Don't Miss!
- News
బెంగళూరులో సరికొత్త `సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా`: ముఖ్యమంత్రి ప్రకటన
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
18 Pages movie review క్యూట్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరి.. నిఖిల్, అనుపమ పెర్ఫార్మెన్స్ అదుర్స్
నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్, సరయు, దినేష్ తేజ్, అజయ్, పోసాని కృష్ణమురళి తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పల్నాటి సూర్య ప్రతాప్
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాస్
కథ : సుకుమార్
రచన: శ్రీకాంత్ విస్సా
ఎడిటింగ్: నవీన్ నూలి
సినిమాటోగ్రఫి: వసంత్
మ్యూజిక్: గోపి సుందర్
విడుదల తేదీ: డిసెంబర్ 23, 2022

18 Pages కథ ఏమిటంటే?
సిద్ధూ అలియాస్ సిద్దార్థ్ (నిఖిల్ సిద్దార్థ్) సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్. సోషల్ మీడియా మత్తులో పడిపోయి.. దైనందిక జీవితం విషయంలో గాడి తప్పిన యువకుడు. విలాసవంతమైన జీవితం, ఖరీదైన దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువుల మోజులో పడి మనుషులకు దూరంగా బతుకుతుంటాడు. ఇలాంటి జీవితంలో ఓ అమ్మాయి చీట్ చేయడంతో సిద్దూకు బ్రేకప్ అవుతుంది. ఆ క్రమంలో మద్యానికి బానిసై జీవితాన్ని అస్తవ్యస్థంగా గడుపుతున్న సమయంలో నందిని (అనుపమ పరమేశ్వరన్) అనే అమ్మాయి డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో 18 పేజీల తర్వాత ఖాళీగా ఉండటంతో నందిని కలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. అలా నందిని వెతికేందుకు సిద్దూ బయలుదేరుతాడు.

18 Pages మూవీలో ట్విస్టులు
సిద్దూ జీవితంలో జరిగిన బ్రేకప్ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది. నందిని రాసిన డైరీని చదివిన తర్వాత సిద్దూ జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించాయి? నందిని కోసం ఆమె ఊరికి వెళ్లిని సిద్దూకు తెలిసిన భయంకరనమైన విషయం ఏమిటి? నందిని వద్ద ఉన్న ఓ కవర్‌కు సంబంధించిన ట్విస్టు ఏమిటి? నందిని మరణించిందనే వార్తతో సిద్దూ ఏమైపోయాడు? అసలు నందిని మరణించిందా? నందిని మరణించకపోతే సిద్దూ ఆమెను కలుసుకొన్నాడా? డైరీ చదివిన తర్వాత కలిగిన ప్రేమను నందినికి వ్యక్తపరిచాడా? అనే ప్రశ్నలకు సమాధానమే 18 పేజేస్ సినిమా కథ.

18 Pages ఎలా ఉందంటే?
18 పేజేస్ సినిమా విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో సిద్దూ క్యారెక్టరైజేషన్ గురించి కాస్త సమయం ఎక్కువే తీసుకొన్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ సోషల్ మీడియా వల్ల మానవ సంబంధాలు ఎలా దెబ్బతింటున్నాయనే విషయాన్ని టచ్ చేయడం సినిమాకు ఫీల్‌గుడ్‌గా మారింది. ఫస్టాఫ్ కొంత స్లోగా, సాగదీసినట్టు అనిపిస్తుంది. నేటితరం యువత పోకడలకు సిద్దూ పాత్ర అద్దం పట్టినట్టు ఉంటుంది. మంచి ట్విస్టుతో తొలి భాగం ముగుస్తుంది. సెకండాఫ్‌లో ఎమోషన్స్, నందిని కోసం వెతికే అంశాలు ప్రేక్షకులను కథకు కనెక్ట్ చేస్తుంది. ఇక సినిమా ముగింపులో ఏం జరుగుతుందనే ఊహించిన ప్రేక్షకులకు మంచి ఎమోషనల్ ఎండింగ్‌ను ఇవ్వడం దర్శకుడి ప్రతిభకు అద్దంపట్టింది.

