twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    118 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.5/5
    Star Cast: కల్యాణ్ రామ్, నివేదా థామస్, షాలిని పాండే, నాజర్, రాజీవ్ కనకాల
    Director: కేవీ గుహన్

    విభిన్నమైన కథలతో ప్రయోగాలు చేసే హీరోల్లో నందమూరి కల్యాణ్ రామ్ ముందుంటారు. అతనొక్కడే, పటాస్, ఓం 3డీ, హరేరాం చిత్రాలు ఆయన అభిరుచికి అద్దం పట్టాయి. అటు క్లాస్, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకొంటూ కెరీర్‌పరంగా దూసుకుపోతున్నాడు కల్యాణ్ రామ్. తాజాగా మరో ప్రయోగాత్మక చిత్రం 118తో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మ‌హేష్ ఎస్‌.కోనేరు నిర్మాతగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహ‌న్ ర‌చించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించి, కెమెరాను హ్యాండిల్ చేస్తున్న చిత్రంలో నివేదా థామస్, షాలిని పాండే‌తో జతకట్టారు. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కల్యాణ్ రామ్‌కు విజయాన్ని అందించిందా? కేవీ గుహన్‌ను దర్శకుడిగా నిలబెట్టిందా? నివేదా థామస్‌తో నటనతో మరోసారి మ్యాజిక్ చేసిందా? షాలిని పాండే గ్లామర్‌తో ఆకట్టుకొన్నాదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

     118 మూవీ కథ

    118 మూవీ కథ

    గౌతమ్ (కల్యాణ్ రామ్) ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టు. అన్యాయాలను, అక్రమాలను ధీటుగా ఎదిరిస్తుంటాడు. మేఘా (షాలిని పాండే)ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ క్రమంలో ప్రతీ పౌర్ణమి రోజున ఆద్య (నివేదా థామస్) అనే అమ్మాయి దాడికి గురైనట్టు కల వస్తుంటుంది. కలలో కనిపించిన అమ్మాయి ఉన్న ప్రాంతాలు గౌతమ్‌కు తారసపడుతాయి. దాంతో ఆద్య కోసం వెతుకులాట మొదలుపెడుతాడు. ఆ సర్చింగ్‌లో భయంకర నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి.

     118 మూవీలో ట్విస్టులు

    118 మూవీలో ట్విస్టులు

    గౌతమ్‌కు ఆద్య తారసపడిందా? ఒకవేళ కలిస్తే ఆద్యను గౌతమ్ ఎలా కలిసుకొన్నాడు? ఆద్య మీద ఎందుకు దాడి జరిగింది? ఆద్య కోసం వెతికే క్రమంలో కలిసే ప్రతీ వ్యక్తి ఎందుకు మృత్యువాత పడుతారు? చివరికి ఆద్యకు జరిగిన అన్యాయం ఏంటి? ఓ భయంకరమైన విషయాన్ని ఆద్య ఎలా బయటపెట్టింది. గౌతమ్‌తో కలిసి ఆద్య మెడికల్ మాఫియా ముఠాను ఆటకట్టించింది అనే ప్రశ్నలకు సమాధానమే 118 మూవీ కథ.

     ఫస్టాఫ్‌ అనాలిసిస్

    ఫస్టాఫ్‌ అనాలిసిస్

    జర్నలిస్టుగా గౌతమ్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి ఓ చిన్న ఎపిసోడ్‌ను రన్ చేసి నేరుగా కథను ట్రాక్ ఎక్కించే ప్రయత్నం జరుగుతుంది. ఒక ఆద్యకు సంబంధించిన క్లూస్‌ ఆధారంగా గౌతమ్‌ ఆమెను వెతికి పట్టుకోవడానికి ప్రయత్నం చాలా సాగదీసినట్టు సాగిపోతుంటుంది. తొలిభాగంలో కథనం బలహీనంగా ఉండటం, బలమైన సన్నివేశాలు లేకపోవడం కొంత అసంతృప్తిగా అనిపిస్తుంది. ఇంటర్వెట్ బ్యాంగ్‌లో ఆద్య గురించి ఓ చిన్న ట్విస్ట్ ఇవ్వడంతో తొలిభాగం ఎలాంటి భావోద్వేగం లేకుండానే ముగిస్తుంది.

     సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    సినిమా రెండో భాగంలో కథలో చలనం కలుగుతుంది. సెకండాఫ్‌లో దాదాపు సగం పూర్తయ్యే సమయానికి ఆద్య ( నివేదా థామస్) పాత్ర పూర్తిస్తాయిలో తెరపైకి రావడంతో జోష్ పెరుగుతుంది. కాకపోతే ఆద్యపై చిత్రీకరించిన కొన్ని సీన్లు చాలా ఎమోషనల్‌గా గురిచేస్తాయి. ప్రీ క్లైమాక్స్‌ నుంచి కథలో క్లినికల్ ట్రయల్, డ్రగ్ ట్రయల్ అనే సమస్య బయటకు వస్తుంది. ఇక వ్యాపార, ధనార్జన కోసం అలాంట అనే ఫార్మాస్టూటికల్ కంపెనీ చేసే అకృత్యాలు ఆలోచింపజేస్తాయి. డబ్బు కోసం చిన్నారుల జీవితాలను పణంగా పెట్టే వికృత క్రీడ కథలో ఎట్రాక్షన్ కనిపిస్తుంది. కానీ ఆ పాయింట్‌ను బలంగా చెప్పలేకపోవడం ఈ సినిమాలో ప్రధానమైన లోపంగా మారిందని చెప్పవచ్చు.

     కేవీ గుహన్ డైరెక్షన్

    కేవీ గుహన్ డైరెక్షన్

    సినిమాటోగ్రాఫర్‌గా సుపరిచితులైన కేవీ గుహన్ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేసే, భావోద్వేగానికి గురిచేసే పాయింట్‌తో కథను రాసుకోవడం ఆయన అభిరుచికి అద్దం పట్టింది. కాకపోతే బలంగా కథను చెప్పడంలో, కథనాన్ని వేగవంతం చేయడంలో తడబాటుకు గురయ్యారనే చెప్పవచ్చు. టాక్సీవాలా, ఇన్సెప్షన్ సినిమాల ప్రభావం కొంత కనిపిస్తుంది. కాకపోతే క్లైమాక్స్ ఆ సినిమాలకు ప్రాణంగా నిలిచాయి. కానీ కథను అంతర్లీనంగా వినోదాత్మకంగా చెప్పగలిగి ఉంటే అంతగా అసంతృప్తి కనిపించి కాదేమో. దర్శకుడిగా గుహన్ పాస్ మార్కులతో బయటపడ్డాడనే ఫీలింగ్ కలుగుతుంది.

     కల్యాణ్ రామ్ ఫెర్ఫార్మెన్స్

    కల్యాణ్ రామ్ ఫెర్ఫార్మెన్స్

    వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన కథల కోసం పరితపించే కల్యాణ్ రామ్ మరోసారి తన టేస్ట్‌ను ఈ సినిమా ద్వారా చాటుకొన్నాడు. గౌతమ్ పాత్రలో ఒదిగిపోయాడు. సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్ల కల్యాణ్ రామ్ తన పాత్ర పరిధి మేరకే పరిమితమయ్యాడని చెప్పవచ్చు. షాలిని పాండేతో రొమాంటిక్ సీన్లలో ఆకట్టుకొన్నాడు. కొన్ని కీలక సన్నివేశాలల్లో ఎనర్జీటిక్‌గా కనిపించాడు. కల్యాణ్ రామ్‌కు కెరీర్ పరంగా ఓ మంచి పాత్రలో కనిపించాడని చెప్పవచ్చు.

     నివేదా థామస్ యాక్టింగ్

    నివేదా థామస్ యాక్టింగ్

    118 సినిమాకు వెన్నుముక నివేదా థామస్ ఎపిసోడ్. మిగితా చిత్రమంత ఏదో ఒకలా సాగిపోతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆద్య పాత్ర ఎంటరై సినిమాను మరో మెట్టెక్కించే ప్రయత్నం చేసింది. కొన్ని సన్నివేశాల్లో నివేదా నటన హ్యాట్సాఫ్ అనే విధంగా ఉంటుంది. పాత్ర నిడివి ఎంత అనే విషయాన్ని పట్టింకోకుండా తన పాత్రను సినిమాకు ప్రాణంగా మలిచేలా చేసుకొన్నది. ఈ సినిమాకు బలం నివేదా థామస్ అని చెప్పవచ్చు.

    షాలిని పాండే గ్లామర్

    షాలిని పాండే గ్లామర్

    ఇక ఈ చిత్రంలో షాలిని పాండే పాత్ర కేవలం సపోర్టింగ్ క్యారెక్టర్‌గానే కనిపిస్తుంది. గ్లామర్‌ను కథలో కనిపించేలా చేయడానికి షాలిని పాత్రను జొప్పించినట్టు కనిపిస్తుంది. ఈ చిత్రంలో షాలిని పాత్రకు పెద్దగా ప్రాధాన్యత కనిపించదు. కల్యాణ్ రామ్‌తో కొన్ని సన్నివేశాల్లో ట్రావెల్ అవుతూ కనిపిస్తుంటుంది. కాకపోతే అందంతో ప్రేక్షకుడిని మెప్పిస్తుంది.

