బాలకృష్ణ అలాంటి ట్రాక్ రికార్డు..పవన్ కళ్యాణ్ కు సాధ్యమయ్యేనా?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్.. సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు. దీంతో ఆయన నటిస్తున్న చిత్రాలకు సంబంధించిన విషయాలపై క్లారిటీ లేకుండా పోయింది. తిరిగి ఎప్పుడు సెట్స్ లో అడుగుపెడుతారు? ఏ మూవీకి కాల్ షీట్స్ ఇస్తారు? ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో 100 రోజుల పాలన తర్వాత జనసేనాని మళ్ళీ కెమెరా ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు. ఓవైపు పరిపాలన చేస్తూనే, మరోవైపు సినిమాలకు కూడా సమయం కేటాయించాలని పక్కగా ప్లాన్ చేసుకొని రంగంలోకి దిగారు. అయితే డిప్యూటీ సీఎం ఈ రెండింటినీ ఎలా బ్యాలన్స్ చేస్తారనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తోంది.

పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం ఆయన్ను మళ్ళీ వెండితెరపై చూసుకోవాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ, తాజాగా 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' సినిమా షూటింగ్ ను రీ స్టార్ట్ చేసారు. ఏమాత్రం సమయం వృథా చేయకుండా పక్కా ప్రణాళికతో మిగిలిన చిత్రీకరణను పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికి అనుకూలంగా హైదరాబాద్ లో కాకుండా, విజయవాడలోనే సెట్స్ వేసి కొత్త షెడ్యూల్‌ షూటింగ్ ప్రారంభించారు. దీంతో పాటుగా OG మూవీకీ పవన్ డేట్స్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. ఇదంతా బాగానే వుంది కానీ, ఉప ముఖ్యమంత్రి ఇలా రెండు పడవల మీద ప్రయాణం ఎలా సాగిస్తారనే చర్చ సినీ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

Will AP Deputy CM Pawan Kalyan continue in films like Nandamuri Balakrishna

ఓవైపు సినిమాలో నటిస్తూ, మరోవైపు పాలిటిక్స్ చేయడం ఏమంత ఆషామాషీ విషయం కాదు. అప్పట్లో దివంగత నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొన్ని చిత్రాల్లో నటించారు. సీఎంగా చేస్తున్నప్పుడే బిగ్ స్క్రీన్ మీద కనిపించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి కొన్నేళ్లపాటు సినిమాలకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయాలు వద్దనుకున్న తరవాతే మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. పొలిటికల్ పార్టీ పెట్టిన కమల్ హాసన్ మూవీస్ చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో కొత్తగా పార్టీ పెట్టిన హీరో విజయ్ మాత్రం తన 69వ చిత్రం అనంతరం పూర్తిగా ప్రజా సేవకే పరిమితం అవుతానని ప్రకటించారు. తమిళనాడు మినిస్టర్ గా ఉన్న హీరో ఉదయనిధి స్టాలిన్ సినిమాలకు స్వస్తి పలికారు.

పవన్ కళ్యాణ్ సైతం జనసేన పార్టీ పెట్టిన తర్వాత పూర్తిగా ప్రజా సేవకే పరిమితం అవుతానని పేర్కొన్నారు. కానీ ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. వస్తూ వస్తూనే బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాస్త విరామం తీసుకుని, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా 'హరి హరి వీరమల్లు' సెట్స్ లో అడుగు పెట్టడటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాకపోతే ఆల్రెడీ కమిటైన ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసి సినిమాలకు దూరమవుతాడా? లేదా ఇలానే యాక్టర్ కమ్ పొలిటీషియన్ గాకంటిన్యూ అవుతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఇప్పుడున్న హీరోలలో నందమూరి బాలకృష్ణ మాత్రమే అటు సినిమాలు, ఇటు రాజకీయాలను బ్యాలన్స్ చేస్తూ వచ్చారు. హిందూపూర్ ఎంఎల్ఏగా కొనసాగుతూనే ఆయన కెమెరా ముందుకు వచ్చి అభిమానులను అలరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో పయనించాలని, బాక్సాఫీస్ రికార్డులు తిరగ రాయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి జన సేనాని రెండు పడవల మీద ప్రయాణం సాఫీగా సాగుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X