Don't Miss!
- Finance
Intel: షాకిచ్చిన ఇంటెల్ త్రైమాసిక ఫలితాలు.. ఒక్క రోజులోనే 8 బిలియన్ల డాలర్ల నష్టం..
- Sports
అర్ష్‌దీప్ సింగ్ వైఫల్యానికి కారణం అదే: మహమ్మద్ కైఫ్
- News
మరోసారి భగ్గుమన్న తాడిపత్రి
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
1945 movie review రానా దగ్గుబాటి హిట్టు కొట్టాడా? రెజీనా ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?
Rating: 1.5/5
నటీనటులు: రానా దగ్గుబాటి, రెజీనా కసాండ్రా, సత్యరాజ్, నాజర్, కాలి వెంకట్, సప్తగిరి తదితరులు
నిర్మాత: సీ కల్యాణ్
రచన, దర్శకత్వం: సత్యశివ
సినిమాటోగ్రఫి: సత్య పన్మార్
ఎడిటింగ్: గోపికృష్ణ
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా
బ్యానర్: కే ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2022-01-07

1945 కథ ఏమిటంటే?
నేతాజి సుభాష్ చంద్రబోస్ 1945లో బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించిన సమయంలో తన కుటుంబ వ్యాపారాలను చూసుకొనేందుకు ఆది (బర్మా)కు వెళ్తాడు. బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసే తహసీల్దార్ (నాజర్) కూతురు (రెజీనా)తో నిశ్చితార్థం జరుగుతుంది. ఆ సమయంలో బ్రిటిష్ పాలన, వారు అనుసరిస్తున్న విధానాలపై ఆదికి అసంతృప్తి పెరుగుతుంది. ఆ పరిస్థితుల్లో బ్రిటీష్ పాలకులపై పోరాటం చేయాలని ఆది నిర్ణయించుకొంటాడు.

1945 కథలో ట్విస్టులు
తహసీల్దార్ కూతురు (రెజీనా)తో నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆది జీవితంలో ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకొన్నాయి? బ్రిటీష్ పాలకులకు ఎదురు తిరగాలని నిర్ణయించుకొన్న ఆదికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. ఆది స్నేహితుడిగా సప్తగిరి పాత్ర ఏమిటి? నాజర్; సత్యరాజ్ పాత్రలు కథకు ఎలా సపోర్ట్‌గా మారాయి? చివరకు ఆది ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? బ్రిటీష్ పాలకులపై ఎలా పోరాటం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే 1945 సినిమా కథ.

దర్శకుడి పనితీరు..
1945 సినిమా కోసం దర్శకుడు సత్యశివ ఎంచుకొన్న పాయింట్ విభిన్నమైనది. కాకపోతే కథ, కథనాలపై సరైన కసరత్తు జరుగలేదనే విషయం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నిర్మాత ఆర్థికంగా నష్టపోవడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొంటుందా అనే సందేహాలు తలెత్తాయి. అయితే ఈ సినిమా అసంపూర్తిగా మిగిలిపోయింది. నిర్మాతతో సంబంధాలు తెగిపోయాయి అని రానా ట్వీట్ చేయడం బట్టి ఈ సినిమా అనేక సమస్యలు ఎదుర్కొన్నదనే విషయం తెర మీద స్పష్టం కనిపించింది. తన పరిధి, శక్తి మేరకు సినిమాను నాణ్యతతో చిత్రీకరించాలనే తపన దర్శకుడిలో కనిపించింది. స్వాతంత్రం పూర్వం జరిగిన కొన్ని ఊహాజనిత సన్నివేశాలను తెర మీద బాగా చిత్రీకరించాడని చెప్పవచ్చు.

రానా దగ్గుబాటి, రెజీనా కసాండ్రా గురించి
ఆదిగా రానా దగ్గుబాటి పాత్రలో ఒదిగిపోయాడు. కీలక సన్నివేశాల్లో తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. సినిమా ఎదుర్కొన్న సమస్యల కారణంగా రానా ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడంలో విఫలమయ్యాడని కనిపిస్తుంది. ఫైట్స్, యాక్షన్ సీన్లలో ఆకట్టుకొన్నాడు. ఇక రెజీనా సాంప్రదాయ పాత్రలో గ్లామర్ పంట పండింది. నటనకు స్కోపు ఉన్న పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నించిందని చెప్పవచ్చు.

సపోర్టింగ్ రోల్స్‌లో
మిగితా క్యారెక్టర్లలో రానా (ఆది) స్నేహితుడిగా సప్తగిరి నటించాడు. తనదైన కామెడీతో అక్కడక్కడా ఫన్ క్రియేట్ చేశాడు. తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించాడు. ఇక నాజర్ మంచి పాత్రలో నటించాడు. సినిమాకు బలంగా మారే పాత్రలో ఆకట్టుకొన్నాడు. సత్యరాజ్ కూడా తన పాత్రలో జీవించాడు. ఆయన పాత్ర పరిధి పెద్దగా లేకపోవడంతో తన వంతుగా న్యాయం చేసే ప్రయత్నం చేశాడు.

సినిమాటోగ్రఫి, మ్యూజిక్ గురించి
టెక్నికల్ విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సాంకేతిక నిపుణులు అద్భుతంగా తమ ప్రతిభను చాటుకొన్నారు. యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ బాగుంది. కొన్ని సన్నివేశాలను రీరికార్డింగ్ ఎమోషనల్‌గా మార్చిందని చెప్పవచ్చు.
సత్య పన్మార్ సినిమాటోగ్రఫి బాగుంది. పిరియాడిక్ మూడ్‌ను తెర మీద ప్రతిబింబించడంలో సత్య తన వంతు కృషి చేశాడు. గోపికృష్ణ
అందించిన ఎడిటింగ్ బాగుంది. ఈ సినిమాకు తెలుగు డైలాగ్స్ ఆకుల శివ అందించాడు. డైలాగ్స్ కూడా ఆకట్టుకొనేలా ఉన్నాయి

బలం, బలహీనతలు
ప్లస్ పాయింట్స్
రానా, రెజీనా కసాండ్రా
మ్యూజిక్, సినిమాటోగ్రఫి
మైనస్ పాయింట్స్
కథ, కథనాలు
డైరెక్షన్‌లో లోపాలు
కథలో భావోద్వేగం లేకపోవడం
నాసిరకంగా తెరకెక్కించడం
Recommended Video

ఫైనల్‌గా
బ్రిటీష్ పాలకులపై సమరభేరి మోగించిన ఓ పోరాట యోధుడి కథగా 1945 మూవీ రూపొందింది. అయితే చాలా రోజులుగా ఈ సినిమా మూలన పడటం, బడ్జెట్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నడం కారణంగా సినిమా నాసిరకంగా కనిపిస్తుంది. సినిమా చూసినంత సేపు ఏదో అసంతృప్తి వెంటాడుతుంటుంది. పూర్తి సినిమా అనే ఫీలింగ్ కనిపించదు. ఏదో సినిమాను చుట్టేస్తే సరిపోతుందనే నిర్మాత, దర్శకుల ఫీలింగ్ తెరపైన కనిపిస్తుంది. మంచి కథ, నటీనటులు ప్రతిభ పూర్తిస్థాయిలో వర్కవుట్ కాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. దాంతో ఈ సినిమా యావరేజ్‌గా కూడా అనిపించదు. ఈ సినిమాకు వెళ్లాలా? లేదా అనేది ప్రేక్షకులకు వదిలివేయడం మంచిదనిపిస్తుంది.