Skanda Business: రామ్ మూవీకి రికార్డు బిజినెస్.. అన్ని కోట్లతో టాప్ 5లోకి.. అంత వసూలు చేస్తేనే హిట్
సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి హీరోగా వచ్చినా.. ఆరంభంలోనే యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు రామ్ పోతినేని. ఆరంభంలోనే ఎన్నో హిట్లను అందుకున్న అతడు.. మధ్యలో కాస్త ఇబ్బంది పడ్డాడు.
తర్వాత మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కి సత్తా చాటాడు. కానీ, గత చిత్రంతో నిరాశ పరిచిన రామ్.. ఇప్పుడు 'స్కంద' అనే మూవీతో వచ్చేశాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ఎంతకు అమ్ముడుపోయాయి? ఎన్ని కోట్లు వసూలు చేస్తే ఇది హిట్ అవుతుంది? చూద్దాం పదండి!

స్కందగా ఎంట్రీ ఇచ్చిన రామ్: బోయపాటి శ్రీను - రామ్ పోతినేని కాంబోలో రూపొందిన చిత్రమే 'స్కంద'. దీన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందించాడు. దీన్ని తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో కూడా రిలీజ్ చేశారు.

అలాంటి కథతోనే వస్తుంది: 'స్కంద' మూవీ ప్యూర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికితోడు ఇందులో కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా యాడ్ చేశారు. ముఖ్యంగా బోయపాటి మార్క్ సన్నివేశాలతో ఈ సినిమాను రూపొందించారు. దీంతో ఆరంభం నుంచే ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని హై రేంజ్‌లో తెరకెక్కించారు.

గ్రాండ్ రిలీజ్... సందడిగా: క్రేజీ కాంబోలో రూపొందిన 'స్కంద' మూవీని ఈరోజే ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ సహా ఎన్నో ప్రాంతాల్లో ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే దీనికి రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభిస్తోంది. దీంతో రామ్ కెరీర్‌లోనే ఈ సినిమాను అత్యధిక ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హక్కులకు భారీ డిమాండ్: ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'స్కంద' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ దక్కుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని చెప్పాలి.

ఏపీ, తెలంగాణలో బిజినెస్: 'ది వారియర్' డిజాస్టర్ అయినా రామ్ హీరోగా నటించిన 'స్కంద' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో అతడి కెరీర్‌లోనే రికార్డు బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 13 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 19.50 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 41 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: రామ్ పోతినేని - శ్రీలీల జంటగా నటించిన 'స్కంద' మూవీకి దేశ వ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ వచ్చింది. దీంతో ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.20 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.20 కోట్లు వ్యాపారం జరిగింది. అంటే రూ. 57 కోట్లు వస్తేనే ఈ సినిమా హిట్ అవుతుంది.

రామ్ రికార్డు.. నాలుగో ప్లేస్: 'స్కంద' మూవీకి వరల్డ్ వైడ్‌గా రూ. 46.20 కోట్లు బిజినెస్ అవడంతో రామ్ పోతినేని కెరీర్‌లోనే అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన చిత్రంగా ఇది రికార్డు సాధించింది. ఈ క్రమంలోనే 'ది వారియర్' రూ. 38.10 కోట్లు దాటేసింది. ఇక మీడియం రేంజ్ చిత్రాల్లో లైగర్, ఖుషి, దసరా తర్వాత అత్యధిక బిజినెస్ చేసుకున్న సినిమాగానూ రికార్డును నమోదు చేసుకుంది.


Click it and Unblock the Notifications











