For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  1948 Akhanda Bharat movie review గాంధీ హత్య ఎందుకు జరిగింది? కుట్రలకు సజీవ రూపం

  |

  మహాత్మాగాంధీ హత్యా నేపథ్యంతో చారిత్రాత్మక సంఘటనలను ఆధారంగా నిర్మించిన చిత్రం 1948 అఖండ భారత్. మర్డర్ ఆఫ్ మహాత్మ అనునది ఉపశీర్షిక. ఈ చిత్రానికి డాక్టర్ ఆర్య వర్ధన్ రాజ్ కథ,కథనం, మాటలు ,రీసెర్చ్ ‌తో మూలస్థంభంగా నిలిచారు. నూతన దర్శకుడు ఈశ్వర్ బాబు డి దర్శకత్వం వహించారు. సుమారు 120 సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన ఎంవై మహర్షి ఈ చిత్రాన్ని ఎంవైఎం క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని కలిగించిందంటే..

  1948 Akhanda Bharat movie review and rating

  1948 అఖండ భారత్ కథ ఏమిటంటే?
  బాపూజీ గాంధీ హత్యకు 45 రోజుల ముందు చోటుచేసుకొన్న యదార్ధ సంఘటనలు, గాంధీ హత్య ,హత్యానంతరం పరిణామాలు, నిందితుల గాలింపు, కేసు దర్యాప్తు, నిందితుల విచారణ, కోర్లులో నాథురాం గాడ్సే వాదనలు, ఉరితీత, కోర్టు తీర్పును నిషేధించడం, అప్పటి ప్రభుత్వపు నాటకీయ పరిణామాల నేపథ్యంగా కథను తెరకెక్కించారు.

  కథలో ట్విస్టులు ఇలా
  గాంధీని గాడ్సే ఎందుకు చంపారు? ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది? గాంధీ హత్య వెనుక కారణాలు ఏంటి? కోర్టులో గాడ్సే వాగ్మూలాన్ని ఎందుకు బయటకు రాకుండా అప్పటి ప్రభుత్వం చేసింది? అతి కిరాతకంగా గోడ్సే శవాన్ని ఎందుకు దహనం చేశారు? గాడ్సే జీవితానికి ఆధారాలు లేకుండా చేయడానికి చేసిన కుట్రలకు తెర మీద సమాధానమే 1948 అఖండ భారత్ కథ.

  1948 అఖండ భారత్ చిత్రాన్ని సుమారు 11 వేలకుపైగా పేజీల పరిశోధన, 300 లకు పైగా పుస్తకాల అధ్యయనం, 750 పైగా వ్యక్తులు, ప్రముఖులను కలిసి డాక్టర్ ఆర్యవర్థన్ రాజ్ సేకరించిన సమాచారం ఆధారంగా తెరకెక్కించారు. ఈశ్వర్ బాబుకు తొలి చిత్రమైనా అనుభవం ఉన్న దర్శకుడిలా ఈ సినిమాను వెండితెరపైన ఆవిష్కరించారు. గాంధీ హత్య వెనుక కుట్రలు, గాడ్సే జీవితానికి సంబంధించిన మరుగున పడిన విషయాలను ఆసక్తికరంగా తెరకెక్కించారు. పాత్రలను తెర మీద మలచిన తీరు ఆయన దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతుంది.

  అప్పటి కాలాన్ని ప్రతిబింబించేలా చేసిన ఆర్ట్ విభాగం పనితీరు ఆకట్టుకొంటున్నది. ఈ సినిమాలోని పాత్రలు సజీవంగా ఉండేందుకు 500 పైగా క్యాస్టూమ్స్ ముఖ్యంగా ఖాదీ వస్త్రాలతో చేయడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. చంద్రశేఖర్ సినిమాటోగ్రఫి అప్పటి కాలాన్ని ప్రతిబింబిచేలా చేసింది. ప్రజ్వల్ క్రిష్ మ్యూజిక్ బాగుంది. రాజు జాదేవ్ ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. గాంధీ హత్యా నేపథ్యంలో వచ్చే పాటను శశి ప్రీతం అద్బుతంగా ఆలపించారు. ఎంవై మహర్షి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చు విషయంలో రాజీ లేకుండా తెరెకెక్కించిన తీరు.. తెరపైన ప్రతీ సీన్ తెలియజెప్పుతుంది.

  గాంధీ హత్యకు ముందు, హత్య తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా చరిత్రకు అందని విషయాలతో రూపొందిన చిత్రం 1948 అఖండ భారత్. చరిత్రలో కనుమరుగైన సంఘటనలకు సజీవ రూపంగా ఈ చిత్రం నిలిచింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. చరిత్ర ఆధారంగా రూపొందే సినిమాలను, బయోపిక్స్‌ను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

  నటీనటులు: డాక్టర్ ఆర్యవర్ధన్ రాజ్, రఘనందన్, సమ్మెటగాంధీ, జెన్నీ, ఇంతియాజ్ ఆలీ, శరద్ ద్భవాల, సుహాస్, దుర్గాప్రసాద్, నవీన్ మాదాసు, నాగరాజు నన్నపనేని, తదితరులు
  దర్శకత్వం: ఈశ్వర్ బాబు డీ
  నిర్మాత: ఎంవై మహర్షి
  గీత రచన, కథ, కథనం, డైలాగ్స్, రీసెర్చ్: డాక్టర్ ఆర్యవర్ధన్ రాజ్
  సంగీతం: ప్రజ్వల్ క్రిష్
  సినిమాటోగ్రఫీ: ఎస్ ఆర్ చంద్ర శేఖర్
  నేపథ్యగానం: శశి ప్రీతం
  ఎడిటింగ్: రాజు జాదేవ్
  నిర్మాణ సంస్థ: ఎం వై ఎం క్రియేషన్స్
  రిలీజ్ డేట్: 2022-08-12

  English summary
  1948 Akhanda Bharat movie review and rating
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X