మహిళా అధికారితో ఎంపీ అక్రమ బంధం.. గర్బవతిని చేశారంటూ భర్త ఆరోపణలు.. నయనతార సినిమాపై ఆఫీసర్ ట్వీట్ వైరల్

ఏపీ రాజకీయాల్లోను, సోషల్ మీడియాలో ఓ ఎంపీపై వచ్చిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
ఏపీ ప్రభుత్వంలోని కీలక విభాగంలో ఉన్నత పదవిలో కొనసాగుతున్న అధికారిణితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెను గర్బవతిని చేశారనే ఆరోపణల వార్త సామాజిక మాధ్యమాలను కుదిపేస్తున్నది. అయితే ఈ ఆరోపణలు విస్తృతంగా సోషల్ మీడియాలోప్రచారం అవుతున్న నేపథ్యంలో సదరు అధికారిణి ఓ సినిమాపై చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఏపీ రాజకీయాల్లోను, ఓ పార్టీలో వెన్నుముకగా మారిన ఓ ఎంపీపై ఆంధ్రాలోని ఓ కీలక అధికారిణి భర్త సంచలన రీతిలో ఆరోపణలు చేసినట్టు సోషల్ మీడియాలోను, ప్రధాన మీడియాలోను వార్తలు గుప్పుమంటున్నాయి. పలు టీవీ ఛానెల్లు డిబేట్లు పెట్టి సెటైర్లు వేస్తున్నాయి. దాంతో ఈ వ్యవహారం నివురు గప్పిన నిప్పులు అత్యంత భారీ వివాదానికి తెరలేపే విషయం కనిపిస్తున్నది.

Women Officer Tweet on Nayanatara s Netrikann movie goes Viral amid allegation of Illegal Relation with Rajya Sabha MP

భర్త చేసిన ఆరోపణల ప్రకారం.. సదరు అధికారిణి గర్బం దాల్చింది. అయితే తాను విదేశాల్లో ఉన్న సమయంలో ఆమె గర్బం దాల్చడంపై అనుమానాలు రావడంతో ఆయన తీగ లాగారు. దాంతో ఆమె గర్బం వెనుక రాజకీయ నాయకుడు హస్తం ఉందనే అనుమానానికి బలంగా ఆధారాలు దొరకడంతో సంచలన రీతిలో ఆరోపణలు చేశారు.

ఇదిలా ఉండగా, సదరు ఎంపీ చేసిన ప్రతీ ట్వీట్‌కు మహిళా అధికారిణి ఆహో..ఓహో.. నీ అంతటి స్పూర్తిదాయకమైన వ్యక్తి లేదంటూ ట్వీట్లు చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. ఓ ఎంపీకి అధికారి వంత పడటం ఏమిటనే ప్రశ్నను నెటిజన్లు సోషల్ మీడియాలో సంధిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కుంపటి రాజేస్తున్నది.

ఇదిలా ఉంటే.. ఆరోపణలు వస్తున్న ఎంపీ పెట్టిన ఓ పోస్టుకు అధికారిణి ఓ సినిమా గురించి చేసిన పోస్టు ఆసక్తిని రేపింది. నయనతార నటించిన నేత్రికన్ సినిమా గురించి ఆమె గమ్మత్తైన ట్వీట్ చేసింది. ఆమె చేసిన ట్వీట్ ప్రకారం.. మూవీ చాలా బాగుంది. కానీ మగ డాక్టర్ ప్రాముఖ్యత గురించి చెప్పిన తీరు చాలా హారిబుల్‌గా ఉంది. ఇలాంటి సందేశాన్ని సినిమా ద్వారా ఇచ్చి సభ్య సమాజానికి ఏం చెప్పాలని అనుకొంటున్నారు? అని ట్వీట్‌లో ప్రశ్నించారు.

Women Officer Tweet on Nayanatara s Netrikann movie goes Viral amid allegation of Illegal Relation with Rajya Sabha MP

నేత్రికన్ సినిమాలో నాకు అర్ధం కాని విషయం ఒకటి ఉంది. మగ డాక్టర్ గురించి చెప్పిన విధానం.. గర్బవతులకు బాధించేలా చేస్తుంది. మగ డాక్టర్లపై విశ్వాసం పోయేలా చేస్తుంది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే అని సదరు మహిళా అధికారిణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమాను నయనతార భర్త విఘ్నేష్ నిర్మించగా, మిలింద్ రావు దర్శకత్వం వహించారు. తమిళ, తెలుగు భాషల్లో రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది.

అయితే ఏపీలో కీలక రాజకీయ నేతపై ఆరోపణలు వచ్చిన క్రమంలో సదరు మహిళా అధికారిణి తన ట్విట్టర్ అకౌంట్‌ను ప్రైవేట్ మోడ్‌లోకి మార్చింది. గతంలో చేసిన ట్వీట్లను ఎవరికి కనిపించకుండా జాగ్రత్త పడింది. కానీ ఆ ట్వీట్లను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఎంపీకి మహిళా అధికారిణికి అక్రమ సంబంధం ఉందా? లేదా అనేది పక్కన పడితే.. ఆమె చేసిన ట్వీట్ మాత్రం వైరల్ అవుతున్నది.

ఆరోపణలు, రూమర్లపై బాధితురాలు శాంతి వివరణ:

అయితే తనపై వస్తున్న రూమర్లు, ఆరోపణలు, అసత్యాలపై మహిళా అధికారి శాంతి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ సస్పెండ్ అయిన ఆమె.. తన భర్త చేసిన ఆరోపణలను ఖండించింది. ఓ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన మహిళగా ఉద్యోగం చేయడానికి వైజాగ్‌లో ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొన్నాను. రాయలసీమకు చెందిన మహిళగా నేను కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకొన్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు.

నా భర్త మదన్ మోహన్‌తో విడాకులు జరిగిపోయాయి. నాకు, నా భర్తకు సంబంధం లేదు. నాకు సుభాష్ అనే వ్యక్తితో రిలేషన్‌షిప్ ఉంది. కానీ నాకు, ఎంపీ విజయసాయిరెడ్డికి ఎలాంటి రిలేషన్ లేదు. ఆయనను ప్రజా ప్రతినిధిగానే గౌరవించాను. నాపై 100 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు రావడం దారుణం. 100 కోట్లు సంపాదించానని వార్తలు రావడంతో 70 కోట్లు ఇవ్వాలని మదన్ మోహన్ డిమాండ్ చేస్తున్నాడు. మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేయడం సరికాదు అని అసిస్టెంట్ కమిషనర్ శాంతి కన్నీరు పెట్టుకొన్నది.

More from Filmibeat

Read more about: nayanatara netrikann ap politics
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X