twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2.O మూవీ రివ్యూ అండ్ రేటింగ్: గ్రాఫిక్స్‌తో ఇంద్రజాలం

    |

    Recommended Video

    #2point0 Movie Review And Rating 2.O మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Filmibeat Telugu

    Rating:
    3.0/5
    Star Cast: రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్, సుధాంశు పాండే, ఆదిల్ హుస్సేన్
    Director: ఎస్ శంకర్

    భారతీయ సినిమా చరిత్రలోనే తొలిసారిగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం 2.O. అత్యాధునిక 3.డీ టెక్నాలజీ, సరికొత్త కెమెరాలు, పరికరాలతో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ అద్భుతమైన సైంటిఫిక్‌, ఫిక్షన్‌గా ఈ సినిమాను రూపొందించారు. 600 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రానికి రజనీకాంత్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. సుమారు 4 సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం నవంబర్ 29న దక్కబోతున్నది. ప్రపంచవ్యాప్తంగా 10 స్క్రీన్లలో ప్రదర్శించనున్న ఈ చిత్రం ఎలాంటి టాక్‌ను సంపాదించుకొందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    2.O మూవీ స్టోరీ

    2.O మూవీ స్టోరీ

    చెన్నై నగరానికి సమీపంలో ఉన్నట్టుండి మొబైల్ ఫోన్లు మాయ అవుతుంటాయి. దానికి కారణాలను అన్వేషించడానికి వశీకరణ్ (రజనీకాంత్) రంగంలోకి దిగుతాడు. మొబైల్ ఫోన్ల అదృశ్య కావడానికి కారణం ఓ వ్యక్తిలో ఉండే తేజస్సు (అరోమా) అని తెలుసుకొంటాడు. ఆ తేజస్సు ఎవరిదో అని పసిగట్టే బాధ్యతను చిట్టి రోబో (రజనీకాంత్) కు అప్పగిస్తాడు. అంతేకాకుండా తన అసిస్టెంట్ వెన్నెల (అమీ జాక్సన్) కూడా ఈ పనిలో భాగస్వామ్యం చేస్తాడు. పక్షిరాజు (అక్షయ్ కుమార్) అనే వ్యక్తి మొబైల్ ఫోన్ల అదృశ్యానికి కారణం తెలుసుకొంటాడు.

    2.O మూవీ ట్విస్టులు

    2.O మూవీ ట్విస్టులు

    మొబైల్ ఫోన్లను పక్షిరాజు ఎందుకు లాగేసుకొంటున్నాడు? వశీకరణ్ అప్పగించిన పనిని చిట్టి రోబో ఎలా పూర్తి చేశాడా? 2.O అప్‌డేటెడ్ వెర్షన్ చిట్టి రోబోను రంగంలోకి దించడానికి కారణమేంటి? మొబైల్ ఫోన్లు ఉపయోగించే వారిపై ఆగ్రహంతో ఉన్న పక్షిరాజు పరిస్థితి ఏమిటి? 2.O చిత్రంలో చిన్ని 3.O పాత్ర ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే 2.O కథ.

    ఫస్టాఫ్‌లో

    ఫస్టాఫ్‌లో

    పక్షిరాజు ఆత్మహత్య చేసుకొనే ఎమోషనల్ పాయింట్‌తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మొబైల్ ఫోన్లను అపహరించడం లాంటి అంశాలు కొంత ఆసక్తిని రేపుతాయి. చిట్టి రంగంలోకి దిగిన తర్వాత సినిమా యాక్షన్ మోడ్‌లోకి వెళ్తుంది. అయితే తొలిభాగంలో ఎలాంటి ఎమోషన్స్, చమక్కులు లేకపోవడం ప్రేక్షకుడిని నిరాశకు గురిచేస్తుంది. గ్రాఫిక్స్ తప్ప ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా ఫస్టాఫ్ ముగుస్తుంది.

    2.0: ఆ ట్వీట్ చూసి తెలుగు ఫ్యాన్స్‌కి మండుతోంది... ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా!2.0: ఆ ట్వీట్ చూసి తెలుగు ఫ్యాన్స్‌కి మండుతోంది... ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా!

    సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో

    ఇక సెకండాఫ్‌లో పక్షిరాజు ఉద్వేగ భరితమైన కథ కొంత ఆసక్తిగా ఉంటుంది. కానీ ఆ ఎపిసోడ్‌ ప్రేక్షకుడి హృదయానికి హత్తుకునేలా లేకపోవడం కొంత ప్రతికూలత అని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో అప్‌డేట్ వెర్షన్ చిట్టి రోబో రాకతో సినిమాలో ఉత్సాహం, ఉత్తేజం పెరుగుతుంది. చివరిక పక్షిరాజు, చిట్టి రోబో మధ్య జరిగే పోరాటాలు గ్రాఫిక్ పరంగా అద్భుతంగా ఉంటాయి. స్టేడియంలో యాక్షన్ సీన్లు తెరమీద ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. రోబో చిన్ని 3.0 ఎంట్రీతో కొంత వినోదం దక్కుతుంది. ఓ సామాజిక సమస్యకు అర్ధవంతమైన పరిష్కారం చెప్పకుండా డిప్లోమాటిక్‌గా సినిమాకు తెర పడుతుంది.

