Who is Srikanth Bolla? శ్రీకాంత్ బొల్లను ఆంధ్ర రెడ్డి పార్టీ అవమానించిందా? రాష్ట్రపతిని ఎలా మెప్పించాడంటే?
పుట్టుకతోనే అంధుడైన శ్రీకాంత్ బోల్ల వ్యవస్థలో ఎదురైన ప్రతికూలతలను ఎదురించి పారిశ్రామిక వేత్తగా ఎదిగిన తీరుతో రూపొందిన శ్రీకాంత్ చిత్రం ఓటీటీలో ట్రెండింగ్ అవుతున్నది. ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను చక్కగా ఈ సినిమా చూపించి.. అందరిలోను స్పూర్తిని రగిలించారు. అయితే తన అంధత్వాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని ఆంధ్రలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ రాజకీయ పార్టీ తీరును ఆయన తీవ్రంగా వ్యతిరేకించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆ రాజకీయ పార్టీ అతడితో ఎలా వ్యవహరించిందనే వివరాల్లొకి వెళితే..
శ్రీకాంత్ బొల్ల అంధత్వంతో పుట్టడంతో అతడిని చిన్నతనంలోనే అతడిని ప్రాణాలతో వదిలించుకోవాలని సూచిస్తారు. కానీ కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో ఆయనను బ్లైండ్ స్కూల్స్‌లో చేర్పిస్తారు. పాఠశాలలో టీచర్ ప్రొత్సాహంతో చదువుల్లో అద్బుతంగా రాణిస్తాడు.

ఓ సందర్బంలో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం హాజరైన ఫంక్షిన్‌లో పిల్లల్ని మీరు జీవితంలో ఏం కావాలని కోరుకొంటున్నారు అని ఆయన అడిగితే.. ఈ దేశానికి అంధుడైన తొలి రాష్ట్రపతిని కావాలనుకొంటున్నాను అని శ్రీకాంత్ చెబుతాడు. ఆ మాటలు రాష్ట్రపతిని ఆకట్టుకొంటాయి. దాంతో రాష్ట్రపతి ప్రోత్సాహన్ని అందుకొంటాడు.
అమెరికాలో మిచిగాన్ ఇన్ప్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత అభ్యసించి.. తన సొంత ప్రాంతంలో పరిశ్రమను స్థాపించి కేవలం అంధులకే ఉద్యోగాలను కల్పించి.. యువ పారిశ్రామిక వేత్తగా రాణిస్తాడు.అలాంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన శ్రీకాంత్‌పై ఆంధ్రాకు చెందిన రెడ్డీ పార్టీ కన్నేస్తుంది. తనకు కూడా రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో ఆ పార్టీ నేతతో చర్చలు జరుపుతాడు.

శ్రీకాంత్‌తో రెడ్డి పార్టీ అధినేత చర్చలు జరుపుతూ.. మీకు ఎందుకు టికెట్ ఇస్తున్నామో తెలుసా? అని అడుగుతాడు. అయితే నేను పారిశ్రామిక వేత్తగా రాణించడం, నా వ్యక్తిత్వాన్ని చూసి మీరు టికెట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారని అనుకొంటున్నాను అని శ్రీకాంత్ అంటాడు. అందుకు రెడ్డీ పార్టీ నేత సమాధానం ఇస్తూ.. మా వద్దకు చాలా సంపన్నులైన.. అలాగే మీ కంటే పెద్ద పారిశ్రామిక వేత్తలు మాతో టచ్‌లో ఉన్నారు. కానీ మీ అంధత్వం మీకు బలహీనత.. మీకు టికెట్ ఇస్తే.. మా పార్టీకి బలం అని అవహేళన చేసినట్టు కించపరిచినట్టు మాట్లాడుతారు.
దాంతో రెడ్డి పార్టీ తీరుతో తీవ్ర అసహనం చెందిన శ్రీకాంత్ బొల్ల వారికి గుడ్ బై చెబుతాడు. తన బలహీనతను కించపరచడంపై మనస్తాపం చెందినట్టు సినిమాలో చూపించారు. అయితే ఈ సీన్ చూసిన తర్వాత ఏపీలోని రెడ్డి అధినేత పార్టీపై ప్రేక్షకులు కూడా తప్పు పడుతున్నారు. ఇంతకు ఆ పార్టీ ఏమిటో మీకు అర్ధమైందా?


Click it and Unblock the Notifications