18 Pages దర్శకుడి ప్రతిభ గురించి
దర్శకుడు సుకుమార్ ఆలోచనకు రూపమైన 18 పేజేస్ కథను ఆయన రైటింగ్ టీమ్ విస్తరించిన తీరు బాగుంది. కథలో ట్విస్టులను, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ జొప్పించిన తీరు సినిమాను క్లాస్‌గా మార్చింది. దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటీ స్క్రిప్టును తెరపైన మలిచిన విధానం బాగుంది. నేటితరం అలోచనలు, పోకడలను చక్కగా చూపించడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

నిఖిల్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?
ఇక డిఫరెంట్ కథలను ఎంచుకొని ఫీల్‌గుడ్ సినిమాలను అందించే నిఖిల్ మరోసారి వినూత్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కార్తీకేయ 2 సినిమా తర్వాత ఏర్పడిన భారీ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకోకుండా ఇలాంటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడం సాహసమే. కానీ కోవిడ్‌కు ముందు ఒప్పుకొన్న సినిమా కావడం, ఈ చిత్రాన్ని ప్రేక్షకులను ఒప్పించేలా చేయడం నిఖిల్ కలిసి వచ్చే అంశంగా మారింది. నేటితరం యూత్‌కు రిప్రజెంటీవ్‌గా ఉండే సిద్దూ పాత్రలో నిఖిల్ ఒదిగిపోయాడు. కీలక సన్నివేశాల్లో అద్భుతంగా ఎమోషన్స్ పండించాడు. తన క్యారెక్టర్‌కు తగినట్టగా వేరియేషన్స్‌ను పలికించడంలో సక్సెస్ అయ్యాడు.

అదరగొట్టిన అనుపమ పరమేశ్వరన్
ఇక అనుపమ పరమేశ్వరన్ మరోసారి వండర్‌పుల్‌గా నందిని క్యారెక్టర్‌ను పండించింది. మానవీయ విలువలు, ప్రేమ, అప్యాయతలు కలబోసిన పాత్రకు వన్నె తెచ్చేలా నటించింది. సహజసిద్దంగా అనుపమ నటించి మెప్పించిందని చెప్పవచ్చు. పల్లెటూరు నుంచి వచ్చిన యువతిగా అనుపమ హావభావాలను ప్రదర్శించింది. ఇక మిగితా పాత్రల విషయానికి వస్తే.. బిగ్‌బాస్ కంటెస్టెంట్, యూట్యూబర్ సరయు ఒక మంచి పాత్రలో కనిపించింది. తన ఇమేజ్‌కు భిన్నంగా ఉండే పాత్రలో ఒదిగిపోయింది.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. శ్రీకాంత్ విస్సా మరోసారి తన పెన్ను పవర్ చూపించాడు. వసంత్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. ప్రేమకథను కావాల్సిన ఫీల్‌గుడ్ సీన్లను అద్బుతంగా తెరకెక్కించారు. గోపి సుందర్ మ్యూజిక్ బాగుంది. కానీ ఒక ప్రేమకథను మరో లెవెల్‌కు తీసుకెళ్లడంలో సంగీతం లేకపోవడం మైనస్ అనిపిస్తుంది. నవీన్ నూలి ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు ఫర్వాలేదనిపిస్తుంది. బన్నీ వాసు పాటించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి.

ఫైనల్‌గా మూవీ గురించి
యువతపై సోషల్ మీడియా ప్రభావం, లవ్, ఎమోషన్స్, తల్లిదండ్రులతో అనుబంధం అనే ఫీల్‌గుడ్ అంశాలతో రూపొందిన చిత్రం 18 Pages. అయితే ప్రేమ లేఖ, గుండెజారి గల్లంతయ్యింది లాంటి సినిమాలు గుర్తుకు వస్తుంటాయి. అయితే వాటి ప్రభావం కనిపించకుండా సినిమాను మంచి ఎమోషనల్ చిత్రంగా రూపొందించారు. ప్రేమకథతో కూడిన భావోద్వేగమైన చిత్రాలను చూసే వారికి ఈ సినిమా తప్పుకుండా నచ్చుతుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరువైతే 18 పేజేస్ సినిమా కమర్షియల్‌గా భారీ విజయం సాధించే అవకాశం ఉంది.