     దర్శకుడు శంకర్ ప్రతిభ

    దర్శకుడు శంకర్ ప్రతిభ

    సమకాలీన సామాజిక సమస్య నేపథ్యంగా 2.O చిత్రంతో దర్శకుడు శంకర్ మరోసారి ప్రేక్షకులకు ముందుకొచ్చాడు. సినిమా కోసం చేసిన రీసెర్చ్ ముచ్చటేసేలా ఉంటుంది. రెగ్యులర్ డైరెక్టర్లను చూస్తే శంకర్ ఓ పరిశోధకుడిలా కనిపిస్తాడు. మొబైల్ ఫోన్ల వినియోగం వల్ల వచ్చే అనర్ధాలను పర్యావరణంలో కోణంలో చేసిన అటెంప్ట్‌ను అభినందించాల్సిందే. కానీ సినిమాను వినోదభరితంగా, భావోద్వేగంగా మార్చడంలో తడబాటుకు గురైనట్టు కనిపిస్తాడు. సామాజిక సమస్యను బాలెన్స్‌గా చెప్పి ప్రేక్షకుడిని కన్విన్స్ చేయడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు. తొలిభాగంలో ప్రేక్షకుడిని మరో లోకానికి తీసుకెళ్లే ప్రయత్నం పెద్దగా చేసినట్టు కనిపించదు. కాకపోతే సెకండాఫ్‌లో టెక్నాలజీని ఉపయోగించుకొన్న తీరు బాగుంటుంది. కాకపోతే కథకు పెద్దగా ప్రాధాన్యం కలిగించకపోవడం మరో మైనస్ అని చెప్పవచ్చు.

    రజనీకాంత్ ఫెర్ఫార్మెన్స్

    రజనీకాంత్ ఫెర్ఫార్మెన్స్

    వశీకరణ్‌గా రజనీకాంత్ పాత్రలో పెద్దగా వైవిధ్యం ఏమి కనిపించదు. ఇక చిట్టి రోబో, అప్ డేటెడ్ చిట్టి పాత్రలు ఆకట్టుకొనేలా ఉంటాయి. అప్ డేటేట్ రోబో పాత్ర ద్వారా కొన్ని సీన్లలో వినోదం ఉంటుంది. ముఖ్యంగా కథలో భాగంగా రజనీకాంత్ పాత్ర కనిపిస్తుంది. కథలో ప్రభావవంతమైన పాత్ర రజనీకాంత్‌కు దక్కలేదనే చెప్పవచ్చు. సూపర్‌స్టార్ నటనను పూర్తిగా ఆస్వాదిస్తామని వచ్చిన ప్రేక్షకులకు కొంత నిరాశే మిగులుతుంది. పూర్తిగా గ్రాఫిక్స్ మయం కావడంతో పాటలకు స్కోప్ లేకుండా పోవడం, రజనీ మార్క్ స్టయిల్ తక్కువగానే కనిపిస్తుంది.

    అక్షయ్ కుమార్ నటన

    అక్షయ్ కుమార్ నటన

    ఇక పక్షిరాజుగా అక్షయ్ కుమార్ కనిపిస్తాడు. అటు విలన్ పాత్ర అని చెప్పడానికి వీలు లేకుండా, ఇటు ప్రభావవంతమైన క్యారెక్టర్ రోల్ అని చెప్పుకోవడానికి వీలు లేకుండా కనిపించాడు. సెకండాఫ్‌లో పక్షిరాజు పాత్ర హైలెట్‌గా నిలుస్తుంది. అతిగా మేకప్ చేయడం వల్ల అక్షయ్ ఆనవాళ్లు ఎక్కడా కనిపించవు. కాకపోతే రోల్ ప్రభావం కథలో కనిపిస్తుంది. అక్షయ్ కెరీర్‌లో అంతగా గుర్తించుకునేంత రోలేమి కాదని చెప్పవచ్చు.

     ప్రాధాన్యత లేకుండా అమీ జాక్సన్

    ప్రాధాన్యత లేకుండా అమీ జాక్సన్

    2.O చిత్రంలో గ్లామర్‌కు, హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం కనిపించదు. ఎలాంటి ప్రాధాన్యం లేని పాత్రలో అమీజాక్సన్ కనిపించింది. ఈ చిత్రంలో అమీ జాక్సన్‌ది ఓ స్పెషల్ క్యారెక్టర్. ఆ కారణంగానే గ్లామర్ పండలేదు. నటనకు పెద్దగా స్కోప్ లేదు. ఒకే పాట కూడా ఉండటం మూలాన అమీ ఆకట్టుకోలేకపోయింది.

