పవన్ కళ్యాణ్‌లో ఆ దమ్ముంది.. భవిష్యత్తులో సీఎం అవ్వడం పక్కా, సీనియర్ నటుడి వ్యాఖ్యలు

దిగ్గజ నటి , గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించిన దర్శకురాలు విజయనిర్మల వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నరేష్ ఒకప్పుడు కామెడీ హీరోగా నవ్వించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ అవ్వడంతో ఆయనకు అవకాశాలు క్యూకట్టాయి. ప్రస్తుతం తెలుగునాట మోస్ట్ వాంటెడ్ సహాయ నటుడు నరేషే . సినిమాలతో పోలిస్తే వ్యక్తిగత జీవితం, పవిత్ర లోకేష్‌తో సహజీవనం వంటి వివాదాలతో ఆయన నిత్యం వార్తల్లో నిలుస్తారు. సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే వీరి వ్యవహారం ఓ కుదుపు కుదిపింది. ఇక నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి చేసిన రాద్ధాంతం అంతకుమించి పాపులర్ అయ్యింది.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నరేష్ తన వ్యక్తిగత, సినిమా సంగతులతో పాటు సమకాలీన అంశాలపైనా స్పందిస్తూ ఉంటారు. గతంలో బీజేపీ నేతగా పనిచేసిన అనుభవం ఉండటంతో రాజకీయాలపైనా మంచి అవగాహన ఉంది. కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచార సభల్లో సూపర్‌స్టార్ కృష్ణ ప్రస్తావన తీసుకురావడంపై నరేష్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. పవన్ ..కృష్ణను విమర్శించడం తనను షాక్‌కు గురిచేసిందని.. కృష్ణది బంగారం లాంటి మనసని అందరికీ తెలుసునని నరేష్ అన్నారు. కృష్ణ ఎప్పుడూ పొత్తులు పెట్టుకోలేదని, తన రాజకీయ ప్రసంగాల్లో ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని నరేష్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌కి మంచి చేయాలనే ఆ ట్వీట్ పెట్టానని .. కేవలం కృష్ణగారి గురించి ప్రస్తావించొద్దు అని మాత్రే అన్నానని , తన మద్ధతు పవన్ కళ్యాణ్‌కేనని పేర్కొన్నారు.

tollywood senior actor VK naresh praised AP Dy CM chief pawan kalyan

నిన్నగాక మొన్న నా బేబీ , బుజ్జి ఎటో వెళ్లిపోయిందంటూ నరేష్ వదిలిన ఓ వీడియో వైరల్ అయ్యింది. బేబీ లేకుండా తాను అన్నం తినలేనని.. అకస్మాత్తుగా తనను వదిలి వెళ్లిపోయిందని , ఎవరిని అడిగినా బేబీ తెలియదని హేళన చేస్తున్నారంటూ నరేష్ కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేయడంతో ఆ బేబీ పవిత్రా లోకేషేనేమో అన్న చర్చ నడిచింది. పుకారు రాయుళ్లు ఈ వీడియోను అడ్డుపెట్టుకుని ఏదేదో రాసేసి.. దానికి కాస్త మసాలా దట్టించి వదిలిపెట్టారు. అయితే ఇదంతా తన లేటెస్ట్ మూవీ వీరాంజనేయులు విహారయత్ర ప్రమోషన్ కోసమేనంటూ తెలియడంతో జనం నవ్వలేక చస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా ఆగస్ట్ 14న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.

tollywood senior actor VK naresh praised AP Dy CM chief pawan kalyan

ఈ సినిమాకు సంబంధించిన విషయాలను నరేష్ మీడియాతో పంచుకున్నారు. ఈటీవీతో తనది 40 ఏళ్ల ఎమోషనల్ బంధమని.. ఈనాడు కాంపౌండ్‌లో మనిషినని చెప్పుకోవడానికి తనకు గర్వంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ గెలుపు, ఆ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై నరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు నుంచి నేటి వరకు సినీ పరిశ్రమ, రాజకీయ రంగాలది అవినాభావ సంబంధమన్నారు. రాష్ట్రంలో మార్పు కోసం ఖచ్చితంగా పవన్ నిలబడతారని, ఆ దమ్ము ఆయనలో ఉందని తనకు ఎప్పుడో తెలుసునని నరేష్ చెప్పారు. దానిని నిజం చేస్తూ పవన్ గెలిచాడు, గెలిపించుకున్నాడు.. ఓ కొత్త ఒరవడిని సృష్టించారని .. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం నరేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: janasena pawan kalyan vk naresh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X