పోసాని అరెస్ట్‌పై షాకింగ్ కామెంట్స్.. పూనం కౌర్ ట్వీట్ వైరల్
సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు పోసాని కృష్ణమురళిని ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడం తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పోసానిని అరెస్ట్ చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. పోసాని అరెస్ట్‌పై ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. తాజాగా పోసాని కృష్ణమురళి అరెస్ట్‌పై సినీనటి పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన మాయాజాలం సినిమాతో చిత్ర సీమలో అడుగుపెట్టారు పూనం కౌర్. ఆ తర్వాత ఒక విచిత్రం, నిక్కీ అండ్ నీరజ్, శౌర్యం, వినాయకుడు, ఈనాడు, గణేష్, నాగవల్లి, గగనం, బ్రహ్మీ గాడి కథ, ఆడు మగాడ్రా బుజ్జి, సూపర్‌స్టార్ కిడ్నాప్, అటాక్, నాయకి, శ్రీనివాస కళ్యాణం, నాతి చరామి చిత్రాల్లో నటించింది ఈ పంజాబీ ముద్దుగుమ్మ. అందం , అభినయం పరంగా మంచి మార్కులు వేయించుకున్నా ఎందుకో పూనం కౌర్‌కు అనుకున్న స్థాయిలో స్టార్ డమ్ దక్కలేదు.

సినిమాలలో అవకాశాలు తగ్గడంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది పూనం కౌర్. సూపర్ 2, సెలబ్రెటీ డేంజర్ వంటి షోలతో పాటు ఈటీవీలో ప్రసారమైన స్వర్ణ ఖడ్గం సీరియల్‌లో మహారాణిగా నటించింది. కానీ ఇవి అంతగా ఆదరణ దక్కలేదు. సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నారు పూనం కౌర్. సోషల్ మీడియాలో సంచలన పోస్టులు పెడుతూ హల్ చల్ చేస్తుంటారు. తెలుగు సినీ పరిశ్రమలో, తెలుగు రాజకీయాల్లో ఏం జరిగినా వెంటనే స్పందించి ఓ పోస్ట్ వదలడం పనిగా పెట్టుకుంది పూనం కూర్. సమంతపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు, జానీ మాస్టర్ అరెస్ట్, మీటూ ఉద్యమం, క్యాస్టింగ్ కౌచ్ ఇలా అన్నింటిపై వివాదాస్పద పోస్టులు పెడుతూ వచ్చారు పూనం కౌర్.
తాజాగా సమాజంలో విద్వేషాలు రగిల్చేలా మాట్లాడారంటూ పోసాని కృష్ణమురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నేత ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ నెల 26న పోసానిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌కు తరలించి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు.

ఈ వ్యవహారంపై పూనం కౌర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు దరిద్రంగా తయారయ్యాయని.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అధ్వాన్నంగా పరిస్ధితులు ఉన్నాయని ఆరోపించారు. బలహీనులను అరెస్ట్ చేయడం ప్రతీకారం తీర్చుకోవడం కిందకే వస్తుందని పూనం మండిపడ్డారు. పోసాని కృష్ణమురళి వల్ల తాను కూడా వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డానని , కానీ ఆయన ఆరోగ్యం గురించి నాకు ఆందోళనగా ఉందని పోసాని గురించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పూనం కౌర్ ట్వీట్ సినీ , రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