     ఇతర నటీనటులు

    ఇతర నటీనటులు

    118 చిత్రంలో ప్రభాస్ శ్రీను, చమ్మక్ చంద్ర పాత్రలు కామెడీ కోసం పెట్టినట్టు కనిపిస్తాయి. కాకపోతే మెయిన్ ట్రాక్ డామినేట్ చేయడం వల్ల పూర్తిస్తాయి కామెడీ పండలేదనే ఫీలింగ్ కనిపిస్తుంది. ఇక రాజశేఖర్ అనిగి పాత్రకు కొంత ఇంపార్టెంట్ కనిపిస్తుంది. రాజీవ్ కనకాల, సురేఖ వాణి పాత్రలు అలా వచ్చిపోతాయి. ఒకెట్రెండు సీన్లలో కనిపించిన సురేఖ వాణి .. కూతురు మరణించిన సీన్లో తనపాత్రకు న్యాయం చేసింది.

     సాగర్ చంద్ర మ్యూజిక్

    సాగర్ చంద్ర మ్యూజిక్

    సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే చిత్రానికి ఎంత అవసరమవుతుందో అంతే మొత్తంలో రీరికార్డింగ్‌తో ఆకట్టుకొన్నాడు. సినిమాకు చందమామ పాట ఒకేటే రిలీఫ్. సెకండాఫ్‌లో తనకు లభించిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సాగర్ చంద్ర వినియోగించుకొన్నాడు. ఎమోషన్స్ సీన్లు, యాక్షన్ సీన్లను తన బీజీఎంతో ఎలివేట్ చేశాడని చెప్పవచ్చు.

    ఇతర సాంకేతిక విభాగాల పనితీరు

    ఇతర సాంకేతిక విభాగాల పనితీరు

    స్వయంగా కేవీ గుహన్ సినిమాటోగ్రాఫిని అందించాడు. ప్రతీ ఫ్రేమును అందంగా తీర్చిదిద్దాడు. ఆర్ట్ విభాగం పనితీరును చక్కగా కెమెరాలో ఒడిసిపట్టుకొన్నాడు. బ్యాక్ గ్రౌండ్ ఆంబియెన్స్ బాగుంది. రకరకాల ప్రదేశాల్లో చేసిన సీన్లు సినిమాలో ఆహ్లాదకరంగా బాగున్నాయి. ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్ ఉంది. టెక్నికల్ పరంగా అన్ని విభాగాల పనితీరు సూపర్బ్‌గా ఉంది. గ్రాఫిక్స్ వర్క్ కొంత నాసిరకంగా ఉంది.

    నిర్మాణ విలువలు

    నిర్మాణ విలువలు

    ఈస్ట్ కోస్ట్ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని మహేస్ ఎస్ కోనేరు నిర్మించాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. నటీనటులు, సాంకేతిక విభాగాల ఎంపిక చాలా బాగుంది. కథ, కథనాలపై, పాత్రల రూపకల్పనపై మరింత దృష్టిపెడితే ఇంకా బెటర్‌గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉండేది. రొటీన్ సినిమాలు కాకుండా ఆలోచింప జేసే చిత్రాలను రూపొందించే మహేష్ కోనేరు అభిరుచికి సినిమా అద్దం పట్టింది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    డ్రగ్, క్లినికల్ ట్రయల్స్ వల్ల కలిగే దుష్ఫరిమాణాలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన చిత్రం 118. ఎమోషనల్‌‌గా కథను డీల్ చేయలేకపోవడం, సాగదీతగా, స్లోగా చెప్పడం సినిమాకు మైనస్. సస్సెన్స్, థ్రిల్లర్ సినిమాలో కనిపించే వేగం లేకపోవడం మరో మైనస్. మల్టీప్లెక్స్ ఆడియెన్స్ వదిలేస్తే.. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకో గలగడంపైనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్

    • నివేదా థామస్ పెర్ఫార్మెన్స్
    • కల్యాణ్ రామ్ యాక్టింగ్
    • సినిమాటోగ్రఫి, రీరికార్డింగ్
    • ప్రొడక్షన్ వ్యాల్యూస్
    • మైనస్ పాయింట్స్

      • బలమైన కథ లేకపోవడం
      • కథనం బలహీనంగా ఉండటం
      • స్లో నేరేషన్
      • తెర ముందు, తెర వెనుక

        తెర ముందు, తెర వెనుక

        నటీనటులు: కల్యాణ్ రామ్, నివేదా థామస్, షాలిని పాండే, రాజశేఖర్ అనిగి, మహేష్, నాజర్, రాజీవ్ కనకాల, ప్రభాస్ శ్రీను తదితరులు
        సినిమాటోగ్రఫి, స్క్రీన్ ప్లే, రచన, దర్శకత్వం: కేవీ గుహన్
        నిర్మాత: మహేష్ కోనేరు
        సంగీతం: శేఖర్ చంద్ర
        ఎడిటింగ్: తమ్మిరాజు
        ప్రొడక్షన్: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్
        రిలీజ్ డేట్: 2019-03-01

    English summary
    Nandamoori Kalyan Ram, Shalini Pandey latest movie is 118 movie. Cinematographer KV Guhan turns as director. Film Critic Mahesh S Koneru is producer. This movie set to release on March 1st. In this occassion, filmibeat brings pre release review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X