Who is Selvi S Keerthana? సెల్వీ కీర్తన్ ఎవరు? విజయ్ నమ్మకాన్ని ఎలా గెలుచుకొన్నారంటే?

తమిళనాడు ప్రభుత్వంలో కొత్తతరం, కొత్త రక్తం ఉరకలేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. తమిళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మార్పు స్పష్టంగా కనిపించింది. టీవీకే పార్టీలో గెలిచిన యువ ఎమ్మెల్యేలకు విజయ్ పెద్ద పీట వేశారు. తన క్యాబినెట్‌లో యువ రక్తాన్ని నింపి స్పూర్తిదాయకంగా నిలిచారు. అయితే తమిళనాడులో ముఖ్యమైన పట్టణం శివకాశి నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఎస్ కీర్తన తొలిసారి ఎమ్మెల్యేగా మంత్రి పదవిని అందుకొన్నారు. అయితే ఇంతకు కీర్తన్ ఎవరు? అనే విషయంపై సోషల్ మీడియా, గూగుల్‌లో భారీగా సర్చ్ చేస్తున్నారు. దళపతి విజయ్‌లో విశ్వాసం నింపిన యువ మహిళ ఎవరు? అనే విషయం చర్చానీయాంశమైంది. ఇంతకు కీర్తన్ ఎవరు? అనే వివరాల్లోకి వెళితే..

సెల్వి ఎస్ కీర్తన్ తెలుగు మూలాలు ఉన్న తెలుగు అమ్మాయి. వయసు 29 సంవత్సరాలు. శివకాశీ ప్రాంతంలో స్థిరపడ్డారు. మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన ఆమె బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఎంఎస్సీ స్టాటిస్టిక్స్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఆమె కొద్దికాలంగా పొలిటికల్ కన్సల్టెంట్‌గా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్ల టీడీపీ పార్టీ గెలుపు కోసం పనిచేశారు. ఇటీవల టీవీకే పార్టీలో చేరి శివకాశీ నుంచి పోటీ చేశారు.

Who is Selvi S Keerthana

శివకాశీ నియోజకవర్గంలో తమిళ వెట్రీ కజగ పార్టీ టికెట్‌పై పోటీ చేసిన ఆమె చరిత్ర సృష్టించారు. 70 ఏళ్లుగా పురుష అభ్యర్థులే గెలుస్తూ వస్తున్న ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచిన తొలి మహిళగా రికార్డు క్రియేట్ చేశారు. ఆమెలోని ప్రతిభను చూసిన ఓటర్లు 69 వేల ఓట్లు వేశారు. దాంతో 11 వేల 670 ఓట్ల మెజారిటీతో గెలిచారు. విజయ్ ప్రభుత్వంలో యువ మంత్రిగా 29 ఏళ్ల వయసులో బాధ్యతలు చేపట్టనున్నారు. విజయ్ క్యాబినెట్‌లో పిన్న వయసు ఉన్న మంత్రిగా ఘనతను సాధించారు.

తనపై విశ్వాసం ఉంచి తనకు క్యాబినెట్‌లో స్థానం కల్పించడంపై ఎస్ కీర్తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తాడు. సమూలైన మార్పులు రాబోతున్నాయి. తమిళ రాజకీయాలు, ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు తప్పనిసరిగా అవుతుంది. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. విజయ్ ప్రభుత్వ పాలనలో అంతా మంచి జరుగుతుంది. నాలాంటి వారికి మంత్రి పదవి ఇవ్వడంతోనే ఆయన మార్పుకు శ్రీకారం చుట్టారు అని అన్నారు.

తనలోని నైపుణ్యతను, టాలెంట్‌ను చూసిన నన్ను ప్రోత్సాహించారు. ఆయన స్పూర్తితోనే మార్పును తీసుకొస్తాం. రాబోయే 50 ఏళ్లు మా పాలనే ఉంటుంది. తమిళనాడులో మా ప్రభుత్వమే సుధీర్ఘకాలంగా పాలనను కొనసాగిస్తుంది. నాకు మంత్రి పదవి ఇవ్వడం నేను నమ్మలేకపోయాను. వేరే ప్రభుత్వం ఉంటే నేను మంత్రిని అయ్యే దానిని కాదు. కేవలం విజయ్ వల్లే నేను మంత్రిని అయ్యాను. మేము ప్రభుత్వాన్ని ప్రజల సంక్షేమం కోసం నడిపిస్తాం. అభివృద్ధి ఏమిటో చూపిస్తాం అని కీర్తన అన్నారు.

విధ్యాధికురాలు, సోషల్ మీడియా స్ట్రాటెజీలో పార్టీని గణనీయంగా ముందుకు నడిపించారు. ఆమె చురుకుగా పార్టీ వ్యవహారాల్లో తీసుకొన్న నిర్ణయాలు బలోపేతం చేశాయి. పలు సందర్భాల్లో దళపతి విజయ్‌కి నమ్మకాన్ని క్రియేట్ చేసింది. ఆ కారణంగానే నాలుగు భాషలను పరిపూర్ణంగా మాట్లాడే కీర్తనకు మంత్రిగా విజయ్ అవకాశాన్ని కల్పించారు.

Read more about: vijay tvk Selvi S Keerthana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X