ్వరుడి వరకూ ఏం చేస్తారో అన్న భయం అందరిలో ఉంది. బయటికి మాత్రం బింకంగా మాట్లాడుతున్నాం కానీ, నిజంగా తప్పు చేస్తే ఊరుకుంటారా? ఈ విషయం జనాలకు బాగా అర్థమవుతుంది' అని చెప్పినట్లు వినిపిస్తోంది. దీనికి స్పందించిన జోగి రమేష్... 'ఈ అంశాన్ని నేషనల్ మీడియా చాలా బాగా కవర్ చేసింది. ఇది ఇప్పటికే నేషనల్ న్యూస్ అయిపోయింది. పార్లమెంట్‌లో కూడా దీనిపై మాట్లాడుతున్నారు' అంటూ పరిస్థితి తీవ్రతను ప్రస్తావించారు.
ఈ క్లిప్ బయటకు రావడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ముఖ్యంగా జన సేన పార్టీ కార్యకర్తలు, తెలుగు దేశం మద్దతుదారులు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ మాటలతో లడ్డూ కల్తీ వ్యవహారంపై వైసీపీ నేతలలోనే ఆందోళన, భయం స్పష్టంగా కనిపిస్తోందన్న ప్రచారం మొదలైంది. మరోవైపు పాలక కూటమి వర్గాలు ఈ వీడియోను ఆధారంగా చేసుకుని ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
అయితే ఈ వీడియో పూర్తిగా ఎడిట్ చేసినదని, ఆడియో మార్చినదని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. వైసీపీ అధికారిక ఖాతాలు, మద్దతుదారులు పూర్తి వీడియోను రిలీజ్ చేస్తూ ఇది టీడీపీ, జనసేన కుట్ర అని ఆరోపిస్తున్నారు. అసలు సంభాషణలో రోజా, జోగి రమేష్ టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, లడ్డు వివాదంలో తమ పార్టీ తప్పు చేయలేదని వాదిస్తున్నారని వివరిస్తున్నారు. మొత్తంగా చూస్తే... ఇప్పటికే సంచలనంగా మారిన తిరుమల లడ్డూ కేసు, ఈ వీడియోతో పరిస్థితి మరింత ఉద్రికత్తంగా మారిపోయిందనే చెప్పాలి


Click it and Unblock the Notifications











