12A Railway Colony Movie Review: 12A రైల్వే కాలనీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
1.5/5

మూవీ: 12A రైల్వే కాలనీ
నటీనటులు: అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, అనీష్ కురువిల్ల, అభిరామి తదితరులు
ఎడిటింగ్, దర్శకత్వం: నాని కాసరగడ్డ
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: డాక్టర్ అనిల్ విశ్వనాథ్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
సమర్పణ: పవన్ కుమార్
మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫి: కుషేందర్ రమేష్ రెడ్డి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
రిలీజ్ డేట్: 2025-11-21

వరంగల్‌లోని రైల్వే కాలనీలో నివసించే అనాథ కార్తీక్ (అల్లరి నరేష్) తన స్నేహితులతో సరదాగా జీవితాన్ని గడపుతుంటాడు. తన పక్కింట్లో ఉండే ఆరాధన (కామాక్షి భాస్కర్ల)ను అమితంగా ప్రేమిస్తుంటాడు. అలాగే లోకల్ రౌడీ, పొలిటిషియన్ టిల్లు (జీవన్ కుమార్) కోసం పనిచేస్తుంటాడు. ఉప ఎన్నికల్లో టిల్లూ పోటీ చేస్తున్న నేపథ్యంలో అతడి తమ్ముడు హత్యకు గురవుతాడు. అలాగే తాను ప్రేమించే ఆరాధన, ఆమె తల్లి అనూహ్యంగా మర్డర్ అవుతారు.

12A Railway Colony Movie Review

అనాథగా కార్తీక్ జీవితం ఎలా సాగింది? కార్తీక్ ప్రేమను ఆరాధన ఎందుకు నిరాకరించింది? టిల్లూ సోదరుడు ఎలా హత్యకు గురయ్యాడు? ఆరాధన, ఆమె తల్లి ఎలా మర్డర్‌‌కు గురయ్యారు? టిల్లూ సోదరుడు, ఆరాధన, ఆమె తల్లి హత్యల వెనుక కారణం ఎవరు? తన ప్రియురాలి మరణం తర్వాత కార్తీక్ పరిస్థితి ఏమిటి? డాక్టర్ (అనీష్ కురువిల్లా)కు ఆరాధనకు మధ్య ఉన్న బంధం ఏమిటి? డాక్టర్ భార్య (అభిరామి) పాత్ర ఏమిటి? చివరకు కార్తీక్ లైఫ్ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే 12A రైల్వే కాలనీ సినిమా కథ.

12A రైల్వే కాలనీ మూవీ కథ విషయానికి వస్తే.. మెడికల్ బ్యాక్ డ్రాప్‌తో సాగే రెగ్యులర్ యాక్షన్, లవ్ స్టోరి. ఈ కథలో కొత్తదనం ఎక్కడా కనిపించదు. ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా పాటలు, నాసిరకరమైన సీన్లతో సాగుతుంది. సినిమా ఆరంభంలోనే సీన్లను చూస్తే.. కంటెంట్ ఉన్న సినిమాగా కనిపించదు. ఇలా పేలవంగా సాగుతున్న సినిమాలో ఇంటర్వెల్‌లో అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై ఆశలు పెంచే ప్రయత్నం కనిపిస్తుంది. అయితే సెకండాఫ్ మొదలైన తర్వాత అదే సాగదీత.. క్లారిటీ లేని కథ, కథనంతో సహనానికి పరీక్షగానే ఉంటుంది. ఇక అప్పటికే ఓపికకు పరీక్షించిన దర్శకుడు చివరి 20 నిమిషాల్లో కథ చెప్పడం మొదలుపెడుతారు. అందులో కూడా అసలు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండవు. సినిమా ముగుస్తుందనే సమయంలో కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇచ్చి షాకిస్తుంటాయి. ఓవరాల్‌గా రెగ్యులర్ మర్డర్ మిస్టరీగా ముగుస్తుంది.

కామెడీ జోనర్ నుంచి పక్కకు వచ్చిన అల్లరి నరేష్ వైవిధ్యమైన కథలు, విభిన్న పాత్రల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన నటించిన ఇటీవల చిత్రాలు చెప్పకనే చెప్పాయి. కానీ ఈ సినిమా విషయంలో ఆయన జడ్జ్‌మెంట్ మరోసారి మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఆయన ఇమేజ్‌కు దూరంగా చేసిన ప్రయోగంలా కార్తీక్ పాత్ర ఉంటుంది. ఆయన అభిమానులు పూర్తిగా నిరాశపడే విధంగా ఉంటుంది. అయినా తన వంతుగా కార్తీక్ పాత్రను సగటు ఆడియెన్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కామాక్షి భాస్కర్ల మరోసారి బెటర్‌గా పెర్ఫార్మ్ చేసింది. జీవన్ కుమార్, అనీష్, అభిరామి ఒకే అనిపించారు. మిగితా పాత్రల్లో నటించిన వారాంతా ఒకే అనిపించారు.

సాంకేతిక అంశాలు విషయానికి వస్తే.. కథ బలంగా లేకపోవడం వల్ల టెక్నిషియన్స్ కూడా ఏమీ చేయలేకపోయారనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫి, ఎడిటర్ నాని ఎఫర్ట్ సరైన ఫలితాన్ని అందించలేకపోయాయి. భీమ్స్ అందించిన పాటలు అంతగా కిక్ ఇవ్వలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలను భారీగా ఎలివేట్ చేశాయి. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా అనుసరించిన నిర్మాణ విలువలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

ఓవరాల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే.. తెలంగాణ నేపథ్యంగా సాగే కథ ఇది. వరంగల్ సిటీ బ్యాక్ డ్రాప్‌తో పాత్రలు బిహేవ్ చేస్తుంటాయి. కానీ ఆర్టిస్టులు చేత మాట్లాడించిన తెలంగాణ యాస చాలా దారుణంగా ఉంది. యాస విషయంలో టోటల్‌గా ఫెయిల్ అయ్యారు. కనీసం స్వచ్చమైన తెలుగు భాషలో ఆర్టిస్టులతో డైలాగ్స్ చెప్పించి ఉంటే బెటర్ కనెక్టివిటీ ఉండేదేమో. యాస, భాష విషయంలో టీమ్ పూర్తిగా విఫలమైంది. ఇక అల్లరి నరేష్ కథ ఎంపికలో వైవిధ్యం చూపడంలో తప్పేమీ లేదు. కానీ ఇలాంటి పేలవమైన సబ్జెక్ట్‌లకు దూరంగా ఉంటే మంచిది. చివరగా మర్డర్ మిస్టరీలను చూడాలని ఆసక్తి ఉండే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది. రెగ్యులర్, రొటీన్ సినిమా.. అంచనాలు లేకుండా వెళితే.. కొంతలో కొంతైనా నరేష్ ఫ్యాన్స్‌కు మాత్రమే సంతృప్తి మిగులుతుందేమో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X