జగన్‌ను చూసుకుని ఊగిపోయాడు .. పోసానికి తగిన శిక్షే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

సినీనటుడు, దర్శక , నిర్మాత పోసాని కృష్ణమురళి అరెస్ట్ కావడం సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. పలు కేసుల్లో రాష్ట్రమంతా తిరుగుతుండటంతో పాటు బెయిల్ కోసం ప్రయత్నించినప్పుడల్లా ఏదో ఒక ఆటంకం ఎదురవుతుండటంతో పోసాని కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు పోసాని కృష్ణమురళి బెయిల్‌పై బయటికి వస్తారా? లేదా? మరిన్ని కేసులు ఆయనను చుట్టుముడతాయా? అంటూ వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

కులాలు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రగిల్చేలా మాట్లాడుతున్నారంటూ పోసాని కృష్ణమురళిపై అన్నమయ్య జిల్లాకు చెందిన జనసేన నేత ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోసానిని అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా గత నెల 26న హైదరాబాద్ గచ్చిబౌలి నివాసంలో కృష్ణమురళిని అదుపులోకీ తీసుకున్నారు. తదనంతరం పోసానిని రైల్వే కోడూరు జైల్లో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను రాజంపేట సబ్ జైలుకు తరలించారు.

tollywood producers made sensatinal comments on ysrcp leader posani krishna murali case

అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోసాని కృష్ణమురళీపై కేసులు నమోదు కావడంతో పోలీసులు పలు ఏరియాలకు తరలించాల్సి వచ్చింది. ఆయనపై నమోదైన పలు కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కృష్ణమురళి విడుదల అవుతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ జారీ చేయడంతో పోసాని బెయిల్‌కు బ్రేక్ పడినట్లయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ న్యాయమూర్తి ఎదుట పోసాని కృష్ణమురళి భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు.

తన ఆరోగ్యం బాలేదని.. 2 ఆపరేషన్లు చేశారని, స్టంట్లు వేశారని .. నాకు భార్యాబిడ్డలు ఉన్నారని పోసాని కృష్ణమురళీ పేర్కొన్నారు. తనకు బెయిల్ మంజూరు చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని ఆయన వాపోయారు. మంగళవారం పోసాని కృష్ణమురళిని సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం పోసాని కృష్ణమురళిని సీఐడీ కార్యాలయానికి తరలించారు అధికారులు.

Take a Poll

కాగా.. పోసాని కృష్ణమురళి తీరుపై సినీ రంగానికి చెందిన ప్రముఖులే మండిపడుతున్నారు. ఆయన తీరు కారణంగానే సమస్యల్లో చిక్కుకున్నారని అంటున్నారు. ప్రముఖ నిర్మాత, నటుడు అశోక్ కుమార్ ఇటీవల ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. నాడు ప్రభుత్వంలో ఉండటంతో పోసాని హద్దులు దాటి మాట్లాడారని ఆయన అన్నారు.

పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేసిన నాటి నుంచి పోసానితో నాకు పరిచయం ఉందని, చాలా సార్లు ఫోన్ చేసి రాజకీయ విమర్శలపై నచ్చచెబుదామని చూశానని, కానీ విరమించుకున్నానని అశోక్ కుమార్ తెలిపారు. రాజకీయాల్లో పదవుల్లో కోసం క్యారెక్టర్‌ను కోల్పోవద్దని.. రాజకీయ పార్టీ అండ ఉందని ఊగిపోవద్దని , కోరి కష్టాలు తెచ్చుకోవద్దని అశోక్ కుమార్ హితవు పలికారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X