Who is Miriyala Apparao: ఎవరీ మిరియాల అప్పారావు? పద్మశ్రీ గ్రహీతకు పవన్ కల్యాణ్ ప్రశంసలు
ప్రతీ ఏడాది వివిధ రంగాల ప్రముఖులకు వారి విశేష సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మ అవార్డుల ప్రకటన వెలువడింది. పలువురు తెలుగు ప్రముఖులు పలు రంగాలకు సేవలందించినందుకుగాను నరేంద్ర మోడీ ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా అవార్డుకు ఎంపికైన వారికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఆయన ఓ ప్రకటనలో ఏం చెప్పారంటే?
ఐదు దశాబ్దాలపైబడి తెలుగు చలనచిత్ర సీమలో తన అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన శ్రీ నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషదాయకం. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన శ్రీ బాలకృష్ణ హిందూపురం శాసన సభ్యుడిగా, బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా ఎన్నో సేవలందిస్తున్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను అని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో పలు పరిశోధనలు చేసిన డాక్టర్ డీ నాగేశ్వర్ రెడ్డి పద్మ విభూషణ్‌కు ఎంపికైనందుకు అభినందనలు అని తన ప్రకటనలో తెలిపారు. అలాగే ప్రజా ఉద్యమాల్లో మంద కృష్ణ మాదిగ గారికి ప్రత్యేక స్థానం ఉంది. ఎంఆర్పీఎస్ ద్వారా మాదిగలకు రిజర్వేషన్ కోసం పోరాడారు. అనారోగ్యంతో బాధపడే పిల్లలకు ప్రభుత్వ వైద్య సహాయం కోసం, వికలాంగుల కోసం ప్రజా పోరాటాలు చేశారు. మంద కృష్ణ మాదిగ పద్మశ్రీ కు ఎంపికైనందుకు అభినందనలు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సహస్రావధాని, కవి శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు, సాహిత్యం-విద్య విభాగంలో ఎంపికైన శ్రీ కె.ఎల్.కృష్ణ గారు, శ్రీ వి.రాఘవేంద్రాచార్య పంచముఖి గారికి అభినందనలు అని పవన్ కల్యాణ్ ప్రకటనలో పేర్కొన్నారు.
మట్టిలో మాణిక్యాలాంటి వారికి పద్మ పురస్కారాలు అందిస్తోంది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది 30మంది ఈ విధంగా ఎంపికైనవారు ఉండటం సంతోషాన్ని కలిగించింది. మన రాష్ట్రానికి చెందిన బుర్రకథ కళాకారుడు శ్రీ మిరియాల అప్పారావు గారికి మరణానంతరం పద్మశ్రీకి ఎంపికయ్యారు. వారి కళా సేవకు తగిన గుర్తింపు దక్కింది అని పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు.
దేశంలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. రాష్ట్రపతి సుమారుగా 139 అవార్డుల కోసం ప్రముఖులను ఎంపిక చేసింది. వారిలో 7 గురిని పద్మ విభూషణ్, 19 మంది పద్మ భూషణ్, 113 మందిని పద్మ శ్రీ అవార్డుల కోసం ఎంపిక చేశారు. ఈ సంవత్సరం ఎంపిక చేసిన వారిలో 23 మంది మహిళలు ఉన్నారు.


Click it and Unblock the Notifications











