2018 Movie review హృదయాన్ని హత్తుకొనే ఎమోషన్స్.. గుండెను పిండేసే క్లైమాక్స్

Rating: 3/5

నటీనటులు: టొవినో థామస్, లాల్ నారైన్, అపర్ణా బాల మురళి, కళైరాసన్, అజు వర్గీస్, వినీత్ శ్రీనివాసన్ తదితరులు
దర్శకత్వం: జ్యూడ్ అంథోని జోసెఫ్
నిర్మాతలు: వేణు కున్నప్పిల్లి, సీకే పద్మ కుమార్, ఆంటో జోసెఫ్
మ్యూజిక్ డైరెక్టర్: నబిన్ పాల్
సినిమాటోగ్రఫి: అఖిల్ జార్జ్
ఎడిటర్: చామన్ చక్కో

అనూప్ (టొవినో థామస్) మాజీ సైనికుడు. చావంటే భRating: 3/5
యంతో సైన్యం నుంచి బయటకు వస్తాడు. ఐటీ ఉద్యోగి రమేష్ (అజు వర్గీస్)కు దాంపత్య జీవితంలో సమస్యలు ఉంటాయి. ఇద్దరు విదేశీయులు కేరళలో పర్యటిస్తుంటారు. ట్యాక్సీ డ్రైవర్ సేతుపతి పేలుడు పదార్థాలు సరఫరా చేస్తుంటాడు. మాతచన్ (లాల్) ఆయన కుమారుడు విన్స్‌టన్ (నరైన్) చేపలు పట్టుకొంటూ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కేరళలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు కురవడం వల్ల వరదలు అనేక గ్రామాలను ముంచెత్తుతాయి.

కేరళలను వరదలు ముంచెత్తడం వల్ల ప్రజల జీవన విధానం ఎలా స్తంభించింది? కేరళ వాసులు ఎలాంటి ఇబ్బందులకు గురిచేసాయి. జీవితంలో అనేక సమస్యలు ఉన్న సమయంలో కేరళ వరదలు వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపించాయి? చావంటే భయపడే అనూప్ వరదల సమయంలో ఎలా రియాక్ట్ అయ్యారు. వరద విపత్తు ప్రజలను ఎలా అతలా కుతలం చేశాయి అనే ప్రశ్నలకు సమాధానమే 2018 సినిమా కథ.

2018 Movie review

2018 సినిమా కథ, కథనాల విషయానికి వస్తే.. తొలి భాగం పాత్రల పరిచయం, కథను ఎస్టాబ్లిష్ మెంట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో సినిమా చాలా స్లోగా సాగినట్టు కనిపిస్తుంది. కానీ కథకు బలంగా మారే పాత్రలను ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం దర్శకుడు అనుసరించిన తీరు బాగుంటుంది. కేరళకు భారీ వర్ష సూచన రావడంతో అధికారులు అప్రమత్తమయ్యే తీరు, ప్రజలు రాబోయే విపత్తుపై ఫీలయ్యే సీన్లు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. చిన్న చిన్న ఎమోషన్స్‌తో 2018 సినిమా కథ సాఫీగా సాగిపోతుంది.

2018 Movie review

2018 సినిమా కథ అంతా సెకండాఫ్‌లో ఉండటంతో ప్రేక్షకుడు అనుక్షణం థ్రిల్లింగ్‌గా ఫీలయ్యే అవకాశం కలిగింది. వరదల సమయంలో ప్రజలు పడే ఇబ్బందులను, ప్రాణాలు బిగ్గపట్టి రక్షణం కోసం వేచి చూసే బాధితుల ఎమోషన్స్ ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉంటాయి. కాలనీలను, ఇండ్లను వరదలు ముంచెత్తిన తీరును చాలా సహజంగా ఉండటమే కాకుండా మనసును కకావికలం చేస్తాయి.ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సీన్లు హృదయాన్ని పిండేస్తాయి.

2018 Movie review

2018 సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ మూవీకి మ్యూజిక్ బలం అని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో సన్నివేశాలను మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసిందని చెప్పవచ్చు. సీన్లు హృదయానికి హత్తుకుపోయేలా సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. ఇక భారీ వరదల ఎఫెక్ట్స్‌ను సినిమాటోగ్రఫి అద్బుతంగా పండించింది. చాలా వరకు సీన్లు రియల్ తుఫాన్ చూస్తున్నామా అనే అనుభూతిని కలిగిస్తుంది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు కూడా బాగుంది.

2018 Movie review

టెక్నికల్ అంశాలు, కథ, కథనాలు, సన్నివేశాల్లో ఎమోషన్స్ ఆధారంగా సాగే చిత్రం 2018. ఫస్టాఫ్ సాదా సీదాగా సాగితే.. సెకండాఫ్‌లో ఎమోషన్స్ పీక్స్ ఉంటాయి. పాత్రలను మలిచిన విధానం, కథనం సాగిన విధానం ఈ సినిమాకు హైలెట్. క్లైమాక్స్ గుండెను పిండేస్తుంది. మలయాళంలో 2018 సినిమా రికార్డు కలెక్షన్లు సాధిస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం 130 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయితే భారీ కలెక్షన్లు సాధించే అవకాశం కూడా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X