డిప్యూటీ సీఎం అందుకే అయ్యావా? పవన్ కళ్యాణ్‌పై రోజా ఘాటు వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి- వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం తారాస్థాయిలో నడుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను టార్గెట్ చేస్తూ వాడి వేడి విమర్శలు చేస్తున్నారు విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. తాజాగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఈ వివరాల్లోకి వెళితే..
ప్రశాంతి రెడ్డిపై వ్యాఖ్యల్ని ఖండించిన పవన్
టీడీపీ నేత, నెల్లూరు జిల్లా కొవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. పార్టీలకు అతీతంగా ఈ వ్యాఖ్యలను నేతలు ఖండించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వివాదంపై స్పందిస్తూ.. మహిళలపై అభ్యంతకరమైన భాషను ఉపయోగించడం వైసీపీ నేతలకు అలవాటేనని దుయ్యబట్టారు. మహిళా ఎమ్మెల్యేకే ఇలాంటి పరిస్ధితి ఎదురైతే.. సామాన్య మహిళల పరిస్ధితి ఏంటని పవన్ ప్రశ్నించారు. మహిళ గౌరవానికి భంగం వాటిల్లేలా మాట్లాడితే రాష్ట్ర ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

సినిమాలకు దూరమైన పవన్
ఇదిలాఉండగా .. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. జనసేన అధినేత రాజకీయాలతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పాలనతో తలమునకలై ఉన్నారు. అయితే రాజకీయాల్లో పూర్తి స్థాయిలో బిజీ అయ్యే నాటికి పవన్ పలు సినిమాలకు కమిట్ అయి ఉండటంతో పాటు కొన్ని సినిమాల షూటింగ్స్ కూడా మొదలుపెట్టేశారు. అవి హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ లేకపోవడంతో ఆయా సినిమాల షూటింగ్స్ నత్తనడకన సాగుతూ విడుదల ఆలస్యమయ్యాయి.
షూటింగ్స్‌లో పాల్గొంటున్న పవన్
ఈ మూడు సినిమాలను వేగంగా పూర్తి చేసి నిర్మాతలకు ఒత్తిడి తగ్గించాలని భావించారు. అయితే ఉప ముఖ్యమంత్రిగా పాలనపై గ్రిప్ రాకుండానే మేకప్ వేసుకుని ప్రతిపక్షాలకి విమర్శలు చేసే అవకాశం ఇవ్వకూడదని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. పరిస్ధితులు అనుకూలంగా మారిన తర్వాత హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసి జూలై 24న రిలీజ్‌కు సిద్ధం చేశారు. ఆ వెంటనే సుజిత్ దర్శకత్వంలో ఓజీని కూడా పూర్తి చేశారు. ఇదే ఊపులో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్.
సినిమా డైలాగులు వద్దు
పవన్ కళ్యాణ్ పాలనను వదిలేసి తరచుగా సినిమా షూటింగ్స్, డబ్బింగ్ అంటూ తిరగడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. కూటమి నేతలు అహంకారపూరితంగా ప్రెస్‌మీట్లు పెట్టి జగన్ గారినో, మమ్మల్ని తిడితే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని కొట్టే రోజు దగ్గరిలోనే ఉంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా సూటిగా చెబుతున్నా.. తొక్కిపట్టి నారదీస్తానని ఏదో పెద్ద డైలాగ్ చెప్పాడు. సినిమా డైలాగులు చెప్పకూడదని చెప్పిన వ్యక్తికి ఈ విషయం గుర్తులేదా' అని రోజా ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎం అయ్యింది షూటింగ్‌ల కోసమా
'ఈయన ఎలక్షన్ ముందు ఊగిపోయి చెప్పిన సినిమా డైలాగులు ఏంటీ? ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనిషి కనిపించకుండా షూటింగ్లు, డబ్బింగ్‌లు చేసుకుంటూ తిరగడం ఏంటీ. ఒక పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రజల కోసమా? షూటింగ్‌లు చేసుకోవడానికా డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చింది. సుగాలి ప్రీతి కేసు గురించి మీరు మాట్లాడి ఈరోజు అధికారంలోకి వచ్చాక కనీసం ఆమె తల్లికి అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా తిరుగుతున్నది అందరూ చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా తాట తీస్తానని అన్నావ్ కానీ ఇంతమందిపై అత్యాచారాలు జరుగుతున్నా నోరెత్తడం లేదని' రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