     విజువల్ ఎఫెక్ట్స్ అదుర్స్

    విజువల్ ఎఫెక్ట్స్ అదుర్స్

    2.O మూవీకి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ వర్క్స్ ప్రాణంగా నిలిచాయి. హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా గ్రాఫిక్స్‌ను రూపొందించడంలో శంకర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. నీరవ్ షా సినిమాటోగ్రఫి బాగుంది. యాక్షన్ సీన్లను అద్బుతంగా తెరకెక్కించాడు. హలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా కొన్ని సీన్లు కనిపిస్తాయి.

    ఆకట్టుకోలేని రెహ్మాన్ మ్యూజిక్

    ఆకట్టుకోలేని రెహ్మాన్ మ్యూజిక్

    2.O చిత్రానికి ఏఆర్ రెహ్మన్ మ్యూజిక్ అందించాడు. సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు రీరికార్డింగ్ బాగుంది. పాటలుకు పెద్దగా ప్రాధాన్యం లేని సినిమా కావడంతో సాంగ్స్ ఎలివేట్ కాలేదని చెప్పవచ్చు. ఓ స్లో సాంగ్ ఆకట్టుకోలేకపోయింది. రొమాంటిక్ సాంగ్ ఎండ్ టైటిల్స్‌లో వేయడం వల్ల వృథాగా మారిందని చెప్పవచ్చే. బలమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల రెహ్మాన్ సంగీతానికి స్కోప్ లేకుండా పోయింది.

    ఇతర సాంకేతిక అంశాలు

    ఇతర సాంకేతిక అంశాలు

    2.O సినిమా నిడివి కూడా తక్కువే కాబట్టి చకచక సీన్లు పరుగులు పెట్టాయి. ఎక్కువగా యాక్షన్ సీన్లు కావడంతో లెంగ్తీగా ఉన్నాయి. వాటికి తోడు గ్రాఫిక్స్ కూడా తోడు కావడం వల్ల సీన్లలో నిడివి సమస్య కానరాలేదు. ఎడిటర్ ఆంథోని ప్రతిభకు కొన్ని సీన్లు పరీక్షగానే మారాయి.

     సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్

    సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్

    అంతర్జాతీయ స్థాయిలో భారతీయ ప్రతిభను చాటిచెప్పే ప్రయత్నంగా 2.O మూవీని సన్ పిక్చర్స్ రూపొందించింది. క్వాలిటీ కోసం నిర్మాణ వ్యయంపై వెనుకడుగు వేయలేదు. భారతీయ సినిమా పరిశ్రమలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందించిన చిత్రంగా నిలిచింది. హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు కనిపిస్తాయి. కథ, కథనాలపై జాగ్రత్త పడి ఉంటే మరింత మెరుగైన ఫలితాన్ని సాధించే అవకాశం ఉండేదేమో.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    సామాజిక అంశంతో తెరకెక్కిన చిత్రం 2.O. ఈ సినిమా కథను ప్రభావవంతంగా చెప్పడంలో దర్శకుడు శంకర్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాడనే చెప్పవచ్చు. కాకపోతే అద్భుతమైన సైంటిఫిక్ ఫిక్షన్ మూవీగా రూపొందించే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు. ఈ మూవీకి బీ, సీ సెంటర్లలో ఆదరణ లభిస్తే భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. అంతేకాని భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయే చిత్రమని చెప్పడం కష్టమే.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్

    • శంకర్ డైరెక్షన్
    • రజనీకాంత్, అక్షయ్ కుమార్ యాక్టింగ్
    • టెక్నికల్ అంశాలు
    • వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్
    • మైనస్ పాయింట్స్

      • కథ
      • పాత్రల డిజైన్
      • ఎమోషనల్‌గా ఆకట్టుకోలేకపోవడం
      • ఏఆర్ రెహ్మాన్ ప్రభావం కనిపించకపోవడం
      • తెర ముందు, తెర వెనుక

        తెర ముందు, తెర వెనుక

        నటీనటులు: రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ తదితరులు
        కథ, దర్శకత్వం: ఎస్ శంకర్
        నిర్మాత: ఏ సుభాష్ కరణ్, రాజు మహాలింగం
        మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్
        సినిమాటోగ్రఫి: నీరవ్ షా
        ఎడిటింగ్: ఆంథోని
        బ్యానర్: లైకా ప్రొడక్షన్
        రిలీజ్ డేట్: 2018, నవంబర్ 29
        నిడివి: 147 నిమిషాలు
        బడ్జెట్: రూ. 600 కోట్లు

    English summary
    India's biggest-ever movie 2.0. Shankar's magnum opus will release worldwide in three languages (Tamil, Telugu and Hindi) in unprecedented 10,000+ screens with the advance booking getting an outstanding response from the public.Rajinikanth, Akshay Kumar are going to rock in theatres. Amy Jackson ready for set the fire on screen. This movie set to release on November 29. In this occassion, Telugu Filmibeat brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X