‘ త్రిష - విజయ్‌ల మధ్యలోకి ఆ హీరోయిన్ .. ఆమె పేరుతోనే టీవీకే పార్టీ ’

భారతదేశంలో సినీనటులు రాజకీయాల్లోకి వచ్చి పాలకులుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి వారు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు. ముఖానికి రంగులేసుకునే వారికి రాజకీయాలేం తెలుసు అన్న వారి నోటితోనే శెభాష్ అనిపించుకుని .. రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్స్‌గా నిలిచారు. రాష్ట్ర, దేశ రాజకీయాలన్నీ తమ చుట్టూ జరిగేలా పవర్ హౌస్‌లా పేరు తెచ్చుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో స్టార్స్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. కానీ వీరిలో సక్సెస్ అయినవారు కొందరే.

తమిళనాడులో సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్, ఛరిష్మా కలిగిన ఇళయ దళపతి విజయ్ రాజకీయాల్లోకి రావాలంటూ ఎప్పటి నుంచో అభిమానులు కోరుతున్నారు. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ తన పొలిటికల్ ఎంట్రీని అధికారికంగా ప్రకటించారు విజయ్. తమిళగ వెట్రి కజగం (టీవీకే) పేరిట ఆయన పార్టీని ప్రకటించారు. గతేడాది అక్టోబర్ 27న విల్లుపురం జిల్లా విక్రవండి వి సాలై గ్రామంలో టీవీకే తొలి బహిరంగ సభను నిర్వహించి రాజకీయ పార్టీలకు సవాల్ విసిరింది. ఈ సభకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు, విజయ్ అభిమానులు పోటెత్తారు.

TVK means vijay thalapathy trisha Krishnan and keerthy suresh says DMK Minister mrk panneerselvam

ఈ సందర్భంగా విజయ్ ఆవేశపూరితంగా ప్రసంగం చేశారు. తాను ఎవరికీ భయపడే రకం కాదని.. ఎవరివో పేర్లు చెప్పుకుని రాజకీయాలు చేసే రకం కాదంటూ డీఎంకే, అన్నాడీఎంకేలకు చురకలు వేశారు. 2026 ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీ చేసి గెలిచే సత్తా టీవీకేకు ఉందని విజయ్ తెలిపారు. నాటి నుంచి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న ఆయన పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకున్నారు. ఇటీవల జరిగిన పార్టీ తొలి ఆవిర్భావ సభలో పీకేను ప్రజలు, కార్యకర్తలకు పరిచయం చేశారు. ప్రశాంత్ రాకతో తమిళ రాజకీయాల్లో కలకలం మొదలైంది. విజయ్ ఛరిష్మాకు పీకే వ్యూహాలు తోడైతే టీవీకేను ఆపడం కష్టమంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తి మొదలైంది.

2026 ఎన్నికల్లో టీవీకే నుంచి గట్టి పోటీ ఉంటుందని అధికార డీఎంకే భావిస్తోంది. అటు విజయ్ కూడా అన్నాడీఎంకేను పక్కనపెట్టి సీఎం ఎంకే స్టాలిన్‌ను టార్గెట్ చేయడంతో ఇరు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. డీఎంకే నేతలు విజయ్ వ్యక్తిగత జీవితంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ టికెట్లు అమ్ముకునే వ్యక్తి అవినీతి గురించి క్లాసులు పీకుతున్నాడని, బ్లాక్ మనీని జీతంగా తీసుకుంటున్నాడని విజయ్‌పై ఆయన ఆరోపణలు చేశాడు.

కన్న తల్లిదండ్రులతో కలిసి ఉండనివాడు.. రాష్ట్రాన్ని కాపాడుతాడా అని పనీర్ సెల్వం ప్రశ్నించారు. ఇదే సమయంలో టీవీకే అంటే అర్ధం ఏంటని ప్రజలను అడగ్గా.. టీ అంటే త్రిష, వి అంటే విజయ్, కే అంటే కీర్తి సురేష్ అంటూ సమాధానం రావడంతో అంతా షాకయ్యారు. అలాంటి పార్టీ అధికారంలోకి వస్తామని, తమిళనాడును నడిపిస్తామని అంటోందని పనీర్ సెల్వం మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తమిళ సినీ , రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.

గత కొంతకాలంగా త్రిష - విజయ్‌లు రిలేషన్‌లో ఉన్నారంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని.. టీవీకేలో త్రిష కూడా కీలకపాత్ర పోషించనుందని గాసిప్స్ వినిపించాయి. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో నా లక్ష్యం తమిళనాడుకు సీఎం కావడమేనని చెప్పడం ఈ వార్తలకు బలాన్ని తీసుకొచ్చింది. ఇక కీర్తి సురేష్‌తో త్రిష, విజయ్‌లకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గోవాలో జరిగిన ఈమె పెళ్లికి వీరిద్దరూ సీక్రెట్‌గా వెళ్లి రావడం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X