జనసేన 30 ఇయర్స్ పృథ్వీకి బిగ్ షాక్.. ఆ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అంటూ పుకార్లు

తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనతో సపోర్టింగ్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా సత్తా చాటుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు పృథ్వీ రాజ్. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో మంచి మంచి పాత్రల్లో నటించిన ఆయన.. ప్రేక్షకులకు మజాను పంచుతూనే ఉన్నారాయన. అదే సమయంలో రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి అతడి కెరీర్ విభిన్నంగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అతడిపై అరెస్ట్ వారెంట్‌ జారీ అయింది. ఇంతకీ పృథ్వీ రాజ్ ఏం చేశాడు? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూడండి.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌కు శ్రీలక్ష్మి అనే మహిళను 1984లో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వీరికి ఓ కుమారుడు, కుమార్తె జన్మించారు. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో.. కొన్నేళ్లుగా పృథ్వీ రాజ్‌ భార్యతో విడిగా ఉంటున్నాడు. దీంతో శ్రీలక్ష్మీ పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉంటుంది.

Vijayawada Family Court Gives Arrest Order Against 30 Years Prudhvi Raj

పృథ్వీ రాజ్‌కు దూరంగా ఉంటోన్న అతడి భార్య 2017లో విజయవాడ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తన భర్త నుంచి తనకు నెలకు రూ. 8 లక్షలు భరణం ఇప్పించాలని పిటీషన్ వేసింది. అంతేకాదు, పృథ్వీ రాజ్‌ విజయవాడలో తన అమ్మవాళ్ల ఇంట్లో ఉంటూనే చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించేవాడని, ఆ ఖర్చులన్నీ భరించారని ఆమె కోర్టుకు తెలిపింది.

నటుడు పృథ్వీ రాజ్ మీద ఇచ్చిన పిటీషన్‌లో అతడి భార్య శ్రీలక్ష్మి అతడు తనను తరచూ వేధించేవాడని, 2016 ఏప్రిల్‌ 5న ఇంట్లో నుంచి బయటకు కూడా పంపించేశాడని చెప్పుకొచ్చింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు పృథ్వీ రాజ్‌ తన భార్యకు నెలకు 8 లక్షలు రూపాయలతో పాటు కేసు దాఖలు చేసినప్పటి నుంచి అయిన ఖర్చులు కూడా ఆయనే ఇవ్వాలని తీర్పునిచ్చింది.

ఇదే తీర్పులో విజయవాడ ఫ్యామిలీ కోర్టు ప్రతి నెలా 10వ తేదీ నాటికి పృథ్వీ రాజ్ తన భార్యకు భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే, అతడు కోర్టు తీర్పును ధిక్కరించినట్లు తెలిసింది. దీంతో తాజాగా మరోసారి జరిపిన విచారణలో పృథ్వీ రాజ్‌కు ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Vijayawada Family Court Gives Arrest Order Against 30 Years Prudhvi Raj

ఇదిలా ఉండగా.. పృథ్వీ రాజ్ కొన్నేళ్ల క్రితమే జనసేన పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. ఆ పార్టీ గెలిచిన ఆనందం లేకుండానే ఇప్పుడు అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అసలు ఇందులో ఎంత నిజం ఉంది అనే దానిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X