12th Fail Review మీ లక్ష్యం IAS/IPS ఉద్యోగమా? మోస్ట్ ఇన్సిపిరేషనల్ మూవీ..12th ఫెయిల్ సమీక్ష

Rating:
3.5/5

నటీనటులు: విక్రాంత్ మెస్సీ, మేధా శంకర్, అనంత్ వీ జోషి, ప్రియాంశు చట్టర్జీ తదితరులు
రచన, నిర్మాత, దర్శకత్వం: విధూ వినోద్ చోప్రా, యోగేశ్ ఈశ్వర్
సినిమాటోగ్రఫి: రంగరాజన్ రామబద్రన్
ఎడిటింగ్: జస్‌కున్వర్ కోహ్లీ, విధూ వినోద్ చోప్రా
మ్యూజిక్: శంతను మోయిత్రా
బ్యానర్: విధూ చోప్రా ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2023-11-03

మధ్యప్రదేశ్‌లోని బందిపోట్లకు నిలయమైన చంబల్ లోయకు చెందిన మనోజ్ కుమార్ శర్మ (విక్రాంత్ మెస్సీ) పేద కుటుంబానికి చెందిన విద్యార్థి. మనోజ్ తండ్రి నీతి, నిజాయితీకి కట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగి. మనోజ్ తండ్రి ఉద్యోగం నుంచి సస్పెండ్ కావడంతో ఫ్యామిలీ కష్టాల్లో పడుతుంది. ఆ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం శిక్షణ పొందేందుకు గ్వాలియర్ వెళ్లిన మనోజ్ అనుకొని పరిస్థితుల కారణంగా ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో ఢిల్లీకి చేరుకొంటాడు.

12th-Fail-Review

మనోజ్ తండ్రిని ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఎందుకు సస్పెండ్ అయ్యాడు? గ్వాలియర్‌కు వెళ్లిన మనోజ్‌కు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? గ్వాలియర్ నుంచి ఢిల్లీకి ఎలా వెళ్లగలిగాడు? యూపీఎస్సీలో ఐపీఎస్ పరీక్ష రాయాలనే ఆలోచనను మనోజ్‌కు ఎవరు కల్పించారు. ఢిల్లీకి వెళ్లిన మనోజ్ హోటల్, పిండిగిర్నీలో ఎందుకు పనిచేశాడు? ఢిల్లీలో పరిచయమైన శ్రద్దా జోషి (మేధా శంకర్)తో ఎలా మనోజ్ ప్రేమలో పడ్డాడు? చివరకు మనోజ్ ఐపీఎస్ లక్ష్యాన్ని చేరుకొన్నాడా? శ్రద్దా ప్రేమకు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే 12th Fail సినిమా కథ.

చంబల్ లోయలో ఓ కుగ్రామంలోని పరిస్థితుల, అక్కడి విద్యా వ్యవస్థ తీరు తెన్నులను తెరమీద ఆవిష్కరిస్తూ కథను ఎమోషనల్‌గా మొదలుపెట్టాడు దర్శకుడు విధూ వినోద్ చోప్రా. ఇక తండ్రి నిజాయితీ, నిస్వార్ధపూరిత ఆలోచన విధానం తెచ్చి పెట్టిన కష్టాల నడుమ మనోజ్ లైఫ్ స్పూర్తిదాయకంగా సాగుతుంది. ఇక ఢిల్లీలో ఐపీఎస్ పరీక్ష కోసం విద్యార్థుల కష్టాలను భావోద్వేగంగా చూపిస్తూనే.. మనోజ్ కుమార్ శర్మ జీవనపోరాటం హృదయానికి హత్తుకొనేలా కథను ప్రేక్షకుల మనసులోకి దర్శకుడు జొప్పించిన విధానం ఆకట్టుకొనేలా ఉంటుంది.

ఇక సెకండాఫ్‌లో 12th Fail చిత్రంలో సన్నివేశాలు, సంఘటనలు మరింత ఎమోషనల్‌గా మార్చడంలో విధూ వినోద్ చోప్రా మరోసారి తన మార్కును చాటుకొన్నాడు. గతంలో 3 ఇడియెట్ మూవీలో విద్యా వ్యవస్థపై విమర్శనాత్మక బాణాన్ని సంధించిన ఆయన.. ఈ చిత్రంలో గ్రామాల్లోని స్కూల్స్‌లో కాపీ వ్యవస్థను ఎండగట్టాడు. చివరి 30 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు గుండెను పిండేసేలా ఉంటాయి. దాంతో ఈ సినిమా ఓ ఇన్సిపిరేషన్‌గా నిలిచేలా సినిమాగా మార్చడంలో విధూ వినోద్ సఫలమయ్యారు.

ఇక నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. మనోజ్ కుమార్ శర్మగా విక్రాంత్ మెస్సీ తన పాత్రలో జీవించాడు. విక్రాంత్‌గా కంటే మనోజ్‌గానే తన పాత్రలో ఒదిగిపోయాడు. ప్రతీ సన్నివేశానికి విక్రాంత్ తన ఫెర్ఫార్మెన్స్‌తో జీవం పోశాడు. ఇక సెకండాఫ్‌లో శ్రద్దాగా మేధా శంకర్ అద్బుతమైన ప్రతిభను ప్రదర్శించారు. ఇక సుందర్‌గా విజయ్ కుమార్, డీఎస్పీగా ప్రియాంశు చటర్జీ, గౌరీ భయ్యాగా అంశుమాన్ పుష్కర్ తదితరులు ఈ సినిమాకు బలంగా మారారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. విధూ వినోద్ చోప్రా ఆల్‌రౌండ్ ప్రతిభను చాటుకొన్నాడు. దర్శకుడిగా, రచయితగా ఎడిటర్‌గా, నిర్మాతగా వన్ మ్యాన్ ఆర్మీగా కనిపించాడు. అనురాగ్ పాథక్ రాసిన 12th Fail పుస్తకం ఆధారంగా సినిమాను గొప్ప స్పూర్తిని అందించే సినిమాగా మార్చారు. రంగరాజన్ రామబద్రన్ సినిమాటోగ్రఫి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మార్చింది. శంతను మొయిత్రా మ్యూజిక్ సినిమాను ఎమోషనల్‌గా, ఫీల్‌గుడ్‌గా మార్చింది.

12th Fail చిత్రం విద్యా వ్యవస్థ తీరు తెన్నులు, పోటీ పరీక్షల విధానం, ఐపీఎస్, ఐఏఎస్ కావాలనుకొనే ఔత్సాహికులకు స్పూర్తిని అందించే చిత్రంగా రూపొందింది. నటీనటుల ఫెర్ఫార్మెన్స్, విధూ వినోద్ చోప్రా రైటింగ్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్‌తో మరోసారి మ్యాజిక్ చేశారు. ప్రభుత్వ పోటీ పరీక్షలకు, ఇతర కాంపిటీటివ్ పరీక్షలకు హాజరయ్యే వారికి, ప్రస్తుతం తరానికి చెందిన విద్యార్థులకు తప్పకుండా చూపించాల్సిన సినిమా ఇది. తల్లిదండ్రులకు స్పూర్తిని కలిగించే చిత్రంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను థియేటర్‌లో చూస్తే భావోద్వేగాలు రేకెత్తించడంతోపాటు హృదయాన్ని భారంగా మారుస్తుంది. తప్పకుండా చూడాల్సిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజైంది. డొంట్ మిస్ ఇట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X