105 minuttess Review సింగిల్ ఆర్టిస్ట్.. సింగిల్ టేక్.. హన్సిక పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?
నటీనటులు: హన్సిక మోత్వానీ
దర్శకత్వం: రాజు దుస్సా
నిర్మాత: బొమ్మక శివ
సినిమాటోగ్రాఫర్: కిషోర్ బీ
మ్యూజిక్: సామ్ సీఎస్
రిలీజ్ డేట్: 26-01-2024
ఇక 105 మినిట్స్ అనే సినిమా ప్రయోగాత్మక చిత్రం. సింగిల్ క్యారెక్టర్, సింగిల్ టేక్ కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కించారు. ఈ పాయింట్ చాలా కొత్తగా అనిపించడం, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేపడంతో అంచనాలు పెరిగాయి. హన్సిక కూడా ఈ సినిమాకు ఆకర్షణగా మారడంతో సినీ ప్రేమికులకు చూడాలనే ఆసక్తి పెరిగిందనే చెప్పాలి.

జాను (హన్సిక మోత్వానీ)ని ఓ ఇంటిలో బంధిస్తారు. అయితే అక్కడి నుంచి జాను బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తుంటుంది. ఆ ప్రయత్నాలను అక్కడ కొందరు పురుషులు అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తూ.. ఆమెను చిత్ర హింసలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తారు.
జానును ఎందుకు బంధించారు? జానును బంధించడానికి కారణం ఏమిటి? జానును కొందరు ఎలా టార్గెట్ చేశారు? అగంతకుల నుంచి జాను తప్పించుకోవడానికి ప్రయత్నాలు ఎలా చేసింది. చివరకు ఆమె తప్పించుకొన్నదా? జాను ప్రయత్నాలు ఫలించాయా? చివరకు జాను జీవితానికి ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే 105 మినిట్స్ సినిమా కథ.
అడవిలో జాను కారు డ్రైవ్ చేసుకొంటూ వెళ్లే ఓ సీన్‌తో కథ ఇంట్రెస్టింగ్‌గానే మొదలవుతుంది. దర్శకుడు ఏదో కొత్త పాయింట్‌తో కథను చెప్పబోతున్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ స్టోరి, స్క్రీన్ ప్లేలో వేరియేషన్స్ లేకపోవడం వల్ల రెగ్యులర్ సస్పెన్స్ చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ హన్సిక ఫెర్ఫార్మెన్స్‌తో కొన్ని సీన్లు కట్టిపడేలా చేస్తాయి. ఓ ఇంటి నుంచి తప్పించుకొనే క్రమంలో సీన్లు మరింత కొత్తగా రాసుకోవాల్సి ఉందనే ఫీలింగ్ కలుగుతుంది.

సినిమాలో హన్సిక ఒక్క క్యారెక్టర్ ఉండటంతో సినిమా భారాన్నంత ఆమెనే మోసిందనే చెప్పాలి. సింగిల్ టేక్ కావడంతో సింగిల్ ఎమోషన్ మీదనే సినిమా మొత్తం సాగింది. అయితే సింగిల్ ఎమోషన్‌తోనే హన్సిక మెప్పించే ప్రయత్నం చేసింది. కథలో పాయింట్ వల్ల ఆమె ఫెర్ఫార్మెన్స్ పరిమితి ఏర్పడిందని చెప్పవచ్చు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ సినిమాకు మంచి సపోర్ట్‌గా మారాయి. సస్పెన్స్, థ్రిల్లర్‌గా మారే ఈ సినిమాకు సామ్ సీఎస్ మ్యూజిక్ బాగుంది. రీరికార్డింగ్ చాలా సీన్లను ఎలివేట్ చేశారని చెప్పవచ్చు. కిషోర్ బోయిడపు సినిమాటోగ్రఫి బాగుంది. లైటింగ్, కలర్ ప్యాటర్న్ సినిమాకు మంచి ఫీల్ కలిగించేలా ఉన్నాయి. నిర్మాత బొమ్మక శివ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
105 మినిట్స్ మూవీ విషయానికి వస్తే.. ఒకే ఒక క్యారెక్టర్ చుట్టూ కొన్ని ఎమోషన్స్‌తో అల్లుకొన్న కథ. ఈ పూర్తిగా ప్రయోగమనే చెప్పాలి. ఈ ప్రయోగంలో కథ, కథనాలు రెగ్యులర్‌గా, రొటీన్‌గా అనిపిస్తాయి. ప్రేక్షకుడిని టచ్ చేసే అంశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఓ పరిమితి క్షేత్రంలో సాగే సినిమా కాబట్టి.. పెద్దగా ఎలివేట్ చేయలేకపోయారనిపిస్తుంది. కానీ ఈ సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ వ్యాల్యూస్ సూపర్బ్‌గా ఉన్నాయి. హన్సిక తన పాత్ర పరిధి మేరకు న్యాయం చేసే ప్రయత్నం చేసింది. ఎక్కువగా ఆశించకుండా ఓ ఎక్స్‌పెరిమెంట్ సినిమా చూడాలనే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











